నేడు సమైక్య శంఖారావం
Published Sun, Feb 9 2014 3:30 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ భోగాపురం, న్యూస్‌లైన్:పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగోసారి జిల్లాకొస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. దారి పొడవునా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ పతాకాలతో జాతీయ రహదారి కళకళలాడుతోంది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభ జరిగే భోగాపురం మరింతగా ముస్తాబైంది. జిల్లా ముఖ ద్వారమైన రాజాపులోవలో అభిమానుల స్వాగత సంబరాల మధ్య జననేత జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధినేతను భోగాపురం వరకు తీసుకురానున్నారు. మార్గ మధ్యలో తిలకం దిద్ది, హారతులిచ్చి స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. కాగా, బహిరంగ సభ ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, అరకు పార్లమెంట్ పరిశీలకుడు బేబీనాయన, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనురాజు తదితరులు పర్యవేక్షించారు.
భారీగా ఏర్పాట్లు
భోగాపురం మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం వద్ద జరగనున్న సమైక్యశంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద భారీ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా పార్టీ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.
సభాస్థలిని సందర్శించిన డీఎస్పీ
సమైక్య శంఖారావం నిర్వహించనున్న సభాస్థలిని డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. జగన్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున చేయాల్సిన ఏర్పాట్లపై సీఐ కె.శ్రీనివాస్ చక్రవర్తి, ఎస్‌ఐ షేక్‌సర్దార్‌ఘనిలతో చర్చించారు. పార్లమెంటు సమన్వయకర్త బే బీనాయన, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడ మోహనరావు తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండల కన్వీనర్లు సబ్బవరపు వెంకటరమణ, మహంతి లక్ష్మణణరావు, దారపు లక్ష్మణరెడ్డి, మట్ట వెంకటరమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇమ్మిడిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement