అర్హులందరికీ సంక్షేమ పథకాలు
Published Mon, Feb 10 2014 2:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
విజయనగరం కలెక్టరేట్/కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : నాలుగు నెలలు ఓపిక పడితే రాష్ట్రంలోని అన్ని వర్గా ల ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరి గిన విధంగా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా...సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపు రం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభ అనంతరం స్థానికులు పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దళితుల ను వేధిస్తున్నారని..
సంక్షేమ పథకాలు అందకుండా బినా మీ పేర్లతో దోచుకుంటున్నారని మాలమహానాడు జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకొండ వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కంచేరు పరిధిలో 118 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని మహానేత వైఎస్ ఆదేశిస్తే... స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ భూముల ను ఆక్రమించుకున్నారని చెప్పారు. తామంతా వైఎస్సార్ సీపీ వెంట ఉండడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చీపురుపల్లి తహశీల్దార్ రామకృష్ణను అధికార పార్టీ నేతలు బలవంతంగా సస్పెండ్ చేయించిన విషయూన్ని అక్కడి నాయకులు జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. వీటిపై స్పందిం చిన జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే రాజన్న రా జ్యం వస్తుందని, అందరి సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.
ఉపకార వేతనాలు అందడం లేదు..
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న ఉద్దేశంతో మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజుల పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొ డుస్తున్నారని విద్యార్థి సమైక్య సేవా సంఘం అధ్యక్షుడు వై. రాజేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి 15 ల క్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదన్నారు. దీనిపై స్పందించిన జగన్.. మన ప్రభుత్వంలో విద్యా ర్థులందరికీ ఫీజు పథకాన్ని వర్తింపచేద్దామన్నారు.
విద్యార్థులతో ముచ్చటించిన జగన్
భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వి ద్యార్థులు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, కలి సి మాట్లాడేందుకు కాసేపు నిరీక్షించారు. ఆ మార్గం వెంబడి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ ఎదురుగా నిలిచారు. దీన్ని గమనించిన ఆయన తన వాహనంలోని నుంచి కిం దకి దిగి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకోవా లని సూచించారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భోగాపురం మండలం సాయికవలస గ్రామానికి చెందిన అం ధు డు రామప్పడును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్యాయంగా పలకరించారు.
వైఎస్సార్ సీపీలో ఖలీల్‌ఖాన్ చేరిక
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఖలీల్‌ఖాన్ ఆ పా ర్టీకి గుడ్‌బై చెప్పారు. జిల్లాలోని భోగాపురంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆయన వైఎస్సార్ సీపీ లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఖలీల్‌ఖాన్‌తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కూడా పార్టీలో చేరారు.
సమైక్యమే.. మా నినాదం
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయూలు ఇంకెన్నాళ్లూ సాగవు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. కుట్ర రాజకీయూలకు స్వస్తి చెప్పి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు.. భవిష్యత్తు మనదేనని వైఎస్సార్ సీపీ నేతలు భరోసా ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం మండలంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. డ్వాక్రా రుణాల రద్దు మహిళల కు వరమన్నారు. ‘అమ్మఒడి’ పథకంతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందుతున్నారు. పార్టీ నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే.....
- న్యూస్‌లైన్, చీపురుపల్లి (భోగాపురం)
దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి
కాంగ్రెస్, టీడీపీ నాయలకు దమ్ముంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజ కీయంగా ఎదుర్కొనాలి. టీడీపీ నేత చంద్రబాబులా ప్రాంతాల మధ్య విధ్వే శాలు రెచ్చగొట్టకుండా మా నేత మొదటి నుంచీ సమైక్యవాదంతో నే పోరాటం చేస్తున్నారు. ఆయన్ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవా లి. కాంగ్రెస్, టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అం దుకే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
- బేబీనాయన, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు
జగన్ ముఖ్యమంత్రి కావాలి
రాష్ట్రంలో స్వర్ణయుగం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కా వాలి. రాష్టాన్ని రావణకాష్టంలా మార్చిన కాంగ్రెస్, టీడీపీలను సాగనం పాలి. రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలి. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలి.
- కాకర్లపూడి శ్రీనివాసరాజు, కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు
ఇదో చేతకాని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు. బడుగు, బలహీనవర్గాల అభ్యన్నతి కోసమే వైఎస్సార్ పని చేశారు. మళ్లీ ఆయన పరిపాలన రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయన నాయకత్వం అధికారంలోకి రావాలి.
- పెనుమత్స సురేష్‌బాబు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త
బొత్స వల్లే జిల్లాకు
చెడ్డ పేరు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వల్ల జి ల్లాకు చెడ్డ పేరు వస్తోంది. ఆయన మంత్రి అ య్యూక జిల్లాలో ప్రజల జీవన విధానాన్ని మా ర్చేశారు. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా అవినీతి పాలన సాగిస్తున్నారు.
- కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త
ఆ రెండు పార్టీలు ఒక్కటే
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలు ఉనికిని కాపాడుకు నేందుకు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్రం బాగుండాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయూలి.
- వేచలపు వెంకటచినరామునాయుడు,
ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త
కాంగ్రెస్‌ది నిరంకుశ పాలన
రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో, కేంద్రంలో కాం గ్రెస్ ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రాన్ని విడదీస్తున్నాయి. దీనికి టీడీపీ నేత చంద్రబాబు మద్దతు పలకడంతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. విభజనకు నిరసనగా మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే.
- సుజయ కృష్ణ రంగారావు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త
కుళ్లు రాజకీయాలకు స్వస్తి చెప్పండి
రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయూలకు ప్రజలు చరమగీతం పాడాలి. కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం కలిసి ఉన్న ప్రజలను విడదీశారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు నిదర్శనం. స్వర్ణయుగం రావాలన్నా.. రా ష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. - పెనుమత్స సాంబశివరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు
జగన్ అంటే కాంగ్రెస్, టీడీపీలకు భయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెబితే కాంగ్రెస్, టీడీపీ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి రక్షించేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నది జగన్‌మోహర్‌రెడ్డి ఒక్కరే. జగన్‌కు మద్దతు ఇస్తే భవిష్యత్ బాగుంటుంది.
- విజయ చందర్, సినీ నటుడు
వైఎస్ లక్షల మందికి దేవుడయ్యారు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేసి, లక్షల మందికి దేవుడయ్యా రు. ఆరోగ్యశ్రీతో లక్షలాది మంది ప్రాణాలు రక్షించారు. మ ళ్లీ ఆయన పాలన రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి కావాలి.
- బొత్స కాశీనాయుడు,
జిల్లా వైద్య విభాగం కన్వీనరు
రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తోంది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజించి ప్రజలను మోసం చేస్తోంది.
- గేదెల తిరుపతిరావు,
ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే....
రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోంది. దేశంలో ఆమెకు ఓటు లేకపోయినప్పటికీ ఒక్కటిగా ఉన్న ఆంధ్రులను మాత్రం విడదీస్తోంది. ఇదెక్కడి న్యాయం. ఈ ప్రభుత్వానికే ప్రజ లే బుద్ధి చెప్పాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైని కుల్లా పని చేయాలి.
- ఆదాడ మోహనరావు,
జిల్లా ఎస్సీ సెల్ కన్వీనరు
Advertisement
Advertisement