‘అర్జున్‌ రెడ్డి పార్ట్‌-2’ అని పెట్టాను.. | Ala Vaikunthapurramloo Deleted Scene Released | Sakshi
Sakshi News home page

‘అర్జున్‌ రెడ్డి పార్ట్‌-2’ అని పెట్టాను..

Published Mon, Mar 16 2020 6:36 PM | Last Updated on Mon, Mar 16 2020 6:49 PM

Ala Vaikunthapurramloo Deleted Scene Released - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్‌ చేసిన ఓ సీన్‌ను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్‌, సుశాంత్‌ మధ్య సాగే  సన్నివేశాలను ఆ వీడియోలో చూపించారు.

స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద  ఉన్న సుశాంత్‌ వద్దకు వచ్చిన బన్నీ.. తను షార్ట్‌ ఫిల్మ్స్‌ తీస్తున్నానని చెప్తాడు. సుశాంత్‌ మద్యం సేవిస్తున్న వీడియోని చూపించి.. దీనికి అర్జున్‌రెడ్డి పార్ట్‌ 2 అని పేరు పెట్టానని చెప్తాడు. దీంతో కంగారు పడిపోయిన సుశాంత్‌ నేనేం చేయాలి అని బన్నీని అగుడుతాడు. ఆ తర్వాత​ సుశాంత్‌ సిటీ బస్సు వెనక పరుగెడతాడు. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు ఈ సీన్‌ సినిమాలో పెట్టి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. 

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళీ శర్మ,  సుశాంత్‌, సముద్రఖని, జయరామ్‌, నివేదా పేతురాజు ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement