రాష్ట్రం విడిపోవడం అసాధ్యమని, సమైక్య రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్,
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోవడం అసాధ్యమని, సమైక్య రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 26న జరిగే సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మొదటి నుంచి ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే నిజాయితీగా పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం పూనుకుందన్నా రు. ఓట్లు, సీట్లు కోసమే చంద్రబాబు చూస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలివెళ్లేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు బీవీఆర్ చౌదరి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేటి సత్యనారాయణ, గద్దె వీరకృష్ణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి, కొయ్యలగూడెం మండల కన్వీనర్ ఆర్‌ఎస్‌ఎస్‌వీబీఏ నరసింహరాజు, పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, నాయకులు అల్లూరి రంగారావు, టి.నరసాపురం మండల నాయకులు యర్రా గంగాథర్, శ్రీనురాజు పాల్గొన్నారు.