సాక్షి, జంగారెడ్డిగూడెం: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరు కారణంగా ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు.
ఇదే సమయంలో ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించాలంటూ ప్రభుత్వాన్ని డ్రైవర్లు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రహదారిని దిగ్బంధం చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డ్రైవర్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’
Comments
Please login to add a commentAdd a comment