
సాక్షి, ప్రకాశం: భూ ఆక్రమణలపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఓ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంలో రూ.5కోట్లు తీసుకోలేదని దామచర్ల ప్రమాణం చేయగలారా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి రూ.100కోట్లు కొట్టేసిన చరిత్ర ఆయనది అంటూ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో దామచర్ల జనార్ధన్ అవినీతి బాగోతాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు)