
విశ్వసనీయతే నా వారసత్వం
విశ్వసనీయత తనకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి వచ్చిన వారసత్వమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అశేష జనవాహిని మధ్య ఆయన వాల్మీకిపురం, కలికిరి సభల్లో మాట్లాడారు.
సాక్షి, తిరుపతి:
చంద్రబాబు నాయుడులా తాను వెన్నుపోటుదారుడిని కాదని, విశ్వసనీయతే తన వారసత్వమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయ న జిల్లాలో చేస్తున్న ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా మంగళవారం వాల్మీకిపురం, కలికిరి మండల కేంద్రాల్లో ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం అభిమానులను ఆకట్టుకోవడంతో, రెండు సభల్లోను కదల కుండా విన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ ఆయనకు జేజేలు పలికారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఏవి ధంగా వీరిద్దరూ కలసి మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించారు. వేలాది మంది జనం రోడ్లపైనే కాకుండా, చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి ఎక్కి జననేత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయన ప్రసంగంలో తండ్రి తనకు విశ్వసనీయత నే ర్పించారని తెలిపారు.
చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలకు పది పైస లు కూడా ఇవ్వలేదని, దీంతో ఆయన ఇప్పుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అదే జగన్‌మోహన్ రెడ్డి 50 పైసలు ఇస్తానన్నా ప్రజలు నమ్ముతారని, అదే తన విశ్వసనీయత అన్నారు. దీంతో ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదని, సొంత మామనే వెన్నుపోటు పొడిచిన బాబు ప్రజలకు ఏమి మేలు చేస్తాడని ప్రశ్నించారు. మద్యనిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు మళ్లీ మద్య నిషేధం విధిస్తానని, రుణాలు ఇవ్వని బాబు, మళ్లీ మహిళలకు రుణాలు ఇస్తానని హామీలు ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తల్లికి చీర కొనిపెట్టడానికి లేదు కానీ, చిన్నమ్మకు బంగారం కొనిస్తానంటే, ఎవరు నమ్ముతారనే సామెత చెప్పగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని దేశమంతా చెబుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు మాత్రమే న్యాయమంటున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన జరగాలంటే ముందుగా అసెంబ్లీలో ప్రతిపాదనను ఆమోదించి, తరువాత కేంద్రానికి పంపాలని, అయితే ఇక్కడ అంతా రివర్సులో జరుగుతోం దని అన్నారు. బిల్లుపై సమైక్య తీర్మానం చేయాలంటే, ఇప్పటికీ వీరిద్దరూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారని అన్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణ వారితో విభజనకు అనుకూలమని, సీమాంధ్రులతో సమైక్యానికి అనుకూలమని చెపుతూ పార్టీ ఎమ్మెల్యేలనే మభ్య పెడుతున్నారని తెలిపారు. సోనియాగాంధీ గీత గీస్తే, ఆ గీతను దాటని కిరణ్‌కుమార్‌రెడ్డి, వారితో కు మ్మక్కయిన బాబు కలసి రాష్ట్రాన్ని దిగజారుస్తూ, తాను కుమ్మక్కయినట్లు ప్రచారం చేస్తున్నారని అనగానే, కిరణ్, బాబుకు వ్యతిరేకంగా జనం నినాదాలు చేశారు.
సీమాంధ్రలో ప్రతి గుండె సమైక్యం అని కొట్టుకుంటోందని అన్నా రు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, పూర్ణం, రవిప్రసాద్, డాక్టర్ సునీల్ కుమార్, పీలేరు నియోజవకర్గ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలకు ముందు ప్రజలను ఉత్తేజ పరిచే విధంగా పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, జగతి బృందం ఆలపించిన పలు గీతాలు అలరించాయి.