Ala Vaikunthapurramloo: Ramuloo Ramulaa Song Teaser | Allu Arjun | SS Thaman - Sakshi
Sakshi News home page

‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’

Published Tue, Oct 22 2019 4:18 PM | Last Updated on Tue, Oct 22 2019 4:57 PM

Ala Vaikunthapurramuloo Second Song Teaser Released - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అల వైకుంఠపురములో..’. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఎంతటి హిట్‌ టాక్‌ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని బన్నీ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌, బన్నీ డైలగ్‌, ఫస్ట్ సాంగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.

‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్‌ సంగీతం అందించగా అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’అని సాగే సాంగ్‌ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా ‘సామజవరగమన’చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా విడుదల చేసిన పాట ఇదే ఊపులో భారీ హిట్‌ సాధించే అవకాశం ఉంది. 

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమా ఫలితం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్‌ సినిమాతో భారీ హిట్‌ కొట్టి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరామ్‌, సుశాంత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement