సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు? | why kiran kumar reddy silence on resolution of samaikyandhra?, asks ys jagan | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు?

Published Thu, Jan 9 2014 8:03 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు? - Sakshi

సమైక్య తీర్మానానికి ఎందుకు వెనుకాడుతున్నారు?

కల్లూరు(చిత్తూరు జిల్లా): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు కలిసి రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని సమైక్య శంఖారావంలో భాగంగా కల్లూరు సభలో మాట్లాడిన జగన్..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బహిష్కరించడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారన్నారు. వారు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని జగన్ దుయ్యబట్టారు. సమైక్య నినాదం వినిపించినందుకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ విలువల్ని కాలరాస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement