
సాక్షి, ఒంగోలు: ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత దామచర్ల జనార్ధనరావు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులతో వెళ్లి పీఎస్‌లో పోలీసులను బెదిరింపులకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో గొడవకు కారణమైన టీడీపీ కార్యకర్తను.. దామచర్ల జనార్ధన్ పీఎస్ నుంచి తీసుకెళ్లారు.
నిందితుడిని తీసుకెళ్లొదన్న సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్పీతో చంద్రబాబు మాట్లాడాతరంటూ నిందితుడిని తీసుకెళ్లారు. అయితే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనుమతి లేకుండా నిందితుడిని దామచర్ల తీసుకెళ్లడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.