జోడీ రిపీట్‌? | Shruthi Haasan to romance with ntr once again | Sakshi
Sakshi News home page

జోడీ రిపీట్‌?

Published Sat, Apr 25 2020 4:13 AM | Last Updated on Sat, Apr 25 2020 4:21 AM

Shruthi Haasan to romance with ntr once again - Sakshi

ఎన్టీఆర్, శ్రుతీహాసన్‌

‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్ర కోసం శ్రుతీహాసన్‌ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‌ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement