poster launched
-
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, అభినందనలు తెలిపారు. ‘‘ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
-
144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవిష్కరించిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోని గ్లింప్సెస్‌ను పొందుపరుస్తూ ఐసీసీ రూపొందించిన ఈ పోస్టర్లో భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే 1998-99లో పాక్‌పై సాధించిన 10 వికెట్ల ఫీట్‌ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఈ చర్య కుంబ్లేను ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టేనంటూ ఊగిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, 1877లో మెల్బోర్న్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదలుకుని.. నేటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన కొన్ని గ్లింప్సెస్‌తో ఐసీసీ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్, అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండుల్కర్, స్టీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ తదితర దిగ్గజాల ఫొటోలను ముద్రించింది. ఈ విషయంలో ఐసీసీ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ.. కొన్ని అరుదైన ఫీట్లను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదుగా చెప్పుకునే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత సాధించిన అనిల్ కుంబ్లేకు చోటు లభించకపోవడంపై భారతీయ అభిమానులు ఊగిపోతున్నారు. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్
హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం ‘మర్డర్’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా మరో పోస్టర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (యాంకర్ని పొగిడిన ఆర్జీవీ..) ఇక ఫాదర్స్ డే సందర్భంగా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుంది’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..) Am overwhelmed with the emotional intensity portrayed by @AvanchaSahithi in this pic from MURDER #LoveCanMURDER pic.twitter.com/AZvhM4EyaC — Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2020 MURDER is “మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ" #LoveCanMURDER pic.twitter.com/NEfVZp6NRJ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 MURDER is a story of extremes ..EXTREME LOVE resulting in EXTREME HATE and culminating in EXTREME VIOLENCE #LoveCanMURDER pic.twitter.com/7SN7fS9uUZ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 -
29 నుంచి ‘అరకు ఉత్సవ్’
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ‘అరకు ఉత్సవ్–2020’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ వ్యవహరిస్తారన్నారు. ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, డిపార్ట్మెంట్కు సంబంధించిన స్టాల్స్ 10 వంతున ఉంటాయన్నారు. అడ్వంచర్‌కు సంబంధించి పారామోటరింగ్ డే ట్రిప్, ఏటీవీ బైక్ రైడ్, రాప్లింగ్, జిప్ సైక్లింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్ తదితర క్రీడలు ఉంటాయన్నారు. ఏపీ ఐటీడీఏ బృందాలచే ట్రైబల్ ఫోక్ డాన్స్‌లు, క్లాసికల్ డ్యాన్స్‌లు, మ్యూజికల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాటితో పాటు గ్రామీణ క్రీడలైన కోకో, కబడ్డీ, విలువిద్య, వాలీబాల్, రంగోలి పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి, మెమొంటోలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జేసీ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చైనా నుంచి క్షేమంగా ఇంటికి..) -
దేవరకొండ ప్రేమకథ
విజయ్ శంకర్, మౌర్యాని జంటగా వెంకటరమణ ఎస్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’. శివత్రి ఫిలిమ్స్ పతాకంపై వడ్డాన మన్మథరావు నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘మంచి కథాంశంతో రూపొందిన సినిమాకు అపజయమంటూ ఉండదు. విజయ్ శంకర్ అందంగా ఉన్నాడు. టైటిల్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మేం అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. బడ్జెట్లో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. శ్రీకాంత్‌గారి చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించడం మా విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నాం’’ అన్నారు వడ్డాన మన్మథరావు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. కథను నమ్ముకునే ఈ ప్రాజెక్టు చేపట్టాం. హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటరమణ. ‘‘నాకిది తొలి సినిమా. నా కెరీర్లో ఇదే నిజమైన దీపావళి’’ అన్నారు విజయ్ శంకర్. ‘‘ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ చాలా బాగుంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు సదాచంద్ర. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ సంతోష్. ఎస్. -
త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘వనవాసం’
నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్ర టైటిల్, పోస్టర్లను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు వనవాసం టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీం అందరికి అల్ ది బెస్ట్’ చెప్పారు. భరత్ కుమార్.పి నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్ తమ సినిమా టైటిల్ ని మెచ్చుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగిందన్నారు. సినీ అభిమానులందరూ మెచ్చుకునే విధంగా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. -
రేస్ 3 పోస్టర్ లాంఛ్
సాక్షి, న్యూఢిల్లీ : యాక్షన్ థ్రిల్లర్ మూవీ రేస్ 3 షూటింగ్లో జమ్మూ కశ్మీర్లో బిజీబిజీగా గడుపుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మూవీకి సంబంధించిన తాజా పోస్టర్‌ను తన ట్విటర్లో విడుదల చేశారు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో గన్ పట్టుకుని ఉన్న సల్మాన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటను యూనిట్ తెరకెక్కిస్తోంది. రేస్ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు విడుదలైన మూవీల్లో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించారు. ఇక రేస్ 3లో బాలీవుడ్ కండలవీరుడు ఎలా ఒదిగిపోతారన్నది ఆసక్తికరంగా మారింది. సల్మాన్, జాక్వెలిన్‌తో పాటు అనిల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, దరువలా, అమిత్ సాధ్‌లు ఇతర తారాగణం. రేస్ 3లో ఓ పాటలో సోనాక్షి సిన్హా కూడా కొద్దిసేపు మెరిసినట్టు భావిస్తున్నారు. టిప్స్ ఫిల్మ్స్ పతాకంపై రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందిన రేస్ 3 జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. -
డిసెంబర్ 21 నుంచి వెంటపడతా..
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎవరి వెంట పడుతున్నారని అనుకుంటున్నారా?. షారుఖ్ వెంట పడేది రియల్‌గా కాదు. తన కొత్త సినిమా ‘జీరో’లో. సోమవారం సినిమా పేరును, టీజర్‌ను షారుఖ్ విడుదల చేశారు. మంగళవారం జీరో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్రేడ్ అనలిస్టు ఆదర్శ్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. జీరో చిత్రంలో షారుఖ్ మరగుజ్జు వ్యక్తిగా నటిస్తున్నారు. డిసెంబర్ 21 నుంచి మీ వెంటే.. అనే ట్యాగ్ లైన్ పోస్టర్లో ఉంది. షారుఖ్ విడుదల చేసిన టీజర్లో ‘హమ్ జిస్కె పిఛే లగ్ జాతే హై, ఉస్కి లైఫ్ బన్ జాతి హై(మేము ఎవరి వెంటైతే పడతామో వారికి లైఫ్ ఉంటుంది అని అర్ధం)’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. షారుఖ్ ఎవరి వెంటైనా పడితే వారికి కొత్త జీవితం దొరుకుతుందన్న మాట. చూద్దాం కింగ్ ఖాన్ జీరో సినిమాలో ఎవరి వెంట పడాతారో, ఎవరికి లైఫ్ ఇస్తారో. -
తప్పకుండా నచ్చుతుంది
స్వదేశానికి వచ్చిన యువకుడు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడన్న కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘జయం కొండాన్’. వినయ్, భావన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ‘మార్గం’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘వాణిజ్య హంగులు ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆర్. కన్నన్ అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: బాల సుబ్రమణ్యం. -
సమైక్య శంఖారావం పోస్టర్ విడుదల
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోవడం అసాధ్యమని, సమైక్య రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 26న జరిగే సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మొదటి నుంచి ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే నిజాయితీగా పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఒక్క జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం పూనుకుందన్నా రు. ఓట్లు, సీట్లు కోసమే చంద్రబాబు చూస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలివెళ్లేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు బీవీఆర్ చౌదరి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేటి సత్యనారాయణ, గద్దె వీరకృష్ణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి, కొయ్యలగూడెం మండల కన్వీనర్ ఆర్ఎస్ఎస్వీబీఏ నరసింహరాజు, పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, నాయకులు అల్లూరి రంగారావు, టి.నరసాపురం మండల నాయకులు యర్రా గంగాథర్, శ్రీనురాజు పాల్గొన్నారు.