త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ‘వనవాసం’ | Trivikram Launches Vanavasam Movie Poster And Title | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 8:01 PM | Last Updated on Sat, Jan 5 2019 8:14 PM

Trivikram Launches Vanavasam Movie Poster And Title - Sakshi

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి  నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు  పూర్తి చేసుకొంది. రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్ర టైటిల్‌, పోస్టర్‌లను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు.  

ఈ సందర్బంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు వనవాసం టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీం అందరికి అల్‌ ది బెస్ట్‌’  చెప్పారు. భరత్ కుమార్.పి  నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్ తమ సినిమా టైటిల్ ని మెచ్చుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగిందన్నారు. సినీ అభిమానులందరూ మెచ్చుకునే విధంగా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement