డిసెంబర్‌ 21 నుంచి వెంటపడతా.. | Shah Rukh Khan will follow you from 21st December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 21 నుంచి వెంటపడతా..

Published Tue, Jan 2 2018 8:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Shah Rukh Khan will follow you from 21st December - Sakshi

ముంబై : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఎవరి వెంట పడుతున్నారని అనుకుంటున్నారా?. షారుఖ్‌ వెంట పడేది రియల్‌గా కాదు. తన కొత్త సినిమా ‘జీరో’లో. సోమవారం సినిమా పేరును, టీజర్‌ను షారుఖ్‌ విడుదల చేశారు. మంగళవారం జీరో సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ట్రేడ్‌ అనలిస్టు ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. జీరో చిత్రంలో షారుఖ్‌ మరగుజ్జు వ్యక్తిగా నటిస్తున్నారు.

డిసెంబర్‌ 21 నుంచి మీ వెంటే.. అనే ట్యాగ్‌ లైన్‌ పోస్టర్‌లో ఉంది. షారుఖ్‌ విడుదల చేసిన టీజర్‌లో ‘హమ్‌ జిస్‌కె పిఛే లగ్‌ జాతే హై, ఉస్‌కి లైఫ్‌ బన్‌ జాతి హై(మేము ఎవరి వెంటైతే పడతామో వారికి లైఫ్‌ ఉంటుంది అని అర్ధం)’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. షారుఖ్‌ ఎవరి వెంటైనా పడితే వారికి కొత్త జీవితం దొరుకుతుందన్న మాట. చూద్దాం కింగ్‌ ఖాన్‌ జీరో సినిమాలో ఎవరి వెంట పడాతారో, ఎవరికి లైఫ్‌ ఇస్తారో.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement