సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
Published Mon, Oct 21 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
ఒంగోలు, న్యూస్‌లైన్:సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉండాలన్నదే జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. అందులో భాగంగానే సమైక్యవాదాన్ని ఢిల్లీ నేతలకు వినిపించేందుకుగాను హైదరాబాదులో ఈ సమైక్య శంఖారావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమైక్య రాష్ట్రాన్ని కేవలం సీమాంధ్రులే కోరుకుంటున్నారని భావించడం సరికాదన్నారు. తెలంగాణ జిల్లాల్లో సైతం సమైక్యంగా ఉండడం వల్ల కలిగే ఫలితాలు, విడిపోతే ఎదురయ్యే సమస్యలు తెలుసుకున్న అనేకమంది నేడు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.
ఈనెల 26న హైదరాబాదులోని లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి అన్ని ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతం మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని , ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న నేతలకు చెప్పేందుకే సమైక్య శంఖారావాన్ని తమ పార్టీ పూరించిందన్నారు. మాట్లాడితే కుమ్మక్కని వైఎస్సార్‌సీపీ మీద ఆరోపించడం కాదని, గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఏవిధంగా కుమ్మక్కయింది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఈనెల 26న నిర్వహించే సమైక్య శంఖారావానికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీ పరంగా నియోజకవర్గానికి 5 వేల నుంచి 10 వేల మంది సమైక్యవాదులు హైదరాబాదుకు తరలివస్తారని భావిస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, టి.నరశింగరావు, సూరా సామిరంగారెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్,
వైఎస్సార్‌సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, కావూరి సుశీల, యరజర్ల రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు గోవర్థన్, ఎస్‌వీ రమణయ్య, జాజుల కృష్ణ, రాయని వెంకట్రావు, మీరావలి, తోటపల్లి సోమశేఖర్, మాజీ కౌన్సెలర్ వెలనాటి మాధవరావు, ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, కొత్తపట్నం నాయకులు లంకపోతు అంజిరెడ్డి, వీఆర్‌సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement