విజయవంతం చేయండి
Published Sun, Feb 9 2014 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న సమైక్య శం ఖారావం సభను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్‌ఆర్ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పార్టీ పట్టణ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని, ఆయన హయంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. అలాంటి నాయకుడి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి ఎపుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి రాలేమన్న దుగ్ధతోనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కల్యాణి, నాయకులు మార్పు ధర్మారావు, అంధవరపు సూరిబాబు తదితరులు మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ, శ్రీకాకుళం పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పార్టీ నేతలు ప్రధాన రాజేంద్ర, గేదెల పురుషోత్తం, టి.కామేశ్వరి, జె.ఎం.శ్రీనివాస్, కిల్లి వెంకట సత్యనారాయణ, పైడి రాజారావు, ఎన్ని ధనుంజయ్, మహమ్మద్ సిరాజుద్దీన్, అసదుల్లా, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, చల్లా మంజుల, టి.మోహిని, సీహెచ్.సీతారత్నం, గంగు శారద, బిడ్డిక లక్ష్మి, పీస శ్రీహరి, తంగి శివప్రసాద్, బహుదూర్ జానీ, కోరాడ రమేష్, పైడి గోపాలం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement