టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కన్నార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చెబుతారని వైఎస్. జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబు ఏ డీల్ కోసం ఢిల్లీకి వెళ్తున్నావు అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభలో ప్రసంగించిన ఆమె చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసినందంతా చేసి.. విభజనకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డే కారణమంటున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్-టీడీపీ కుట్రపూరిత చర్యలకే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు తలెత్తెయన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే వారికి పదవులే ముఖ్యమని టీడీపీ-కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించారన్నారు. రాష్ట్రానికి సమన్యాయం చేయలేనప్పుడు యధాతథంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయాలే నిర్భందంలో ఉండి కూడా జగనన్న వారం రోజుల పాటు నిరహార దీక్ష చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. జననేత.. జైల్లో ఉన్నా, బయట ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పూడూ పోరాటం కొనసాగిస్తుంటారని ఆమె తెలిపారు. విభజనకు కారణం వైఎస్ఆర్ కారణమని చంద్రబాబు ఎలా చెప్పగలుగుతారని ఆమె ప్రశ్నించారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే..జగనన్న చూస్తూ కూర్చోరని షర్మిల అన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతోందన్నారు. కోట్ల మంది గుండెలు మండి రోడ్ల మీదకు వస్తే.. అధికార పార్టీ నేతలు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు.