
హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఇప్పటికే ఈ మూవీలోని అన్ని పాటలు అందరినీ అలరించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఈ చిత్రంలోని పాటలతో ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment