
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు....
Comments
Please login to add a commentAdd a comment