SSMB 28: Mahesh Babu Film With Trivikram Story Line Out - Sakshi
Sakshi News home page

SSMB28: కథ అవుట్‌, ఆ సినిమాలో మహేశ్‌ పేరే టైటిల్‌!

Published Wed, May 5 2021 5:31 PM | Last Updated on Wed, May 5 2021 8:03 PM

SSMB 28: Mahesh Babu Film With Trivikram Story Line Out - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇటీవల వీరిద్దరి కాంబోపై ఇటీవల ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎదోఒక అప్‌డేట్‌ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ పక్కప్లాన్‌తో చేస్తున్న ఈ మూవీ స్టోరీలైన్‌, టైటిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో హరిక హాసిని బ్యానర్‌లో చినబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పార్థు’ అనే టైటిల్‌ను ఖారారు చేశారని, ఇందులో మహేశ్‌ మధ్య తరగతి కటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడనే వార్త కూడా వైరల్‌ అవుతోంది. ఇందులో హీరో తండ్రి ఓ డాన్‌ అని, అది తెలియక హీరో కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందట. ఇక ఆ తర్వాత అతడే తన తండ్రి అని తెలిశాక హీరో ఎలాంటి స్టేప్‌ తీసుకుంటానేది ఈ కథ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా అతడు మూవీ మహేశ్‌ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే.

డాన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తీసుకోవాలని భావిస్తున్నారట త్రివిక్రమ్‌. ఈ తండ్రీకొడుకుల వార్‌ను ఆసక్తికరంగా మలిచేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ఇందులో మహేశ్‌ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. 

చదవండి: 
SSMB28: మరోసారి మహేశ్‌తో రొమాన్స్‌ చేయనున్న ఆ హీరోయిన్‌

SSMB28: వచ్చే ఏడాది సమ్మర్‌కు రానున్న క్రేజీ కాంబో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement