
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
సాక్షి, శ్రీకాకుళం: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, వైఎస్ జగన్‌తో పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదన్నారు.
‘‘పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు వైఎస్ జగన్. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత జగన్.. ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ఆయనకు పోటీ ఎవరూ లేరు. జగన్‌కు జగనే సాటి. సీఎంను విమర్శించే ముందు పవన్, లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు.
ఇవీ చదవండి:
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ