Samaikya Shankaravam
-
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
విజయనగరం కలెక్టరేట్/కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : నాలుగు నెలలు ఓపిక పడితే రాష్ట్రంలోని అన్ని వర్గా ల ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరి గిన విధంగా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా...సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపు రం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభ అనంతరం స్థానికులు పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దళితుల ను వేధిస్తున్నారని.. సంక్షేమ పథకాలు అందకుండా బినా మీ పేర్లతో దోచుకుంటున్నారని మాలమహానాడు జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకొండ వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కంచేరు పరిధిలో 118 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని మహానేత వైఎస్ ఆదేశిస్తే... స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ భూముల ను ఆక్రమించుకున్నారని చెప్పారు. తామంతా వైఎస్సార్ సీపీ వెంట ఉండడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చీపురుపల్లి తహశీల్దార్ రామకృష్ణను అధికార పార్టీ నేతలు బలవంతంగా సస్పెండ్ చేయించిన విషయూన్ని అక్కడి నాయకులు జగన్మోహన్రెడ్డికి వివరించారు. వీటిపై స్పందిం చిన జగన్మోహన్రెడ్డి త్వరలోనే రాజన్న రా జ్యం వస్తుందని, అందరి సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఉపకార వేతనాలు అందడం లేదు.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న ఉద్దేశంతో మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజుల పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొ డుస్తున్నారని విద్యార్థి సమైక్య సేవా సంఘం అధ్యక్షుడు వై. రాజేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి 15 ల క్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదన్నారు. దీనిపై స్పందించిన జగన్.. మన ప్రభుత్వంలో విద్యా ర్థులందరికీ ఫీజు పథకాన్ని వర్తింపచేద్దామన్నారు. విద్యార్థులతో ముచ్చటించిన జగన్ భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వి ద్యార్థులు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, కలి సి మాట్లాడేందుకు కాసేపు నిరీక్షించారు. ఆ మార్గం వెంబడి వస్తున్న జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఎదురుగా నిలిచారు. దీన్ని గమనించిన ఆయన తన వాహనంలోని నుంచి కిం దకి దిగి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకోవా లని సూచించారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భోగాపురం మండలం సాయికవలస గ్రామానికి చెందిన అం ధు డు రామప్పడును వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయంగా పలకరించారు. వైఎస్సార్ సీపీలో ఖలీల్‌ఖాన్ చేరిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఖలీల్‌ఖాన్ ఆ పా ర్టీకి గుడ్‌బై చెప్పారు. జిల్లాలోని భోగాపురంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆయన వైఎస్సార్ సీపీ లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఖలీల్ఖాన్తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కూడా పార్టీలో చేరారు. సమైక్యమే.. మా నినాదం కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయూలు ఇంకెన్నాళ్లూ సాగవు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. కుట్ర రాజకీయూలకు స్వస్తి చెప్పి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు.. భవిష్యత్తు మనదేనని వైఎస్సార్ సీపీ నేతలు భరోసా ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం మండలంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. డ్వాక్రా రుణాల రద్దు మహిళల కు వరమన్నారు. ‘అమ్మఒడి’ పథకంతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందుతున్నారు. పార్టీ నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే..... - న్యూస్‌లైన్, చీపురుపల్లి (భోగాపురం) దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి కాంగ్రెస్, టీడీపీ నాయలకు దమ్ముంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ కీయంగా ఎదుర్కొనాలి. టీడీపీ నేత చంద్రబాబులా ప్రాంతాల మధ్య విధ్వే శాలు రెచ్చగొట్టకుండా మా నేత మొదటి నుంచీ సమైక్యవాదంతో నే పోరాటం చేస్తున్నారు. ఆయన్ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవా లి. కాంగ్రెస్, టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అం దుకే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. - బేబీనాయన, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జగన్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రంలో స్వర్ణయుగం రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కా వాలి. రాష్టాన్ని రావణకాష్టంలా మార్చిన కాంగ్రెస్, టీడీపీలను సాగనం పాలి. రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలి. జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలి. - కాకర్లపూడి శ్రీనివాసరాజు, కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఇదో చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు. బడుగు, బలహీనవర్గాల అభ్యన్నతి కోసమే వైఎస్సార్ పని చేశారు. మళ్లీ ఆయన పరిపాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయన నాయకత్వం అధికారంలోకి రావాలి. - పెనుమత్స సురేష్‌బాబు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బొత్స వల్లే జిల్లాకు చెడ్డ పేరు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వల్ల జి ల్లాకు చెడ్డ పేరు వస్తోంది. ఆయన మంత్రి అ య్యూక జిల్లాలో ప్రజల జీవన విధానాన్ని మా ర్చేశారు. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా అవినీతి పాలన సాగిస్తున్నారు. - కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త ఆ రెండు పార్టీలు ఒక్కటే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలు ఉనికిని కాపాడుకు నేందుకు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్రం బాగుండాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయూలి. - వేచలపు వెంకటచినరామునాయుడు, ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త కాంగ్రెస్‌ది నిరంకుశ పాలన రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో, కేంద్రంలో కాం గ్రెస్ ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రాన్ని విడదీస్తున్నాయి. దీనికి టీడీపీ నేత చంద్రబాబు మద్దతు పలకడంతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. విభజనకు నిరసనగా మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే. - సుజయ కృష్ణ రంగారావు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కుళ్లు రాజకీయాలకు స్వస్తి చెప్పండి రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయూలకు ప్రజలు చరమగీతం పాడాలి. కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం కలిసి ఉన్న ప్రజలను విడదీశారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు నిదర్శనం. స్వర్ణయుగం రావాలన్నా.. రా ష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. - పెనుమత్స సాంబశివరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్ అంటే కాంగ్రెస్, టీడీపీలకు భయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు చెబితే కాంగ్రెస్, టీడీపీ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి రక్షించేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నది జగన్మోహర్రెడ్డి ఒక్కరే. జగన్‌కు మద్దతు ఇస్తే భవిష్యత్ బాగుంటుంది. - విజయ చందర్, సినీ నటుడు వైఎస్ లక్షల మందికి దేవుడయ్యారు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేసి, లక్షల మందికి దేవుడయ్యా రు. ఆరోగ్యశ్రీతో లక్షలాది మంది ప్రాణాలు రక్షించారు. మ ళ్లీ ఆయన పాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి కావాలి. - బొత్స కాశీనాయుడు, జిల్లా వైద్య విభాగం కన్వీనరు రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తోంది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజించి ప్రజలను మోసం చేస్తోంది. - గేదెల తిరుపతిరావు, ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త రాహుల్‌ను ప్రధాని చేసేందుకే.... రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోంది. దేశంలో ఆమెకు ఓటు లేకపోయినప్పటికీ ఒక్కటిగా ఉన్న ఆంధ్రులను మాత్రం విడదీస్తోంది. ఇదెక్కడి న్యాయం. ఈ ప్రభుత్వానికే ప్రజ లే బుద్ధి చెప్పాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైని కుల్లా పని చేయాలి. - ఆదాడ మోహనరావు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనరు -
సిక్కోలులో జగన్‌కు ఘనస్వాగతం
-
'రాష్ట్ర చరిత్రను మార్చేది ఆ నాలుగు సంతకాలే'
-
'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు'
-
గాజువాకలో జగన్ సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన జనం
-
సిక్కోలు సమరోత్సాహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొనే ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు శ్రీకాకుళం సర్వసన్నద్ధమైంది. ఢిల్లీ పెద్దల అహంకారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తెలుగు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్‌కు జిల్లా బాసటగా నిలవనుంది. ఆయన హోరెత్తిస్తున్న సమైక్యాంధ్ర నినాదానికి జిల్లా ప్రజానీకం సంఘీభావం ప్రకటించనుంది. అందుకోసం జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది తరలిరానున్నారు. శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో కీలక ప్రజాప్రతినిధులు, అనుయాయులతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ చారిత్రక రాజకీయ ఘట్టానికి సిక్కోలు సర్వసన్నద్ధమై సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. ప్రతిధ్వనించనున్న ‘సమైక్య’ వాణి సిక్కోలు వేదికగా సమైక్యాంధ్ర నినాదం ప్రతిధ్వనించనుంది. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి భారీస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కాంక్షించే ప్రజానీకం తరలిరానున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో వివిధ వాహనాలను సిద్ధం చేసుకున్నారు. బహిరంగ సభ నిర్వహించనున్న ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంతోపాటు శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతస్థాయిలో జనం తరలిరావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర భావనను ప్రతిబింబించే రీతిలో శ్రీకాకుళం జనంతో కిటకిటలాడనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర స్ఫూర్తి వెల్లివిరిసేలా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ అనుచరగణంతో పార్టీలో చేరనున్న ధర్మాన సమైక్య శంఖారావం సభలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో అనుయాయులతోమ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన అనుయాయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన పార్టీలో చేరుతారు. జిల్లాలో కాం గ్రెస్ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే రీతిలో చేరికలకు ధర్మాన రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇతర కీలక కాంగ్రెస్, టీడీపీనేతలు ఆయనతోపాటు సుమారు వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆదివారం పార్టీలో చేరనున్న నేతలు, కార్యకర్తల కోసం బహిరంగ సభ నిర్వహించే మైదానంలో ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని కేటాయించడం విశేషం. బహిరంగ సభలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరుకానున్నారు. భారీ ర్యాలీ జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆయన శ్రీకాకుళం సింహద్వారం వద్దకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభిస్తారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చే మోటారుబైక్‌లతో ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీకి ముందుగా ఓపెన్‌టాప్ వాహనంపై కళా బృందాల ప్రదర్శన ఉంటుంది. సింహద్వారం వద్ద ప్రారంభమయ్యే భారీ ర్యాలీ కొత్తబ్రిడ్జి, డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్డు మీదుగా బహిరంగ సభ జరిగే మున్పిపల్ పాఠశాల మైదానానికి చేరుకుంటుంది. ర్యాలీ సాగే దారి పొడుగునా మహిళలు, విద్యార్థులు జగన్‌కు స్వాగతం పలకనున్నారు. సర్వాంగ సుందరంగా మైదానం ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగన్‌కు ఉన్న విశేష ప్రజాదారణకు అద్దం పట్టేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలిరానున్న ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానంలో 30ఁ 60 సైజుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. పాల్గొనేవారందరికీ జగన్ బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమైక్య శంఖారావం పేరిట భారీ ఫ్లెక్సీని వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఏర్పాటు చేస్తున్నారు. మైదానమంతా జగన్ ఫ్లెక్సీలతో అలంకరించారు. సభాస్థలి వద్ద గాలిలో బెలూన్లు కూడా ఎగురవేయనున్నారు. ఇక మైదానంలో చోటులేక బయట నిలిచిపోయ వేలాదిమంది సైతం బహిరంగ సభను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కూడలి, రేమండ్స్ షోరూం, పాతబస్టాండ్, పాత బ్రిడ్జిల వద్ద పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి బహిరంగ సభను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మైదానంలో ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపుగా జనం బయట ఉండే అవకాశం ఉన్నందున ఎవరూ నిరుత్సాహపడకుండా ఈ ఏర్పాటు చేశారు. సమైక్య శక్తిని చాటాలి: కృష్ణదాస్ సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పేలా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు సమైక్యాంధ్ర కాంక్షించే వారంతా వై.ఎస్.జగన్ చేస్తున్న పోరాటానికి బాసటగా నిలవాలన్నారు. అందుకోసం శ్రీకాకుళంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
నేడు సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ భోగాపురం, న్యూస్‌లైన్:పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగోసారి జిల్లాకొస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. దారి పొడవునా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ పతాకాలతో జాతీయ రహదారి కళకళలాడుతోంది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభ జరిగే భోగాపురం మరింతగా ముస్తాబైంది. జిల్లా ముఖ ద్వారమైన రాజాపులోవలో అభిమానుల స్వాగత సంబరాల మధ్య జననేత జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధినేతను భోగాపురం వరకు తీసుకురానున్నారు. మార్గ మధ్యలో తిలకం దిద్ది, హారతులిచ్చి స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. కాగా, బహిరంగ సభ ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, అరకు పార్లమెంట్ పరిశీలకుడు బేబీనాయన, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనురాజు తదితరులు పర్యవేక్షించారు. భారీగా ఏర్పాట్లు భోగాపురం మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం వద్ద జరగనున్న సమైక్యశంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద భారీ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా పార్టీ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. సభాస్థలిని సందర్శించిన డీఎస్పీ సమైక్య శంఖారావం నిర్వహించనున్న సభాస్థలిని డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. జగన్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున చేయాల్సిన ఏర్పాట్లపై సీఐ కె.శ్రీనివాస్ చక్రవర్తి, ఎస్ఐ షేక్సర్దార్ఘనిలతో చర్చించారు. పార్లమెంటు సమన్వయకర్త బే బీనాయన, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడ మోహనరావు తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండల కన్వీనర్లు సబ్బవరపు వెంకటరమణ, మహంతి లక్ష్మణణరావు, దారపు లక్ష్మణరెడ్డి, మట్ట వెంకటరమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇమ్మిడిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతం చేయండి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న సమైక్య శం ఖారావం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ఆర్ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పార్టీ పట్టణ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని, ఆయన హయంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. అలాంటి నాయకుడి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి ఎపుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి రాలేమన్న దుగ్ధతోనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కల్యాణి, నాయకులు మార్పు ధర్మారావు, అంధవరపు సూరిబాబు తదితరులు మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ, శ్రీకాకుళం పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పార్టీ నేతలు ప్రధాన రాజేంద్ర, గేదెల పురుషోత్తం, టి.కామేశ్వరి, జె.ఎం.శ్రీనివాస్, కిల్లి వెంకట సత్యనారాయణ, పైడి రాజారావు, ఎన్ని ధనుంజయ్, మహమ్మద్ సిరాజుద్దీన్, అసదుల్లా, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, చల్లా మంజుల, టి.మోహిని, సీహెచ్.సీతారత్నం, గంగు శారద, బిడ్డిక లక్ష్మి, పీస శ్రీహరి, తంగి శివప్రసాద్, బహుదూర్ జానీ, కోరాడ రమేష్, పైడి గోపాలం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావం సభకు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద గల ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మైదానంలో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, ధర్మాన ప్రసాదరావుల భారీ హోర్డింగ్ పలువురి ఆకర్షిస్తోంది. పార్టీలో చేరనున్న ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకోసం, యువత కోసం వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలతో కళకళ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం జిల్లాకు రానుండడంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. పట్టణంలోని పాలకొండ రోడ్డు నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో రోడ్లన్నీ కలకలలాడుతున్నాయి. పట్టణంలోని వివిధ కూడళ్ళ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బ్యానర్లను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభ జిల్లా నుంచే ప్రారంభం కావడంతో బహిరంగ సభ కోసం మున్సిపల్ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భారీ ఎత్తున హోర్డింగ్‌లు, కటౌట్లు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. శోభాయమానంగా వైఎస్ విగ్రహం సమైక్య శంఖారావం సభ సందర్భంగా శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించారు. బహిరంగ సభకు ముందు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించనుండడంతో విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పర్యవేక్షించిన ధర్మాన మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు పార్టీలో చేరుతుండడంతో జగన్మోహన్రెడ్డి, ధర్మానతో కూడిన భారీ ఫ్లెక్సీలను రోడ్డు పొడవునా ఏర్పాటు చేశారు. ధర్మానతో పాటు పట్టణంలోని ద్వితీయ శ్రేణి కేడరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరుతుండడంతో పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద నాయకులు, ధర్మాన అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. బహిరంగ సభ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ధర్మాన ప్రసాదరావు పరిశీలించారు. శనివారం సభాస్థలికి వచ్చిన ఆయన నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నాయకులు, ధర్మాన అనుచరులు కూడా సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల పార్కింగ్ ఎక్కడంటే.. శ్రీకాకుళం క్రైం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభకు వచ్చే వాహనాలకు పలు పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలి పారు. కొత్తబ్రిడ్జి మీదుగా అంబేద్కర్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ వరకు, పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎటువంటి భారీ, నాలుగు చక్రాల వాహనాలు అనుమతించరని తెలిపారు. ఎచ్చెర్ల, పొందూరు వైపు నుంచి వచ్చే వాహనాలు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు మీదుగా వచ్చి లక్ష్మీటాకీస్ దగ్గరలో వాహనాలు పార్కింగ్ చేసుకొని పాతబ్రిడ్జి వద్దగల కాజ్‌వేపై నుంచి రావాలి. ఆమదాలవలస వైపు నుంచి వచ్చే వాహనాలు పెదపాడు రోడ్డు మీదుగా, రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో గానీ, రిమ్స్ ఆస్పత్రి మీదుగా ఆర్ట్స్ కళాశాల రోడ్డులో కానీ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. నరసన్నపేట వైపు నుంచి హైవే మీదుగా వచ్చే వాహనాలు రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. గార, ఒప్పంగి వైపు నుంచి వచ్చే వాహనాలు అరసవల్లి మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయాలి. వేలాది వాహనాలతో ర్యాలీ శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలోని ఎన్టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను అధిక సంఖ్యలో ప్రజలు, ధర్మాన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ధర్మాన అనుచరుడు మామిడి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని నాగావళి హోటల్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రానున్నారని తెలిపారు. పట్టణ ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలకనున్నామని, 500 మోటార్ బైక్‌లు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్ మీదుగా సభాస్థలికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు సుమారు 1000 మంది వరకూ వైఎస్సార్సీపీలో చేరతారని తెలిపారు. సమావేశంలో ధర్మాన రాంమనోహర్‌నాయుడు, కోణార్క్ శ్రీను, కిల్లి వెంకట సత్యనారాయణ, మండవిల్లి రవి, గుడ్ల మోహనరావు, పొన్నాడ రుషి, మట్ట శ్రీధర్ పాల్గొన్నారు. -
ఆ ముగ్గురికీ బుద్ధి చెబుదాం: వైఎస్ జగన్
సోనియా, కిరణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన జగన్మోహన్రెడ్డి ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలా అని చూస్తున్నారు విభజన నిర్ణయమప్పుడే సీఎం రాజీనామా చేసుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు బాబు తన నేతలతో ఒక వైపు సమైక్యాంధ్ర అనిపిస్తున్నారు.. మరోవైపు విభజన అనిపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనవే.. అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూద్దాం ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయాలు కనిపిస్తున్నాయి. పేదల కోసం పనిచేసే రాజకీయాలు కనుమరుగైపోయాయి. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలా? ఒక వ్యక్తిని ఎలా జైలుకు పంపాలా? అని ఆలోచిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చూస్తున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు.. ఈ ముగ్గురికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘త్వరలోనే ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికల్లో మనం అందరం ఒక్కటవుదాం. ఒక ఉప్పెన సృష్టిద్దాం. ఆ ఉప్పెనతో విభజన కుట్రదారులంతా బంగాళాఖాతంలో కలసిపోతారు. ఎన్నికల్లో 30 పార్లమెంట్ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవరికి వస్తుందో చూద్దాం’’ అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో జగన్ చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర శనివారం విశాఖ జిల్లాలో సాగింది. చోడవరం, గాజువాకలలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో జగన్ ఉద్వేగంగా మాట్లాడారు. నీతిమాలిన రాజకీయాలతో ప్రజలను అమ్మేయడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజన కోసం సోనియా గాంధీ ఎనిమిది నెలల కిందట నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ తన రాజీనామాను ఆమె మొహాన పడేసి ఉంటే పరిస్థితి ఇంతటిదాకా వచ్చేదా? అని ప్రశ్నించారు. జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే.. బాబు భయానక పాలన ఇప్పటికీ గుర్తుంది.. ‘‘వైఎస్ చనిపోయి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇవాళ్టికీ ఎక్కడన్నా ఆయన ప్రస్తావన వస్తే ప్రజలు ‘మా గుండెల్లో ఉన్నార’ని చెప్పే పరిస్థితి. ఆయన పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాముని రాజ్యమైతే మనం చూడలేదుగాని.. రాజశేఖరరెడ్డి సువర్ణయుగం చూశామని చెప్పొచ్చు. వైఎస్ సువర్ణయుగానికి ముందు.. చంద్రబాబు భయానక పాలన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్లినప్పుడు అవ్వా, తాతలు దీన పరిస్థితుల్లో వచ్చి ‘నాయనా పింఛను ఇప్పించండి’ అని అడిగేవారు. పెన్షన్ ఎంత అని విచారిస్తే ముష్టి వేసినట్లు రూ.70 ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 200 మంది వృద్ధులుంటే.. 15 మందికో, 20 మందికో ఇచ్చేవారు. పింఛను అందుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే వారి స్థానంలో కొత్త వారికి పింఛను ఇచ్చే ఘోరమైన రోజులవి. అప్పట్లో తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందే. రైతులంతా వరుస కరువులతో బాధపడుతున్నారని, ఉచిత విద్యుత్తు ఇచ్చి ఆదుకోమని రాజశేఖరరెడ్డి ధర్నాలు, దీక్షలు చేస్తే.. చంద్రబాబు కరెంటు తీగలు చూపించి ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనంటూ అవహేళన చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రాజశేఖరరెడ్డి పోరాటంచేస్తే ‘రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నార’ని చంద్రబాబు ఎగతాళి చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అక్కా చెల్లెళ్లు డ్వాక్రా రుణాలకోసం బ్యాంకులకు వెళ్తే ముక్కుపిండి రూ.1.50 వడ్డీ వసూలు చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏరోజూ ప్రజల గురించి ఆలోచించని చంద్రబాబు.. ఈరోజు ప్రజల కోసం అన్నీ ఉచితమంటూ హామీలిస్తున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారే.. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలను ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టినట్లే పార్లమెంట్‌లోనూ తన ఎంపీలతో ఒకవైపు సమైక్యాంధ్ర అనిపించారు.. మరోవైపు విభజన అనిపిస్తూ హడావుడి చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి సంగతి చూస్తే.. సోనియా గీసిన గీత దాటకుండా సీఎంగా వీలైనంత కాలం కొనసాగడానికి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కిందకు నీళ్లు రాని పరిస్థితి. అలాంటప్పుడు మధ్యలో కొత్తగా ఒక రాష్ట్రాన్ని తెస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఎడారి తప్ప మంచి నీళ్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నా. మన బడ్జెట్లో 60 శాతం నిధులు హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ను విడిచిపెట్టి పొమ్మంటే.. ఆ నిధులు కూడా ఇవ్వకపోతే జీతాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నిస్తున్నా.’’ అపూర్వ స్పందన శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖలోని విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. తరలివచ్చిన అభిమాన సందోహం కారణంగా ఎయిర్‌పోర్టు నుంచి పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకోవడానికి జగన్‌కు 40 నిమిషాలకుపైగానే పట్టింది. చోడవరంలో సభ సాయంత్రం 4 గంటలకే అయినప్పటికీ అడుగడుగునా అభిమానులు తరలిరావడంతో జగన్ రెండు గంటల ఆలస్యంగా సభా స్థలికి చేరుకున్నారు. చోడవరం సభ ముగిశాక గాజువాక వెళ్లి అక్కడ సభలో ప్రసంగించారు. రాత్రి పార్టీ విశాఖనగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఇంట్లో బసచేశారు. శంఖారావం సభల్లో పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, జ్యోతుల నెహ్రూ, ప్రసాదరాజు, సుజయకృష్ణ రంగారావులతోపాటు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పలువురు సమన్వయ కర్తలు పాల్గొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు జగన్ సమైక్య శంఖారావం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించనున్నారు. తొలుత విజయనగరం జిల్లా భోగాపురంలో ఉదయం 11 గంటలకు సభలో నిర్వహిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం తెలిపారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలో సమైక్య శంఖారావం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. -
జన శంఖారావం
-
పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్
-
కొండంత అభిమానం
-
ప్రజలను పట్టించుకోవడం మానేశారు: జగన్
-
'అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించడం మరచిపోయారు'
చిత్తూరు: పేదవాడి వైద్యం కోసం ఆరాటపడింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలోని వరదయ్యపాలెం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని మాత్రమే నేతలు యోచిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను చూస్తే బాధగా ఉందన్నారు. ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చెయ్యడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు. -
ఈ వ్యవస్థను చూస్తే బాధేస్తోంది:వైఎస్ జగన్
చిత్తూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల కుమ్మక్కు రాజకీయాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి కిరణ్, చంద్రబాబులు కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా నాగలాపురం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రస్తుతం రైతులను పట్టించుకునే నాథుడే లేడని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను చూస్తే బాధేస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజల వినిపించే సమైక్య నినాదం ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి వినబడాలన్నారు. 'రానున్న ఎన్నికల్లో మనం ఎక్కువమందిని పార్లమెంట్ కు పంపిద్దాం. అప్పుడు మనరాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవడికుందో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరుంచుతారో...వారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం. ఆమెది మన దేశం కాదు.. మన భాషా రాదు. రాష్ట్రాన్ని మాత్రం విభజిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే అడ్డగోలు విభజన చేస్తున్నారని'జగన్ తెలిపారు. -
రాజకీయమంటే పేదవాడి గుండెచప్పుడు వినాలి:వైఎస్ జగన్
చిత్తూరు:పేదవాడు గుండె చప్పుడు విన్నవాడే అసలైన రాజకీయ నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా పిచ్చాటూరు బహిరంగ సభకు హాజరైన జగన్ ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడకు చేరుకున్న అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. పేదవాడి వైద్యం కోసం పాటు పడ్డ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సారేనని, ప్రస్తుతం పాలిస్తున్న పాలకుల్లో పేదవాడికి సాయపడాలన్న ధ్యాసే కరువైందన్నారు. పేదవారికి వైఎస్సార్ దిక్కుగా నిలిచారన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా సేవ చేసిన నేత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డేనన్నారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినాలన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను చూసి రాష్ట్రాన్ని విడగొడుతున్నారని జగన్ విమర్శించారు. -
చీమ కుట్టినట్టయిన లేదు
రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్న కుట్రలోనే వారు మునిగి తేలుతున్నారు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని నేత కార్మికులు వాపోతున్నారు మద్దతు ధర దక్కక చెరకు రైతులు చెరకు అమ్ముకోలేకపోతున్నారు కిరణ్, బాబులు సొంత జిల్లా ప్రజలనే గాలికొదిలేశారు సోనియా కనుసన్నల్లో ఒకరు.. ప్యాకేజీలకోసం కుమ్మక్కవుతూ మరొకరు.. రాష్ట్రంలో రైతులు, ప్రజలు వేల సమస్యలతో సతమతమవుతున్నా కిరణ్, బాబులకు పట్టడం లేదు: జగన్ ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రైతులు వేలాది సమస్యలతో సతమతమవుతున్నా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చీమకుట్టినట్టయినా లేదని, ప్రజల్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అన్న కుట్రల్లోనే వారు మునిగి తేలుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సొంత జిల్లా ప్రజలనే పట్టించుకోని వీరికి ఇక రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పడతాయని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు జిల్లా నగరి పరిసర ప్రాంతాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. అలాగే చెరకు పండించే రైతులు కూడా. అయితే కరెంటు బిల్లులు కట్టలేక నేత కార్మికులు.. మద్దతు ధర దక్కక చెరకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రికీ పట్టదు. ప్రతిపక్ష నేతకూ పట్టదు’’ అంటూ నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత ఆరో రోజు శనివారం యాత్రలో భాగంగా రాత్రి నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘‘నేను ఈ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు నా దగ్గరకు కొందరు నేత కుటుంబాలకు చెందిన అక్క చెల్లెమ్మలొచ్చారు. వచ్చి.. అన్నా కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలొస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నగరి పరిసరాల్లో 15 వేల మరమగ్గాలున్నాయి. ఒక్కో మగ్గానికి సగటున నెలకు 300 యూనిట్లు కరెంటు ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.3.55 చొప్పున బిల్లు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సర్‌చార్జి అని, ఇంధన చార్జీలని, రకరకాల పేర్లతో కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలు వస్తోంది. అదే పది కిలోమీటర్ల అవతల ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారంటూ ఆ మరమగ్గాల కార్మికులు వాపోయారు. గతంలో దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.1.75 ఉన్న కరెంటు చార్జీలను సగానికి తగ్గించి 87 పైసలకే ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా జీవో కూడా జారీచేశారు. ఆ జీవో కాపీ తీసుకుని కరెంటు వాళ్ల దగ్గరకు వెళితే నాడు దివంగత నేత ఇచ్చిన జీవో ఇప్పుడు చెల్లదంటున్నారని ఆ మరమగ్గాల కార్మికులు వాపోయారు. చెరకు రైతులకు గతేడాది బకాయిలివ్వలేదు నిన్న, మొన్న నేను గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించా. అక్కడ చెరకు విస్తారంగా పండిస్తారు. ఆ రైతులను పలుకరిస్తే ఒళ్లు జలదరించే వాస్తవాలు తెలిశాయి. చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీ నిరుడు రైతుల వద్ద నుంచి కొన్న చెరకుకు చెల్లించాల్సిన బకాయిల్లో ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంవత్సరం ధర ఎంతో ఇప్పటికీ తేల్చలేదు. తోలకం ఖర్చులకు టన్నుకు రూ.300 మాత్రం ఇస్తున్నారు. ఇలా లాభం లేదనుకుని సొంతంగా బెల్లం తయారు చేసుకుందామనుకుంటే ఆ రైతులకు రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి ఉంది. వేలాది మంది రైతులు, నేత కార్మికులు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే ఇదే జిల్లాకు చెందిన సీఎంకు కానీ, ప్రతిపక్ష నేతకు కానీ చీమ కుట్టినట్టయినా లేదు. వీరి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ప్రజల సమస్యలపై కిరణ్, చంద్రబాబుల నిర్లక్ష్యానికి మరో సజీవ సాక్ష్యం నగరి పట్టణంలోనే కనిపించింది. నగరి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్’ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. ఆ మహానేత మరణించి నాలుగేళ్లు దాటుతున్నా ఆ సమ్మర్ స్టోరేజి ట్యాంకుకు ఈ ప్రభుత్వం నీటిని సరఫరా చేయలేదు. ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి పట్టించుకోరు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించరు. ఈ జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీ కొడిగడుతోంది. డైరీ మూతపడింది. నేత కార్మికులు తమ మరమగ్గాలను మూలన పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలేవీ ఈ నాయకులకు పట్టవు. ఇంత అన్యాయమైన విభజన.. ప్రజలకు వంటగ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చార్జీల మోత మోగుతోంది. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 రోగాలను తప్పించేశారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సమస్యల్లో వేటిమీదా అసెంబ్లీలో చర్చించడం లేదు. సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చర్చిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత అన్యాయంగా విభజన ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. రాష్ట్రంలో 70 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నా ఖాతరు చేయకుండా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అని బాధేస్తుంది. సోనియా గీచిన గీత దాటని సీఎం ఉండడం వల్లే ఇంత ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఆమెకు వచ్చింది. పాలక పక్షాన్ని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత ప్యాకేజీల కోసం కుమ్మక్ము రాజకీయాలకు పాల్పడుతుండటం వల్లే సోనియాకు అంత తెగువ వచ్చింది. పై నుంచి దేవుడనే వాడు చూస్తూనే ఉన్నాడు. 70 శాతం మంది రాష్ట్ర ప్రజల ఉసురు తగలక పోదు. సోనియా, కిరణ్, చంద్రబాబు ఈ ముగ్గురినీ బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతో దూరంలో లేదు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. మనమే సొంతంగా 30 పార్లమెంటు సీట్లు సాధించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం.’’ యాత్ర సాగిందిలా.. శుక్రవారం రాత్రి నగరిలో బసచేసిన జగన్ శనివారం ఉదయం తొలుత నగర శివార్లలోని దేశమ్మగుడిలో పూజలు చేశారు. అనంతరం వేలావడిలో వైఎస్ఆర్ సీపీ జెండాను, దేశూరు అగరంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరూరులో వడివేలు కుటుంబాన్ని ఓదార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సత్రవాడ చేరుకున్న జగన్‌ను చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరిలో సభాస్థలిని చేరుకునేందుకు దాదాపు నాలుగున్నర గంటలు సమయం పట్టింది. జగన్ సభాస్థలికి రాత్రి 9.30గంటలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. ఆరో రోజు యాత్రలో జగన్‌తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు రోజా, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ను ప్రధాని చేసేందుకు విభజన:జగన్
నగరి(చిత్తూరు): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆమె తన కొడుకు ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజించేందుకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా నగరి సభకు విచ్చేసిన అశేష జన వాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ' సోనియా గాంధీది మన దేశమూ కాదు..మన భాష కూడా తెలీదు. రాష్ట్రాన్ని మాత్రం అడ్డగోలుగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందాం. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుని కోటను నిర్మిద్దాం' అని వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని, తాగడానికి నీళ్లు కూడా లేవని అక్కా చెల్లెళ్లు అడుగుతుంటే బాధగా ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కనీసం విద్యార్థులకు ఫీజులు కూడా సరిగా చెల్లించడం లేదని సర్కారు పని తీరును తప్పుబట్టారు. సోనియా గాంధీ గీసిన గీతను సీఎం కిరణ్ కుమార్ దాటను గాక దాటరని జగన్ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ ప్యాకేజీలు అడగటం సిగ్గు చేటన్నారు. -
జననేతకు జేజేలు
-
కొత్తపల్లిమిట్ట చేరుకున్న సమైక్య శంఖారావం
-
రాజన్నది సువర్ణపాలన
పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదల చదువులు, ఉపాధి, వైద్యం ఇలా చెప్పుకుంటూపోతే వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు. రామరాజ్యం చూడలేదు కానీ రాజన్నపాలన, సువర్ణ పాలన చూశాం అంటూ కొనియాడారు. ఆయన నారాయణవనం, కార్వేటినగరం సమైక్య శంఖారావం యాత్ర సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత, రెండవ రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలకు జనం మంగళవారం నీరాజనం పలికారు. సమైక్యాంధ్ర నినాదాలతో జగన్ ఫొటో ముద్రించిన స్టిక్కర్లను చేతబట్టుకుని చాలాచోట్ల మహిళలు జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి బయల్దేరిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రెండువేల మందికిపైగా ప్రజలు, కొండలచెరువు గ్రామ మహిళలు పోటీపడ్డారు. వారిని ఆయన పలకరించారు. వారు చెప్పింది ఆసాంతం విన్నారు. సందర్శకులు అందరినీ పలకరించి ఆర్అండ్బీ అతిథిగృహం ముందు హైవే దాటేందుకే గంటన్నరకుపైగా సమయం పట్టింది. ఇక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి చెన్నై హైవే జంక్షన్‌కు వచ్చి రోడ్ షో నిర్వహిస్తూ సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం చేరుకున్నారు. నారాయణవనంలో వైఎస్ విగ్రహావిష్కరణ నారాయణవనం వద్దకు జననేత చేరుకోగానే సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, సత్యవేడు జెడ్పీటీసీ మాజీ సభ్యులు బీరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో చిందులేస్తూ జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ యువకులు ఉత్సాహంగా తమ నాయకుడ్ని ఆహ్వానించారు. వై.ఎస్.జగన్ ఫొటో, ఫ్యాను సింబల్‌తో ఉన్న స్టిక్కర్లు పెట్టుకుని కార్యకర్తలు జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. నారాయణవనంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర సింహం అంటూ నినాదాలు రాశారు. నారాయణవనం కూడలిలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా యువకులు జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సభలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యవేడు సమన్వయకర్త ఆది మూలం, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, ఆర్.కె.రోజా, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎనిమిది కిలోమీటర్లు...నాలుగు గంటలు నగరి నియోజకవర్గంలో మంగళవారం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. చెన్నై బైపాస్ జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణ శివార్లులోని కావమ్మగుడి వరకు జగన్ నిర్వహించిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్‌షోకు సుమారు 4 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. మధ్యలో గంటసేపు భోజనానికి విరామం ఇచ్చారు. పుత్తూరు పట్టణ వీధుల్లో అడుగడుగునా మహిళలు జగన్‌ను చూడాలని కాన్వాయ్ వద్దకు వచ్చారు. దీంతో జగన్ ప్రతి ఒక్కరి వద్ద ఆగి వారికి అభివాదం చేస్తూ, పలుకరిస్తూ, వారి కష్టసుఖాలు అడుగుతూ సాగారు. ఆలస్యమైనా వై.ఎస్.జగన్ రాక కోసం పట్టణంలో రెండు నుంచి మూడు గంటలు మహిళలు పెద్దసంఖ్యలో నిరీక్షిస్తూ ఉండిపోయారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు జగన్‌ను చూసేందుకు ఎండనూ లెక్క చేయకుండా నిలబడ్డారు. పట్టణ శివార్లులోని చిదా స్పిన్నింగ్ మిల్లు వద్ద కార్మికులు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ వారిని పలకరించారు. అలాగే బైపాస్‌రోడ్ జంక్షన్లో బస్సుల్లో నుంచి కిందదిగి చూస్తున్న ప్రయాణికులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఆర్డీఎం గేటు వద్ద ఎదురుచూస్తూ ఉన్న చిన్నారులను పలకరించి వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. వారు తమ అభిమాన నాయకుడికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాస థియేటర్ వద్ద మహిళలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్వేటినగరం రోడ్డు నుంచి బజారువీధిలోకి ప్రవేశించి రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ కిలోమీటరు దూరం వెళ్లేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అడుగడుగునా మహిళలు రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్‌ను ఆపారు. ప్రతి ఒక్కరినీ జగన్ పలకరిస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాపువీధి, విష్ణుమహల్ ప్రాంతాల్లో దుకాణదారులూ జగన్‌ను చూసేందుకు ఆసక్తిగా రోడ్డుపైకి వచ్చి నిలబడడం కనిపించింది. కుంటకట్ట వద్దకు వచ్చిన సందర్భంలో వెంకటమ్మ అనే మహిళ పక్షవాతంతో బాధపడుతోందని మహిళా సంఘాల వారు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే.రోజా దృష్టికి తెచ్చారు. ఆమె విషయం జగన్‌కు తెలిపారు. ఆయన స్పందించి పేదరికంతో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వెంకటమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు వైద్యపరమైన సాయం అందించాల్సిందిగా రోజాకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని రకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే వేదవ్యాస స్కూల్ పిల్లలు జై సమైక్యాంధ్ర నినాదాలు, జగన్ బొమ్మలతో ఉన్న స్టిక్కర్లు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. మార్కెట్‌యార్డు సమీపంలో హిమజా స్కూల్ విద్యార్థులు వందలాది మంది జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం భోజన విరామానికి వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి ఇంటికి వై.ఎస్.జగన్ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎస్బీఐ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఆరేటమ్మగుడి మీదుగా పుత్తూరు పట్టణ శివార్ల వరకు రోడ్‌షో నిర్వహించారు. జగన్ వెంట నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కె.రోజా ఉన్నారు. నెత్తం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో జననేతకు చూసేందుకు పోటీపడ్డారు. బస్సుల్లో వెళుతున్న విద్యార్థులు జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. చిన్నరాజకుప్పం వద్ద ఎస్వీ పెరుమా ల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పార్టీ జెండాలు చేతపట్టి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నెత్తం, కళ్యాణం గ్రామాల మీదుగా జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రారంభ గ్రామం సురేంద్రపురం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు నెత్తం సమీపంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చి వేచివున్న వారిని వై.ఎస్.జగన్ పలకరించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఘనస్వాగతం జీడీ నెల్లూరు నియోజకవర్గం సురేంద్రపురం గ్రామం వద్ద వై.ఎస్.జగన్‌కు నియోజకవర్గ సమన్వయకర్త, కన్వీనర్ కే.నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులందరినీ జగన్ పలకరించారు. పార్టీ బ్యానర్లు తలకు చుట్టుకుని, జెండాలు చేతపట్టి జై జగన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. పద్మాసరస్సు మీదుగా కార్వేటినగరం వరకు రోడ్ షో నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కార్వేటినగరం పోలీసుస్టేషన్ మీదుగా బహిరంగ సభా స్థలి అయిన బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో జగన్‌ను చూసేం దుకు వీధుల్లోని అన్ని మిద్దెలపైన జనం వేచి ఉన్నారు. ఇళ్లలోని వారూ రోడ్డుపైకి వచ్చి జగన్‌ను ఆసక్తిగా చూడడం కనిపించింది. బహిరంగసభా స్థలి వరకు అభిమానులు ఏర్పాటు చేసిన బాణసంచా మోతతో కార్వేటినగరం వీధులు మార్మోగాయి. కార్వేటినగరంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఈ సభకు తమ అభిమాన నాయకుడు రావడం మూడు గంటలు ఆలస్యమైనా జనం కదలకుండా వేచి ఉన్నారు. చివరి వరకు ఉండి జగన్ ప్రసంగం విన్నారు. అక్కడ నుంచి బండరేవు కాలనీ, ఆర్‌కేవీపేట, రాజులకండ్రిగ మీదుగా రోడ్‌షో నిర్వహించారు. పాదిరి కుప్పం, ఆల్లాగుంట, తురకమిట్ట, కొల్లగుంటల్లోనూ ప్రజలను పలుకరిస్తూ రోడ్‌షో చేశారు. ఎన్టీఆర్ నగర్, లక్ష్మీపురంక్రాస్, ముద్దుకుప్పంక్రాస్, సనకుప్పం మీదుగా జగన్ రాత్రి 11 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తూ రాత్రి బస అయిన నెలవాయి చేరుకున్నారు. -
పుత్తూరు చేరుకున్న జగన్ సమైక్య శంఖారావం
-
నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో సోమవారం ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభిస్తారు. విమానాశ్రయం, ఆర్కేపురం, కేఎల్ఎం హాస్పిటల్ జంక్షన్ మీదుగా అత్తూరు క్రాస్ వరకు రేణిగుంట మండలంలో రోడ్‌షో నిర్వహిస్తారు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోకి ప్రవేశిస్తారు. పూడి, కాయం, కాయంపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు మీదుగా తిరిగి వడమాలపేట మండలంలోకి వెళతారు. చింతకాల్వ, పత్తిపుత్తూరు, అప్పలాయగుంట, తిరుమణ్యం, టీఆర్‌కండ్రిగ, గొల్లకండ్రిగ, వడమాల మీదుగా వడమాలపేట వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరులో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. వడమాలపేట నుంచి లక్ష్మీపురం, తడుకు స్టేషన్ మీదుగా పుత్తూరు మండలంలోని మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె, పుత్తూరు అగ్రహా రం, ఈసలాపురం మీదుగా పుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. పుత్తూరులోని కార్వేటినగరం సర్కిల్లో సాయంత్రం నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. రెండవ రోజు 21వ తేదీ కార్వేటినగరంలో సమైక్య శంఖారావం బహిరంగ సభతో పర్యటన ప్రారంభమవుతుంది. ఆర్‌కేవీపేట, చింతమంది క్రాస్, అన్నూరు క్రాస్, అమ్మపల్లె క్రాస్, కొల్లాగుంట, లక్ష్మీపురం మీదుగా ఎస్ఆర్పురం వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. పుల్లూరు క్రాస్, శూలగపల్లె క్రాస్ మీదుగా తెల్లగుండ్లపల్లె చేరుకుంటారు. అక్కడ పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. వేణుగోపాలపురం, ఆదిమాకులపల్లె, గంగమ్మ గుడి, కొత్తపల్లిమిట్టకు చేరుకుంటారు. కొత్తపల్లిమిట్టలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కొటార్లపల్లెలో మిట్టపల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబాన్ని ఓదారుస్తారు. -
జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా
* రెండు రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు * 20 నుంచి నగరిలో పునఃప్రారంభం సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా పడింది. నొప్పి కారణంగా ఇప్పటికే ఆయన తన యాత్రను ఈ నెల 18కి వాయిదా వేసుకున్న విషయం విదితమే. శుక్రవారం మధ్యాహ్నం జగన్‌ను పరీక్షించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. దీంతో ఈ నెల 20న చిత్తూరు జిల్లా నగరి నుంచి యాత్ర పునఃప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. 20వ తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో బయలుదేరి వెళ్లి నగరి నియోజకవర్గంలో యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. -
‘సమైక్య శంఖారావం’ ఒకరోజు వాయిదా
* రేపటి నుంచి నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17 నుంచి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభించాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఒకరోజు వాయిదా పడింది. జగన్‌కు తీవ్రమైన మెడనొప్పి కారణంగా యాత్ర వాయిదా పడిం దని, 18వ తేదీ నుంచి పర్యటన తిరిగి ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
జననేతకు నీరాజనం
-
పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా: సీఎం కిరణ్ పై జగన్ ఫైర్
సమైక్య శంఖారావంలో సీఎం కిరణ్‌పై నిప్పులు చెరిగిన జగన్ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారు సోనియా గీసిన గీత దాటకుండా.. ప్రజలను మోసం చేస్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ప్రజా సమస్యలను గాలికొదిలి అసెంబ్లీలో విభజనపై చర్చిస్తున్నారు ఈ ముగ్గురికి ప్రజల ఉసురు తగులుతుంది.. ప్రజా ఉప్పెనలో వారి అడ్రస్‌లు గల్లంతవుతాయి సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న దిక్కుమాలిన ఆలోచనతో కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన రాష్ట్ర ప్రజలను అమ్మడానికి సిద్ధపడ్డారు. సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పాలన చేస్తూ సమైక్య ముసుగు కప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ ఒకరోజు వస్తుంది. ఆ రోజున 70 శాతం మంది ఉసురు తాకి, అది ఉప్పెనై లేస్తుంది. ఆ ఉప్పెనలో సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్ గల్లంతవుతుంది...’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలన్న చర్చ జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనపై కాలర్ పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. ప్యాకేజీలు అడుగుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం చిత్తూరు జిల్లాలో మూడో విడత ఎనిమిదో రోజు చిత్తూరు నియోజకవర్గంలో కొనసాగింది. చిత్తూరు పట్టణం, పాలడుగు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.... రూ. 5 పెట్టి బిందెడు నీళ్లు కొంటున్నారు చిత్తూరులో రూ.2 నుంచి రూ.5 పెట్టి బిందెడు నీళ్లు కొనాల్సి వస్తోందని అక్కాచెల్లెమ్మలు ఆవేదనతో చెబుతున్నారు. వంటగ్యాస్‌కు సబ్సిడీ కూడా అందడం లేదని బాధపడుతున్నారు. కరెంటు చార్జీలు కట్టాలంటే షాక్ కొడుతోందని, వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు దొరకటం లేదని రైతన్నలు బాధపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలు తొలగించారు. ఈరోజు ఈ ప్రజాసమస్యల్లో ఏ ఒక్కదానిపై కూడా అసెంబ్లీలో చర్చ జరగడం లేదు. రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలనే అధ్వాన రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఈ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే చాలు. వాళ్ల నిజ స్వరూపం బయటపడుతుంది. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు అసెంబ్లీకి వస్తారు. కానీ అసెంబ్లీ ఫ్లోర్ మీద మాత్రం కనిపించరు. చంద్రబాబు అయితే ఏసీ రూంలో కూర్చొని ఓవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విడగొట్టాలని అనిపిస్తారు. వీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నారు. రేప్పొద్దున మీరిద్దరు ఈ జిల్లాకు వచ్చినపుడు చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడిగితే ఏం చెబుతారు? సాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలని రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు? సమైక్య తీర్మానం పెట్టాల్సిందే.. మన రాష్ట్రానికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అన్యాయం జరుగుతోంది. మనకు సంబంధం లేకుండానే మనల్ని విడగొడతారట. దేశంలోని ప్రతి నాయకుడు కూడా ‘మీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది’ అని చెప్తున్నారు. ఇది మనమంతా ఏకం కావాల్సిన సమయం. కానీ ఢిల్లీ కుమ్మక్కు రాజకీయాలను బద్దలు కొట్టాల్సింది పోయి కిరణ్‌కుమార్‌రెడ్డి... సోనియా గీసిన గీత దాటడం లేదు. ఆమెను నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ మన గడ్డపై పుట్టి మనకే ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికైనా వీరిద్దరూ సమైక్య రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి. కేంద్రం నుంచి బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటల లోపే సీఎం సంతకం చేసి అసెంబ్లీకి పంపించారు. సోనియా విభజన చేయాలని చెబుతుంటే ముఖ్యమంత్రిగా అందుకు సహకరిస్తున్నారు. విభజనపై అధికారులకు ఆదేశాలిస్తూ ప్రతి అడుగులోనూ సహకారం అందిస్తూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులా? వీరి కుమ్మక్కు రాజకీయాలు ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు. 70 శాతం మంది ప్రజలు చూస్తున్నారు. వీరి ఉసురు మీకు తగులుతుంది. సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ అడ్రస్‌లు గల్లంతవుతాయి. త్వరలోనే ఎన్నికలు వస్తాయి. అప్పుడు మనందరం ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలుకొడదాం. ఆ కోటను మనమే పునఃనిర్మిద్దాం. మన రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికుందో చూద్దాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం.’’ సమస్యలు తెలుసుకుంటూ.. ఆదివారం నాటి యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. రెడ్డిగుంటలో పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్.. అక్కడ్నుంచి మాపాక్షి క్రాస్ చేరుకుని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోపాలపురంలో మహిళలను పలకరించి వారి సమస్యలపై ఆరా తీశారు. చీలాపల్లి క్రాస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం 189 కొత్తపల్లె మీదుగా గుడిపాల చేరుకుని సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం చిత్తూరు చేరుకున్న జగన్‌కు యువకులు మోటారు సైకిళ్ల ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రీమ్స్పేట, కన్నన్ కాలేజీ మీదుగా దర్గా, ఎంజీఆర్ వీధి, ఎంఎస్ఆర్ సర్కిల్, పీసీఆర్ సర్కిల్ వరకు యాత్ర సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత జగన్ మూడో విడత యాత్రను ముగించారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమర్నాథ్రెడ్డి, ఎన్.గాంధీ బాబు, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ముగిసిన మూడో విడత యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ముగిసింది. ఈనెల 5 నుంచి మొదలైన మూడో విడత యాత్ర 8 రోజులు కొనసాగింది. చిత్తూరు బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వె ళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరులో 9 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్... 15 కుటుంబాలను ఓదార్చినట్లు వివరించారు. -
'ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారు'
చిత్తూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా అరగొండ సభకు హాజరైన ఆయన ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. పేదవాడి కొడుకు కలెక్టర్, డాక్టర్ కావాలని వైఎస్సార్ కలలు కన్నారని, ఆ కలలు సాకారమయ్యే దిశగా పయనించాలని ఆయన తెలిపారు. పేదరికం చదువుకు అడ్డుకాకుడదని ఆ మహానేత భావించారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదరికాన్ని వైఎస్సార్ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదన్నారు. రాముని రాజ్యం ఎలా ఉంటుందో ఎవరూ చూడకపోయినా, రాజన్న సువర్ణయుగాన్ని అందరూ చూశారన్నారు. ఆనాటి సువర్ణయుగాన్ని తిరిగి తీసుకొద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్ చిన్ననాటి స్నేహితుడ్ని పరామర్శించిన జగన్
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జొన్నగురుకులలో నివాసం ఉంటున్న ప్రతాప్ రెడ్డిని పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జొన్నగురుకుల మీదుగా అరగొండ వెళ్లి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని జగన్ దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్‌తో పాటు స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు. -
సోనియా గాంధీని ప్రశ్నించకుండా ప్యాకేజీలు అడుగుతారా?
చిత్తూరు:అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు దొంగనాటకాలాడుతున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.జిల్లాలోని పూతలపట్టు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని జగన్ విమర్శించారు. ఆమె గీసిన గీతను కిరణ్ దాటకుండా విభజనకు సహకరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటున్న సోనియాను చంద్రబాబు ప్రశ్నించకుండా, ప్యాకేజీలంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన నోట సమైక్యాంధ్ర అన్న మాటే రావడంలేదని, అసెంబ్లీలో రాష్ట్రాన్ని విడగొట్టడానికి చర్చ జరుపుతున్నారన్నారు. దేశంలో ఎక్కాడా లేని విధంగా రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రజలకు మరిన్ని సమస్యలు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని జగన్ అన్నారు.70 శాతం ప్రజలు ఒప్పుకోక పోయినా బిల్లును రాష్ట్రానికి పంపి, ఆ బిల్లుపై వీళ్లంతా చర్చించడం దురదృష్టకరమన్నారు. అన్యాయం అయిపోతున్న అక్కాచెల్లెళ్లపై అసెంబ్లీలో చర్చ జరగక పోవడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని జగన్ సూచించారు. -
జనం పండగ!
-
సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
-
సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
కల్లూరు(చిత్తూరు జిల్లా): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు కలిసి రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని సమైక్య శంఖారావంలో భాగంగా కల్లూరు సభలో మాట్లాడిన జగన్..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బహిష్కరించడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారన్నారు. వారు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని జగన్ దుయ్యబట్టారు. సమైక్య నినాదం వినిపించినందుకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ విలువల్ని కాలరాస్తుందన్నారు. -
'సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు'
-
'సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు'
పీలేరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కుయుక్త రాజకీయాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వారు సిగ్గు లేకుండా నీతిమాలిన రాజకీయలకు పాల్పడుతున్నారని విమర్శించారు.చిత్తూరు జిల్లాలోని సమైక్య శంఖారావంలో భాగంగా పీలేరు బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జగన్..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించడాన్ని ప్రశ్నించారు. సమైక్య నినాదం వినిపించినందుకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో సమైక్యం అన్నందుకు ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తారా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సమైక్య తీర్మానం చేయాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు వెనుక అధిష్టానం హస్తం ఉందని జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంత నాయకులకు రెండు వాదనలు వినిపించమని చెబుతున్నారు. ఎవరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతున్నారో, ఎవరు విభజన రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారని జగన్ ప్రశ్నించారు.దివంగత ముఖ్యమంత్రి బ్రతికున్నప్పుడు ఏ ఒక్కరు రాష్ట్ర విభజనపై నోరెత్తకుండా ఇప్పుడు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. -
బాబు, కిరణ్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారు?
-
పులకించిన పల్లెలు
-
చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే!
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: సమైక్య రాష్ట్రం కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్రాన్ని విభజించండని శాసనసభ్యులంతా ప్రతిపాదిస్తేనే రాష్ట్ర విభజన జరగాలి. కానీ రాష్ట్రాన్ని విడగొట్టాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని, ఆ తరువాత చర్చించుకోండని బిల్లును అసెంబ్లీకి పంపితే దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే మనం విభజనకు ఒప్పుకున్నట్టు కాదా?’’ అని ప్రశ్నించారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ముందుకు రావాలని కోరారు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పిల్లాడూ ఉద్యోగాల కోసం మేం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడగకుండా ఉండాలంటే ఇద్దరు కూడా సమైక్య రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ర్టంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలని సూచించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, నాలుగో రోజు బుధవారం పుంగనూరు నియోజకవర్గంలో సాగింది. సోమల మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. కిరణ్, చంద్రబాబులకు తెలియడం లేదు.. రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయం అని చెప్పి దేశంలోని నాయకులంతా చెప్తున్నా.. మన ఖర్మ ఏమిటంటే కిరణ్, బాబులకు మాత్రం ఆ విషయం తెలియటం లేదు. చంద్రబాబు ఈ మధ్య రెండుమూడు మీటింగులు పెట్టారు. మీటింగుల్లో స..మై..క్యం అనే మాట ఆయన నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశాం. కానీ ఆ మీటింగుల్లో సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేలా ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు నవ్వొచ్చింది. వీళ్లా నాయకులు అనిపించింది. విశ్వసనీయతకు అర్థం తెలుసా చంద్రబాబూ? అధికారంలోకి వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీకు అసలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుసా? మీరు ఎప్పుడైనా నిజం మాట్లాడారా? నిజం చెప్పకపోగా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని ప్రజలను నమ్మించడానికి వెనుకాడని వ్యక్తి చంద్రబాబు. ఈయన ఇప్పుడు రైతులకు అది చేస్తాను, ఇది చేస్తాను అని హామీలు ఇస్తున్నారు. ఉచితంగా కరెంటు ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని నాడు అవహేళనగా మాట్లాడిన ఆయన.. ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాడు రైతన్నలను జైల్లో పెట్టించడానికి ప్రత్యేక పోలీసు స్టేషన్లు తెరిచారు, ఒక జీవోను తీసుకొచ్చి ప్రత్యేక కోర్టులు పెట్టించారు. రైతుల మీద అనేక అఘాయిత్యాలు చేయించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరక్క ప్రాణాలు తీసుకుంటున్నారని హేళనగా మాట్లాడారు. తొమ్మిదేళ్లలో రుణాలపై వడ్డీ మాఫీ చేయలేదుగాని.. ఇప్పుడు రుణాలే మాఫీ చేస్తానని చెప్తున్నారు. బాబు విశ్వసనీయత గురించి చెప్పాల్సి వస్తే .. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పేదవాడికి ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటంటే.. ఒక్కటైనా ఉందా? సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇక ప్రజలకు ఏం చేస్తాడు? అక్కడే ఉండీ.. అసెంబ్లీ సమావేశాలకు రారా? ఇవాళ రాష్ర్ట అసెంబ్లీ జరుగుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీ వరకు వస్తారు. అక్కడ ఏసీ రూముల్లో కూర్చుంటారు. కానీ సమావేశాలకు మాత్రం రారు. చంద్రబాబు ఏం చేస్తున్నారు అంటే.. అసెంబ్లీ సమావేశాల్లో తన పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల చేత సమైక్యం అనిపిస్తారు.. తెలంగాణ ఎమ్మెల్యేల చేత విడగొట్టండీ అనిపిస్తారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు మీకు నిజంగా మా మీద ప్రేమ ఉందా? అని చంద్రబాబును అడగదలచుకున్నా. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టాలని ఉబలాటపడుతున్నారని తెలిసిన వెంటనే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు తీర్మానం చేయలేదని కిర ణ్కుమార్రెడ్డిని అడగదలుచుకున్నా. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు.. ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి? ఎవరిని తప్పించాలి? రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి? ఎలా విడగొడితే ఎన్ని ఓట్లు వస్తాయనే దిక్కుమాలిన ఆలోచనతో ఈ రోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇవాళ చంద్రబాబుకు, మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా.. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీకి కూడా చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోయే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మనందరం కలుద్దాం.. ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఆ తరువాత ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’ జగన్మోహన్రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.అమర్నాథ్రెడ్డి, గాంధీ, పార్టీ నేతలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, రోజా తదితరులు ఉన్నారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు ప్రజలకు ఒక్క రూపాయి ఇస్తానని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. కారణం మీరు తొమ్మిదేళ్లు పరిపాలన చేసినపుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేస్తే.. ప్రజలకు కనీసం 10 పైసల మేలు కూడా చేయలేదు. అదే జగన్మోహన్రెడ్డి రూ.50 ఇస్తానని చెప్పినా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. విశ్వసనీయతకు అర్థం అదేనయ్యా చంద్రబాబూ! జగన్ మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పడు, ఆ మాట కోసం ఎందాకైనా పోతాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. నీలో లేనిది, నాలో ఉన్నది అదే చంద్రబాబూ. వైఎస్సార్ నుంచి నేను వారసత్వంగా తెచ్చుకున్నది విశ్వసనీయత అని గట్టిగా చెప్పగలుగుతాను.’’ పల్లెలన్నీ జగన్ వెంటే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం కందూరు నుంచి బుధవారం ఉదయం సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను ప్రారంభించిన జగన్మోహన్రెడ్డి ఆ గ్రామంలో మృతి చెందిన శెట్టి చిన్న రెడ్డెప్ప కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు గ్రామాల మీదుగా సోమల మండల కేంద్రం చేరుకుని అక్కడ నాలుగు రోడ్ల జంక్షన్లో జరిగిన భారీ సభలో ప్రసంగించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్రపల్లెలో సాదం మునిస్వామి కుటుంబాన్ని ఓదార్చారు. మారుమూల ప్రాంతాల్లో సైతం భారీగా జనం రావడంతో, చలిలో కూడా గంటలపాటు వేచి ఉండడంతో రాత్రి ఏడు గంటలకు ముగియాల్సిన యాత్ర పదిన్నర గంటల వరకూ సాగింది. జగన్ యర్రాతివారిపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట బస చేశారు. -
విశ్వసనీయతే నా వారసత్వం
విశ్వసనీయత తనకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి వచ్చిన వారసత్వమని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అశేష జనవాహిని మధ్య ఆయన వాల్మీకిపురం, కలికిరి సభల్లో మాట్లాడారు. సాక్షి, తిరుపతి: చంద్రబాబు నాయుడులా తాను వెన్నుపోటుదారుడిని కాదని, విశ్వసనీయతే తన వారసత్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయ న జిల్లాలో చేస్తున్న ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా మంగళవారం వాల్మీకిపురం, కలికిరి మండల కేంద్రాల్లో ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం అభిమానులను ఆకట్టుకోవడంతో, రెండు సభల్లోను కదల కుండా విన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ ఆయనకు జేజేలు పలికారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఏవి ధంగా వీరిద్దరూ కలసి మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించారు. వేలాది మంది జనం రోడ్లపైనే కాకుండా, చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి ఎక్కి జననేత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయన ప్రసంగంలో తండ్రి తనకు విశ్వసనీయత నే ర్పించారని తెలిపారు. చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలకు పది పైస లు కూడా ఇవ్వలేదని, దీంతో ఆయన ఇప్పుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి 50 పైసలు ఇస్తానన్నా ప్రజలు నమ్ముతారని, అదే తన విశ్వసనీయత అన్నారు. దీంతో ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదని, సొంత మామనే వెన్నుపోటు పొడిచిన బాబు ప్రజలకు ఏమి మేలు చేస్తాడని ప్రశ్నించారు. మద్యనిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు మళ్లీ మద్య నిషేధం విధిస్తానని, రుణాలు ఇవ్వని బాబు, మళ్లీ మహిళలకు రుణాలు ఇస్తానని హామీలు ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తల్లికి చీర కొనిపెట్టడానికి లేదు కానీ, చిన్నమ్మకు బంగారం కొనిస్తానంటే, ఎవరు నమ్ముతారనే సామెత చెప్పగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని దేశమంతా చెబుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు మాత్రమే న్యాయమంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరగాలంటే ముందుగా అసెంబ్లీలో ప్రతిపాదనను ఆమోదించి, తరువాత కేంద్రానికి పంపాలని, అయితే ఇక్కడ అంతా రివర్సులో జరుగుతోం దని అన్నారు. బిల్లుపై సమైక్య తీర్మానం చేయాలంటే, ఇప్పటికీ వీరిద్దరూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారని అన్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణ వారితో విభజనకు అనుకూలమని, సీమాంధ్రులతో సమైక్యానికి అనుకూలమని చెపుతూ పార్టీ ఎమ్మెల్యేలనే మభ్య పెడుతున్నారని తెలిపారు. సోనియాగాంధీ గీత గీస్తే, ఆ గీతను దాటని కిరణ్‌కుమార్‌రెడ్డి, వారితో కు మ్మక్కయిన బాబు కలసి రాష్ట్రాన్ని దిగజారుస్తూ, తాను కుమ్మక్కయినట్లు ప్రచారం చేస్తున్నారని అనగానే, కిరణ్, బాబుకు వ్యతిరేకంగా జనం నినాదాలు చేశారు. సీమాంధ్రలో ప్రతి గుండె సమైక్యం అని కొట్టుకుంటోందని అన్నా రు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, పూర్ణం, రవిప్రసాద్, డాక్టర్ సునీల్ కుమార్, పీలేరు నియోజవకర్గ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలకు ముందు ప్రజలను ఉత్తేజ పరిచే విధంగా పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, జగతి బృందం ఆలపించిన పలు గీతాలు అలరించాయి. -
'ఈ గడ్డమీద పుట్టిన చంద్రబాబు విభజనకు సహకరిస్తున్నారు'
-
సోనియా గాంధీ గీసిన గీతను కిరణ్ దాటడు:జగన్
కలికిరి(చిత్తూరు జిల్లా): సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగు వేసుకుని రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీతను కిరణ్ రెడ్డి దాటను గాక దాటడని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా మంగళవారం సాయంత్రం కలికిరి సభకు హాజరైన జగన్ కు అభిమానులు పూలతో స్వాగతం పలికారు. ముందుగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసభకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ ప్రతీది కలిసి కట్టుగానే చేశారని, ఇప్పడు రాష్ట్ర విభజన విషయంలో కూడా అదే పునారావృతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐఎంజీ భారత్‌కు 830 ఎకరాల భూమిని అడ్డుగోలుగా కట్టబెట్టింది చంద్రబాబు కాదా? కానీ సీబీఐ మాత్రం నోటీసులు కూడా జారీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తనపై కేసులు పెట్టాయన్నారు. వాస్తవంగా 3 నెలల్లో బెయిల్ రావాల్సి ఉన్నా , 16 నెలలపాటు అక్రమంగా నిర్బంధంలో పెట్టడానికి కాంగ్రెస్-టీడీపీలే కుమ్మక్కు రాజకీయమే కారణమన్నారు. ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కూడా చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కయిన విషయం వాస్తవం కాదా?అని జగన్ ప్రశ్నించారు. ఈ నడి రోడ్డుమీదకు వచ్చిన ప్రతీ పిల్లాడి గుండె చప్పుడు జై సమైక్యాంధ్ర అని నినదిస్తుంటే... రాష్ట్రంలో ఉన్న నాయకులకు కనీసం జ్ఞానం లేదన్నారు. విభజన జరిగితే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతీ రైతన్న ప్రశ్నిస్తుంటే ఈ నేతలు ఏ సమాధానం చెబుతారన్నారు. సోనియా గాంధీని కాలర్ పట్టుకుని అడగాల్సిన ఈ గడ్డమీద పుట్టిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విభజనకు సహకరించడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే వీగిపోతుందని భయపడి, నేరుగా పంపించి చర్చించుకోమని వదిలేశారన్నారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలను, తెలంగాణ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిపించుకుని తలో మాట చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. -
'సమైక్య ఉద్యమాన్ని బాబు నీరుగారుస్తున్నారు'
చిత్తూరు: సమైక్య ఉద్యమాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీరుగారుస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సమైక్యం మాటెత్తని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం జిల్లాలోని అంగళ్లులో వైఎస్ జగన్ ప్రసంగించారు. అసెంబ్లీలో అవిశ్వాసంపై కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలిచింది బాబు కాదా? అని నిలదీశారు. ఆ రోజు కాంగ్రెస్ సర్కారును బాబు కాపాడకపోయుంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను కూడా తెప్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అధికారంకోసం రూ.2కు కిలో బియ్యం అన్న బాబు తర్వాత రూ.5లు చేశారని, ఉచిత కరెంట్ ఇవ్వమని ప్రతిపక్షాలు అడిగితే తుపాకులతో కాలిపించారన్నారు. రూ.50 హార్స్ పవర్ ఉన్న విద్యుత్‌ను రూ.600కు పెంచారని జగన్ తెలిపారు. కాంగ్రెస్-టీడీపీలను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజు అతి త్వరలోనే వస్తుందన్నారు. చంద్రబాబులో లేనిది, జగన్‌లో ఉన్నది విశ్వసనీయత ఒక్కటేనని స్పష్టం చేశారు. తాను జైలులో ఉండి కూడా కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాలేదని, చంద్రబాబు బయట ఉండి కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ఏముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళుతుందని జగన్ నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అనుక్షణం ప్రజల గురించే ఆలోచించే వారని, .ప్రతీ పేదవాడి గుండెల్లోఆయన ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. -
''విభజన కోసం దిక్కుమాలిన రాజకీయాలు''
-
సమైక్య శంఖారావం పూరించిన ''టి''నేతలు
-
జనసంద్రమైన మదనపల్లె
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె పట్టణం జనసంద్రమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జగన్ ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ‘సమైక్య శంఖారావం’ పూరించడానికి ఇక్కడికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మదనపల్లె రూరల్ వలసపల్లెలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు దండాల రవి ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో జగన్‌ను ముంచెత్తారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని స్థానిక బసినికొండ ప్రాంతంలోని దర్గాలో జగన్ ప్రార్థనలు చేశారు. మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్, అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ కేఎస్ఎస్బీ.నూర్‌బాబా, దర్గా మతగురువు కేఎస్ఎస్.బాబా అ బ్దుల్లా, మోహన్తాజ్ శాలువతో సన్మానించారు. చిత్తూరు బస్టాండు సర్కిల్లో ని వాల్మీకి విగ్రహానికి జగన్ పూలమాలలు వేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభ విజ యవంతమైంది. పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షమీం అస్లాం, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్తర్అహ్మద్, మైనారిటీ నాయకులు బాబ్జాన్, పీఎస్.ఖాన్, నాయకులు జింకా వెంకటాచలపతి, సురేంద్ర, ఎస్ఏ.కరీముల్లా, రెడ్డివారి సాయిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
మదనపల్లెరూరల్, పుంగనూరు, న్యూస్‌లైన్: ‘మీరంతా ఇంజినీర్లు కావాలి. చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు అందజేస్తా. తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి కోరారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా 150 మైలు వద్ద ఆదిత్య, భారతి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో ముచ్చటించారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని రెండుగా చీల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని సూచిం చారు. అనంతరం వలసపల్లె సమీపంలో దందాల రవీంద్రారెడ్డి, తిమ్మయ్యగారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మదనపల్లె మార్గం లో ములకలదిన్నె, గంగమ్మగుడి, డ్రైవర్స్ కాలనీ, బసినికొండ బైపాస్‌రోడ్డు, బసినికొండ దర్గా, ఈస్ట్పేట, నిమ్మనపల్లె క్రాసు, చిత్తూరు బస్టాండు మీదుగా బహిరంగ సభకు వెళుతున్న జగన్‌కు జనం నీరాజనాలు పలికి పూలవర్షం కురిపించారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి, భారతి కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్‌రెడ్డి, మైనారిటీ నాయకులు బాబ్జాన్, సిలార్‌ఖాన్, మదన్‌మోహన్‌రెడ్డి, గంగుల్‌రెడ్డి, రెడ్డెప్ప, సుబ్బయ్యనాయుడు, ఎస్ఏ.కరీముల్లా, అశోక్‌రెడ్డి, రాజన్న, పాపయ్య, సయ్యద్‌బాషా, డాక్టర్ బసిరెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, వైజయంతి, లతీఫ్, తిమ్మాపురం బాబు, గౌస్, కమాల్‌ఖాన్, ఇందిరానగర్గౌస్, నిషాద్, నూరు, చిప్పిలి జగన్నాథరెడ్డి, ఎస్రిజ్వాన్ పాల్గొన్నారు. పుంగనూరులో.. జగన్మోహన్రెడ్డి రోడ్‌షో నిర్వహిస్తూ.. మదనపల్లెకు బయల్దేరారు. మార్గమధ్యంలో ముస్లిం మైనారిటీల నాయకుడు ఖాదర్‌ఖాన్ ఇంటికి వెళ్లి ముస్లిం నేతలను కలుసుకున్నారు. పారిశ్రామికవేత్త ఆర్వీటీ.బాబు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్‌షో సాగింది. మంగళంక్రాస్, బోడినేపల్లె క్రాస్, ఉలవలదిన్నె, రాంపల్లె, భీమగానిపల్లె, పూజగానిపల్లె, సుగాలిమిట్ట, అక్కింవారిపల్లె క్రాస్, ఈడిగపల్లె, చండ్రమాకులపల్లె క్రాస్ వరకు సాగింది. మార్గమధ్యంలో మంగళంక్రాస్ వద్ద ఎంపీటీసీ మాజీ సభ్యులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు, విద్యార్థులు జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. సుగాలిమిట్ట వద్ద వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూజగానిపల్లె, సుగాలిమిట్ట చర్చిల్లో జగన్మోహన్రెడ్డి ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సర కేక్‌ను కట్‌చేశారు. -
జనజాతర
జగన్‌కు అదే ఆదరణ అదే ఆప్యాయత వాడవాడలా స్వాగత తోరణాలే చిరునవ్వుతో పలకరించిన జననేత సాక్షి, తిరుపతి: జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని ప్రతిపల్లెలో, ప్రతి వాడలో ప్రజలు ఆదరించారు. పూలతో స్వాగతించారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు తేడా లేకుండా ఆయనను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అనుకున్న షెడ్యూలు కన్నా, మూడు గంటలు ఆలస్యంగా పర్యటన సాగినా, ఏ మాత్రం విసుగు లేకుండా ఆయన రాక కోసం ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. మంగళవారం ఉదయం పుంగనూరులో బయలుదేరిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరులోని ప్రతి వీధి జాతరను తలపించింది. వేలాదిమంది అభిమానులు జననేతతో మాట్లాడేందుకు చుట్టుముట్టారు. పుంగనూరు పట్టణం సరిహద్దులో ఉన్న విష్ణుభారతి పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు. పార్టీ నేత అక్కసాని భాస్కర్ రెడ్డి టపాకాయలు పేల్చారు. తరువాత జగన్మోహన్రెడ్డి మైనారిటీ నాయకుడు ఖాదర్ ఖాన్ ఇంటికి వెళ్లి, తేనీరు సేవించారు. అక్కడి నుంచి ఉలవలదిన్నె, రాగానిపల్లె మీదుగా బాలాజీ కాలనీ వద్దకు చేరుకోగా, మహిళలు హారతి పట్టి స్వాగ తం పలికారు. శాంతినగర్ వాసులు బ్యాండు మేళం ఏర్పాటు చేశారు. రామపల్లెకు చేరుకోగానే అక్కడ టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు. సుగాలిమిట్ట చేరుకుని, అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి సుగాలి సోదరులతో కలసి రిటైర్డ్ ఎంపీడీవో వెంకటరెడ్డియాదవ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ తరువాత పూజగానిపల్లెలో చర్చికి వెళ్లి కేక్‌కట్ చేశారు. భీమగానిపల్లెకు చేరుకున్న వైఎస్.జగన్మోహన్రెడ్డికి మహిళలు హారతులు ఇవ్వ గా, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గాంధీపురం సర్పంచ్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో పూజగానిపల్లె వద్ద లంబాడీలు ఆహ్వానం పలికారు. ఈడిగపల్లెలో పూలవర్షం కురిసింది. సర్పంచ్ అమరనాథరెడ్డి ఆయనను స్వాగతించా రు. సమీపంలోని గ్రీన్‌వ్యాలీ స్కూల్ విద్యార్థినులు పూలతో ఆహ్వానించారు. 150వ మైలు వద్ద మహిళలు హారతులు పట్టగా, డప్పుల మోతలు, టపాకాయ లు పేలుస్తూ ఆహ్వానించారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆహ్వానించారు. వారి డైరీని జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భీమనేని రెస్టారెంట్ వద్ద మదనపల్ల్లె సమన్వయకర్త షమీమ్ అస్లాం స్వాగతం పలికారు. వలసపల్లెలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వలసలపల్లె క్రాస్ మీదుగా మదనపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్మోహన్రెడ్డికి మొలకలదిన్నె వద్ద పార్టీ నాయకుడు బాబ్జాన్ దాదాపు వంద వాహనాలతో స్వాగతం పలికారు. బసినికొండ చేరుకున్న జననేతను ఒక విద్యార్థిని తెలుగుతల్లి వేషధారణతో ఆహ్వానించగా, మహిళలు హారతులు పట్టారు. డప్పు లుకొట్టి సంబరం చేసుకున్నారు. నిమ్మనపల్లె సర్కిల్‌వద్ద టపాకాయలు పేల్చా రు. మదనపల్లెలోని సీఎస్ఐ మిషన్ కాంపౌండ్‌లోని మహిళలు జగన్మోహన్రెడ్డి ని చూసేందుకు బారులు తీరారు. చిత్తూరు బస్టాండ్‌వద్ద వందలాదిమంది చేరుకుని ఎదురుచూశారు. ఆయన రాగానే కొండంత సంబంరంతో జేజేలు పలికారు. మదనపల్లెలో అడుగడుగునా వందలాదిమంది జగన్మోహన్రెడ్డి కోసం ఎదురుచూశారు. మదనపల్లె పట్టణంలో ఆయనకు దాదాపు ఒకటిన్నర గంట సమయం పట్టింది. బెంగళూరు బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం రెండో విడత సమైక్య శంఖారావానికి తాత్కాలిక విరామం ఇచ్చి ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, గాంధీ, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, యువజన కన్వీనర్ ఉదయ్‌కుమార్, పల్లికొండేశ్వర ఆలయం ట్రస్టు బోర్డు సభ్యుడు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, రెడ్డెప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, ఆవుల అమరేంద్ర, మైనారిటీ నాయకుడు అక్తర్ అహ్మద్, పీఎస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
-
ఏడాదంతా పోరే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బలుపు కాదు వాపు అని కాంగ్రెస్‌కు, ఇంకా బతికే ఉందని టీడీపీకి, ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పిన సంవత్సరం 2013. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా, వామపక్షాలు మునుపటి నిస్తేజంతోనే ఎన్నికల సంవత్సరంలోకి వెళ్తున్నాయి. స్థానిక, సహకార సంఘాల అధికారం అండతో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటకీ పంచాయతీ ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులు కొందరు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. సమైక్యాంధ్ర సమరంలోనూ కాంగ్రెస్, టీడీపీలు మొక్కుబడిగా పాల్గొనగా వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరుబాటన నడిచింది. ఇదీ స్థూలంగా 2013లో రాజకీయపార్టీల పరిస్థితి. మరోవైపు ఏడాదంతా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అధికారానికి ఎదురొడ్డి విజయాలు సాధించిన వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల హృదయాల్లోనే నిలిచి ఉందని ఈ ఏడాది కూడా నిరూపించుకుంది. ప్రజల పక్షాన ఒక వైపు పోరాటం చేస్తూనే అధికారపక్షాన్ని ఎదురొడ్డి విజయాలను సొంతం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించి సత్తా చాటుకుంది. జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణతో రాష్ట్ర నాయకత్వం కూడా కొందరు నేతలను సీఈసీలోకి తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువరించిన రోజు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకొని పనిచేసింది. సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లా పర్యటన జరిపారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి పట్టణాల్లో నిర్వహించిన సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు. గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ ... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున నలుగురు శాసనసభ్యులు ఉండగా అందులో ఇద్దరు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మిగిలేదల్లా ఆనం సోదరులు మాత్రమే. ఇక చాలా నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. పంచాయతీలో బతికే ఉన్నాననిపించిన టీడీపీ.. ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లాలో టీడీపీకి ఊపిరిపోశాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో ఆ పార్టీ ఇంకా బతికే ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో అవకాశం దొరక్క దేశంవైపు చూస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఇప్పటికే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న నేతల అసంతృప్తికి దారి తీస్తోంది. కార్యకర్తలు సంతోషపడాలో, బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి 2013లో పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. కాగా పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించలేక విమర్శలపాలైంది. -
వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో వినుకొండలో సమైక్య శంఖారావం
-
బాబు లేఖ ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు: మైసురా
-
కమలాపురంలో వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం
-
సమైక్య ద్రోహులకు ఓటుతో బుద్ధి చెప్పండి
గుంతకల్లు, న్యూస్‌లైన్ : అసెంబ్లీ, పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోకుండా ‘సమైక్య’మంటూ మీ ముందుకు వచ్చి డ్రామాలాడే ప్రజాప్రతినిధులను తరిమి కొట్టి.. ఓటుతో బుద్ధి చెప్పండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంతకల్లులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ అడ్డుకోకుండా బయటకు వచ్చి సమైక్యమంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. అలాంటి ప్రజాప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఇలాంటి చెత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు రాబోయే ఎన్నికల్లో గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడించాలని సూచించారు. ప్రజలంతా రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం విభజన చేయాలంటూ భజన చేస్తున్నారన్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఏ రాష్ర్టంలోనూ లేదన్నారు. పైలిన్ తుపాన్‌ను అడ్డుకోలేను కానీ విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాగానే జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. జీతాలు రాకపోయినా పర్వాలేదు, పిల్లల జీవితాలు బాగుపడాలి అంటూ ఉద్యమం చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు నిలువునా మోసం చేసి.. సీఎం తొత్తుగా మారిపోయాడ ని విమర్శించారు. కీలక సమయంలో ఉద్యమించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడేమో విభజనను అడ్డుకోకుండా కాంగ్రెస్ అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. తనయుడి ని ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఏ ఒక్కరూ ‘తెలంగాణ’ ఊసెత్తలేదన్నారు. అలాంటి దమ్మున్న నేత లేకపోవడం వల్లే ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్నారు. సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణకు, సుపరిపాలనకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల చిహ్నం ‘ఫ్యాన్’ గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించుకోవాలన్నారు. కాగా, సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాన్ని, ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ గుంతకల్లు పట్టణానికి చెందిన అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ బి.పార్వతీదేవి రూపొందించిన ‘సమైక్య శంఖారావం’ బ్రోచర్‌ను కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. సభలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎం. శంకరనారాయణ, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, మాజీ డీఎస్పీ వన్నూర్‌సాబ్, నాయకులు బోయ తిరుపాల్, మీసాల రంగన్న, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిలకలూరిపేటలో సమైక్య శంఖారావం పూరించిన వైఎస్సార్ సీపీ నాయకులు
చిలకలూరిపేట,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై మభ్యపెట్టిన సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులపై కోడిగుడ్లు వేస్తున్న ప్రజలు త్వరలో రాళ్లతో కొట్టి బుధ్ధిచెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లాలో తొలిసారిగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో బుధవారం రాత్రి సమైక్య శంఖారావ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అంబటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జైలు లోపల, బయట కూడా సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు జగన్ మోహనరెడ్డి అని కొనియాడారు. రాష్ట్రం విడిపోకుండా ఉంచాలన్న లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారన్నారు. తెలంగాణాలో ఒక నాటకం సీమాంధ్రలో మరో డ్రామా అడుతూ ప్రజల్ని మభ్య పెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడో సారి చిత్తుగా ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే సమైక్యవాద ముసుగులో విభజనకు కారకులౌతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారని చెప్పారు. ఇప్పటికైనా సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగలకుండా అన్ని పార్టీలు జగన్ ఉద్యమబాటలో పయనించాలని హితవు చెప్పారు. పార్టీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలుగుజాతి సమైక్యంగా ఉండటం కోసం జగన్ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. 2004 నుంచి 2009 వరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ హయాంలో మర్రి రాజశేఖర్ చేసిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలోనూ జరగలేదన్నారు. తెలుగుజాతి ఐక్యత కోసమే... గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జాతి ఐక్యంగా ఉండాలని సమరానికి సిధ్ధమైన జగన్‌కు తెలుగుజాతి యావత్తు మద్దతు పలుకుతుందన్నారు. పొన్నూరు సమస్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు జగన్ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. నరసరావుపేట పార్టీ సమస్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విడిపోవాలని కోరుకునేవారికి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా, సమైక్యంగా ఉండాలన్న వారికి కొత్తరాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ జగన్ జైలు నుంచే సమైక్య రణభేరిని వినిపించారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమస్వయకర్త షేక్ షౌకత్ మాట్లాడుతూ సోనియా తన కుమారుడి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తుందన్నారు. తాడికొండ సమస్వయకర్త మందపాటి శేషగిరి మాట్లాడుతూ జగన్ పిలుపునకు స్పందించని పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారనుందన్నారు. సభకు పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభానీ అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా యువజన, ఎస్టీ, మహిళా, బీసీ, సేవాదళ్, విద్యార్థి, ట్రేడ్‌యూనియన్, మైనార్టీ విభాగాలకు చెందిన కన్వీనర్లు కావటి మనోహరనాయుడు, హనుమంతునాయక్, లక్ష్మిరాజ్యం, దేవెళ్ళ రేవతి, కొత్తా చిన్నపరెడ్డి, నర్సిరెడ్డి, అన్నాబత్తుని సదాశివరావు, షేక్ మహబూబ్ తదితరులు ప్రసంగించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ అధికారికంగా పార్టీకి ఫ్యాన్ గుర్తును కేటాయించటం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
'సమైక్య రాష్ట్ర అవశ్యకత తెలియచేద్దాం'
చిత్తూరు: రాష్ట్ర విభజనను కేంద్రం అడ్డగోలుగా చేస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని రామకుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తొలుత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఈ సమైక్య శంఖారావం సభకు ప్రజల పెద్ద ఎత్తున మద్దతు తెలపడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు .ప్రతి ఒక్కరూ భుజం..భుజం కలిపి కదం తొక్కుతూ సమైక్య రాష్ట్రం గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విభజన జరిగితే సీట్లు గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం.. ప్యాకేజీలిస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు కుతంత్రాలకు పాల్పడుతూ ప్రజల్ని అంధకారంలోకి నెట్టుతున్నారని జగన్ విమర్శించారు. సమైక్య రాష్ట్రం అవశ్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్రానికి కూడా తెలియచేద్దామని జగన్ అన్నారు. ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై రాష్ట్ర విభజనను ఖండించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సమైక్య సందేశాన్ని దేశానికి వినిపించేందుకే కుప్పం నుంచి సమైక్య శంఖారావానికి పూనుకున్నట్లు జగన్ తెలిపారు. జిల్లాలోని కుప్పం ఇప్పటికే వెనుకబడి పోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర జిల్లాలకు సముద్రం నీరు తప్ప, మంచి నీరు ఎలా వస్తుందని కేంద్రాన్ని నిలదీశారు. -
కుప్పంలో టీడీపీ కోటకు బీటలు
కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు వారాయి. సమైక్యశంఖారావం, ఓదార్పుయాత్రలో భాగంగా శని వారం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి కుప్పానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. కుప్పం బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.సుబ్రమణ్యంరెడ్డి టీడీపీ నేతల పేర్లు పిలుస్తుండగా వారు వేదికపైకి వచ్చి జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇందులో రామకుప్పం మండలానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఆరేళ్ల జయప్ప, మాజీ మండలాధ్యక్షు డు ఆంజనేయప్ప, కుప్పం మండలం మల్లానూరు మాజీ సర్పంచ్ గుణశేఖర్‌నాయుడు, నియోజకవర్గ కార్మిక నాయకులు రంగయ్య, ఎన్.కొత్తపల్లె, గెరిగశీనేపల్లె సర్పంచ్‌లు నాగరాజు, మన్నప్పయ్య, దాసేగానూరు మాజీ సర్పంచ్ తిమ్మోజీగౌడ్, టీడీపీ కుప్పం మండల మాజీ అధ్యక్షులు సుబ్రమణ్యం, నూలుకుంటకు చెందిన రెస్కో రిటైర్డ్ ఉద్యోగి రామప్ప, విజలాపురం బాబు, వెంకటేష్, వెంకటరామయ్య, రామచం ద్ర, నారాయణప్ప, నాగరాజు, గణేష్ వైఎస్సార్ సీపీలో చేరారు. కుప్పంలో జగన్‌ను చూడడానికే రావద్దని చంద్రబాబు పిలుపునిచ్చినా జనం భారీగా తరలివచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. కనీస గుర్తింపు లేదు సమైక్యశంఖారావం సభలో ఆరేళ్ల జయప్ప మాట్లాడుతూ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవ చేశానని, బీసీ నాయకుడుగా, కురబకుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు ఆ పార్టీలో కనీసం గుర్తింపుకూడా లేకుండా పోయిందని రామకుప్పం మండల మాజీ ఎంపీపీ ఆరేళ్ల జయప్ప ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. -
వైయస్ జగన్ రెండో రోజు సమైక్య శంఖారావం యాత్ర
-
కుప్పంలో్ జగన్‌కు ఘనస్వాగతం
-
జగన్ కోసం కుప్పం వాసుల ఎదురుచూపు
-
కుప్పం నుంచి జగన్ సమైక్య శంఖారావం
-
సమైక్య శంఖారావం సక్సెస్.
-
సమైక్య శంఖారావం సక్సెస్
-
'తెలుగువారికి ఒకే రాష్ట్రం మహాత్ముడు ఇచ్చిన మాట'
-
రాజకీయ లబ్ధి కోసమే విభజన: జ్యోతుల నెహ్రు
-
రాజకీయ లబ్ధి కోసమే విభజన: జ్యోతుల నెహ్రూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ లబ్ది కోసమే విభజిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసి సమైక్య శంఖారావం సభలో జ్యోతుల నెహ్రు ప్రసంగిస్తూ... తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అడ్డగోలుగా నిర్ణయాలు జరుగుతున్నాయి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంతాలకు శాశ్వత నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది సమైక్య సభకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో ఎంతోమంది నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని జ్యోతుల నెహ్రు ఆరోపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు కలసిరావాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. -
సమైక్య సభకు పాల్గొనే మహిళలకు A గేటు నుంచి ప్రవేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం బహిరంగ సభను నేడు ఎల్ బీ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. మహిళలు ఫతేమైదాన్ వైపు ఉన్న 'ఏ గేట్' నుంచి ప్రవేశించాలని, నిజాం క్లబ్ వైపు ఉన్న 'ఎఫ్ గేట్' నుంచి వీఐపీలు, కేఎల్కే బిల్డింగ్ వైపు ఉన్న 'డీ గేట్' నుంచి వీవీఐపీలకు, అలాగే బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వైపు ఉన్న 'ఎఫ్1 గేట్'తోపాటు ఆయకార్ భవన్ వైపు ఉన్న 'జీ గేట్ 'నుంచి ప్రజలు ప్రవేశించేందుకు వీలుగా ఎల్బీ స్టేడియంలో ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేర్లు పెట్టినట్లు తెలిపింది. -
భాగ్యనగరానికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక రైళ్లు
సమ్యైక్య శంఖరావం బహిరంగ సభ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు శనివారం ఉదయం కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంది. అలాగే ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు ఉదయం నాంపల్లి స్టేషన్ చేరుకుంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు సమైక్యవాదులు భారీగా ఆ రైళ్లలో తరలివచ్చారు. అయితే ఆ సభ కోసం విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన ప్రత్యేక రైలును భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. అంతేకాకుండా భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌లపైకి భారీగా వచ్చి నీరు చేరడంతో గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. హెల్ప్ లైన్ నెంబర్లు :నల్గొండ :0868-2224392, మిర్యాలగూడ: 08689-242627, నడికుడి: 08649-257625, గుంటూరు: 0863-2222014, పిడుగురాళ్ల-08649-252255. -
భాగ్యనగరానికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక రైళ్లు
-
'సమైక్య' సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు
హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జరప తలపెట్టిన సమైక్య శంఖారావం సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి భారీ భద్రతా ఏర్పాట్లును చేశారు. ఏ గేటు నుంచి మహిళలు, ఎఫ్ గేటు నుంచి వీఐపీలు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఎఫ్-1, జీ గేటు నుంచి ప్రజలకు ప్రవేశం కల్పిస్తున్నారు. డి గేటు నుంచి వీవీఐపీలకు ప్రవేశం కల్పించారు. ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు. -
సమైక్య శంఖారావం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ బహుదూర్ స్టేడియంలో జరుగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి, పీసీఆర్ నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్ వైపు నుంచి వాహనాలను గన్‌ఫౌండ్రీ, ఎస్ బీఎచ్ వైపు మళ్లిస్తామన్నారు. సెమెట్రీ వద్ద నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వైపు నుంచి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. రాజమోహల్లా వైపు నెంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెమీట్రి జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. బొగ్గుల కుంట, తాజమహల్, ఈడెన్ గార్డెన్స్ మరియు కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ నుంచి కాకుండా కింగ్ కోఠి క్రాస్ రోడ్డు మీదుగా తాజమహల్, అబిడ్స్ వైపు మళ్లించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, హిమయత్ నగర్ ల వైపు దారి మళ్లించనున్నారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి బషీర్ బాగ్ కు వెళ్లే వాహనాలను పూర్తిగా రద్దు చేశారు. -
'సమైక్య శంఖారావం'కు యూకే ఎన్నారైల మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్ది శనివారం నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావాలని లండన్‌లోని ఆ పార్టీ యుకే- యూరోప్ విభాగం ఎన్నారైలు ఆకాంక్షించారు. సమైక్య శంఖారావం సభకు ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం లండన్‌లోని ఎన్నారైలు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌లతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం అధ్యక్షుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ... సమైక్య శంఖారావం సభ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి అవలంభించిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే రాజన్న రాజ్యం అవశ్యకతను ప్రజల్లోకి ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలన అనిశ్చితికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఆ రెండు పార్టీ లు ఎన్ని కుటిల రాజకీయాలకు పాల్పడిన ప్రజలు వైఎస్ జగన్ పక్షం ఉన్నారని సందీప్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ డీఎన్ఏ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం ఉపాధ్యక్షుడు యోగేంద్ర పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపై నడిపిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నారైలు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారని యోగేంద్ర పేర్కొన్నారు. -
పక్కదారి పట్టించేందుకే రచ్చబండ
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మరో ఎత్తు సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమం నుంచి ప్రజలు, ఉద్యోగులను పక్కదారి పట్టించేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నవంబరు 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. అయితే, ఒకవైపు భారీ వర్షాలు, పంట నష్టం.. మరోవైపు రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమం.. వీటిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రెండేళ్ల తరువాత ‘రచ్చబండ’ను తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2011 నవంబరులో రెండో విడత రచ్చబండను నిర్వహించారు. అప్పుడు దాదాపు 50 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో రేషన్‌కార్డుల కోసం 19.60 లక్షలు, పెన్షన్ల కోసం 11.67 లక్షలు, గృహాల కోసం 20.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు 13 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులైన వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. కాని రెండేళ్ల నుంచి అర్హులైన వారికి లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా దరఖాస్తులు ఇచ్చిన ప్రజలంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఆ దరఖాస్తులను పరిష్కరించకుండా రెండేళ్లపాటు కాల యాపన చేసిన ప్రభుత్వ పెద్దలకు పేద ప్రజలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న అధికార పార్టీ నాయకులు.. ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలకు ముందు రచ్చబండ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, అనుకోకుండా జూలై 30 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తదనంతరం సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం రావడం తెలిసిందే. 13 జిల్లాల్లోని ఉద్యోగులంతా రెండునెలలకు పైగా నిరవధిక సమ్మె చేయడంతో పాలన స్తంభించిపోయింది. క్రమంగా ఒక్కో సంఘాన్ని సమ్మె నుంచి విరమించేలా ఒత్తిడి తీసుకుని వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారు. ఇప్పుడా ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి, రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందడానికి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఏదో విధంగా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో మూడో రచ్చబండ కార్యక్రమానికి తెరలేపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉపసంఘం భేటీ రచ్చబండ నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షతన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, పార్ధసారథి, వట్టి వసంతకుమార్, డికె ఆరుణ తదితరులు కార్యక్రమాన్ని రూపొం దించారు. అనంతరం కన్నా లక్ష్మినారాయణ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి రచ్చబండ తేదీలను ఖరారు చేశారు. నవంబర్ ఆరు నుంచి 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయిం చినట్లు కన్నా లక్ష్మినారాయణ మీడియాకు తెలిపారు. -
‘సమైక్య శంఖారావం’ పార్కింగ్, మార్గాలు
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకో వాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమా నులు మాత్రం కాలినడ కన వేదిక వద్దకు చేరు కోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. మార్గాలు, పార్కింగ్ ఇలా... విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. -
దండు కదులుతోంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ :సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభకు తరలివెళ్లేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తిరుగులేని వ్యతిరేకతతో, సమైక్యంగా ఉంచడానికి సాగే సమరంలో తామూ భాగస్వాములు కావాలని ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 85 రోజులు గా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములయ్యా రు. ఉద్యమానికి ఏపీఎన్జీఓలు తాత్కాలిక విరామం ఇచ్చిన నేపథ్యంలో సమైక్యాంధ్రకు కట్టుబడ్డ పార్టీగా వైఎస్సార్ సీపీ వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణతో ముందుకు కదులుతోంది. ఆ క్రమంలో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావ సభకు తరలి వెళ్లేందుకు సకలజనులు తహతహలాడుతున్నారు. అవధులు దాటిన అభిమానంతో జిల్లా నుంచి కనీవినీ ఎరుగని రీతిలో వెళ్లాలనుకుంటున్న వారికి పార్టీ నాయకులు రవాణా, వసతి సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నం కాగా మరోవైపు జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది హైదరాబాద్ బయల్దేరేందుకు స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ నాయకత్వంపై నమ్మకంతో.. పార్టీలతో సంబంధం లేకుండా జగన్ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు పనులు మానుకునైనా సమైక్య శంఖారావ సభకు వెళ్లాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. సభకు జిల్లా నుంచి అత్యధికులు హాజరు కావాలన్న పట్టుదలతో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్లు నియోజకవర్గాల వారీగా గురువారం పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆది నుంచీ ఆ కుటుంబం వెన్నంటి.. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జిల్లావాసులు ఆ కుటుంబం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తామున్నామంటూ వెన్నంటి నిలుస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఆయనను అభిమానించే వారి కష్టాల్లో అండగా నిలిచేందుకు జగన్మోహన్రెడ్డి జిల్లాకు పలు పర్యాయాలు వచ్చారు. ఓదార్పు యాత్ర, హరితయాత్రలతో పాటు ప్రజల పక్షాన జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రతి పోరులోనూ జిల్లావాసులు భాగస్వాములయ్యారు. ఆ క్రమంలోనే కుల, మత, వర్గాలకతీతంగా హైదరాబాద్ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సకల వర్గాల సంఘీభావం కాగా వైఎస్సార్ సీపీకి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలతో సుమారు 16 నెలల అక్రమ నిర్బంధం తర్వాత జననేత నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో రాష్ర్ట సమైక్యతను కాపాడేందుకు ఏం చెబుతారు అనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. రాష్ర్టభవిష్యత్ దశదిశ మార్చే సత్తా ఈ సభకు ఉందన్న నమ్మకం సమైక్యవాదుల్లో బలంగా ఉంది. పార్టీ శ్రేణులే కాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులతో పాటు సామాన్య ప్రజలు కూడా సభలో పాల్గొనాలన్న ఉత్సుకత చూపుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 బస్సులతోపాటు వందలాది వాహనాల్లో తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు 23 బోగీలతో శుక్రవారం ప్రత్యేక రైలు కూడా వేయడంతో సమైక్యవాదులు స్వచ్ఛందంగా ఈ రైలులో తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
‘శంఖారావా’నికి ఇలా వెళ్లాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌లో ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. స్టేడియం చుట్టు పక్కల మినహా మిగిలినచోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనల కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. మార్గాలు, పార్కింగ్స్ ఇలా... విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు, అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. -
‘సమైక్యం’గా తరలిరండి
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావ సభ విజయవంతం కావాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు గురువారం సీమాంధ్రలో కదం తొక్కాయి. కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బైక్ ర్యాలీలతో హోరెత్తించాయి. విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాలవారు ఈ ర్యాలీలకు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో, రంపచోడవరంలో కో- ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగాయి. ఏలూరులో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షాశిబిరాన్ని గురువారం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పార్టీ కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీని నియోజకవర్గ సమన్వయకర్త ముక్కుకాశిరెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బైక్‌ర్యాలీ అనంతరం పూల అంగళ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేశారు. విభజనవల్ల కలిగే నష్టాలను వివరిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంచిపెట్టారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ర్యాలీని ప్రారంభించగా, ఆదోనిలో సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ సాగింది. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆలూరు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి మొదలైన రిలే దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. -
సమైక్య శంఖారావం.
-
సమైక్య శంఖారావం పోస్టర్ విడుదల
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోవడం అసాధ్యమని, సమైక్య రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 26న జరిగే సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మొదటి నుంచి ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే నిజాయితీగా పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఒక్క జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం పూనుకుందన్నా రు. ఓట్లు, సీట్లు కోసమే చంద్రబాబు చూస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలివెళ్లేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు బీవీఆర్ చౌదరి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేటి సత్యనారాయణ, గద్దె వీరకృష్ణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి, కొయ్యలగూడెం మండల కన్వీనర్ ఆర్ఎస్ఎస్వీబీఏ నరసింహరాజు, పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, నాయకులు అల్లూరి రంగారావు, టి.నరసాపురం మండల నాయకులు యర్రా గంగాథర్, శ్రీనురాజు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర సాధ నే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రసాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్ స్టేడియంలో జరగనున్న సమైక్యశంఖారావం సభను విజయవంతం చేయూలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరుకావాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంను విభజించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతోందన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీగా మొదటి నుంచి మద్దతు ఇస్తున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగన్ మోహన్‌రెడ్డి రెండు సార్లు ఆమరణదీక్ష చేపట్టిన విషయూన్ని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్మోహనరెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీనేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమతీరు చూస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే ధ్యేయంగా రాజకీయలబ్ధి పొందేం దుకు ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా ఒకేఒక్కరు పోరాడుతున్నారని, జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటిస్తున్నారన్నారు. తెలుగుజాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటమే సమైక్య శంఖారావసభని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.