damacharla janardhan
-
నీ ఇంటికొచ్చి కొడతా నా కొ...కా...!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘నీ ఇంటికి వచ్చి కొడతా నా కొ...క... మరోసారి పొట్టి శ్రీరాములు గురించి మెసేజులు పెడితే బాగుండదు’ అంటూ ఒంగోలు (Ongole) ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla Janardhana Rao) పీఏ అనిల్... పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుపై బెదిరింపులకు దిగడం సంచలనం సృష్టించింది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం... ఒంగోలులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేరకం నాగాంజనేయులుకు పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం ఉంది. రెండు రోజుల క్రితం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు సంబంధించిన ఓ వీడియోను అందరితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏ అనిల్‌కు కూడా పంపారు. దీంతో అనిల్ రెచ్చిపోయాడు. ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్నాడు. ‘అడుక్కుతినే నా కొ...క. మరోసారి మెసేజ్ పెడితే బాగుండదు.. ఇంటికొచ్చి కొడతా..’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నాగాంజనేయులపై టీడీపీ నేతలు దాడి చేశారని, అయినా తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నాగాంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు.చదవండి: మొత్తానికి రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం! -
Prakasam District: ప్రభుత్వ ఉద్యోగి బరితెగింపు
ఒంగోలు సబర్బన్: కూటమి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వమే మాది.. మమ్మల్ని ఎవరేం చేస్తారనే అహంకారంతో కాలర్ ఎగరేస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ ఎమ్మెల్యేకి నగరంలో 20కిపైగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడంటే.. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడబడితే అక్కడ అతని ఫొటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అది కూడా జిల్లా పరిపాలనా కార్యాలయమైన కలెక్టరేట్ వద్ద గల చర్చి సెంటర్లో భారీ ఫ్లెక్సీలను అతని ఫొటోలతోనే ఏర్పాటు చేశాడు. వాటిని చూసి ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకెళ్తే..వైద్యారోగ్యశాఖలో జిల్లా కోర్టు ప్రాంగణానికి ఆనుకుని ఉన్న మాతా శిశు వైద్యశాలలో పొన్నర్సు శ్రీహరి అలియాస్ బబ్లీ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెగ్యులర్ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న శ్రీహరి.. ఆ వైద్యశాలలో కూడా పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నాడని ఇప్పటికే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా నగర ప్రధాన కూడలి అయిన చర్చి సెంటర్లో ఎమ్మెల్యే భారీ కటౌట్లతో పాటు తన ఫొటోలతో శ్రీహరి ఫ్లెక్సీ వేశాడు. చర్చి సెంటర్‌తో పాటు నగరంలోని జయరాం థియేటర్ సెంటర్, రాజాపానగల్ రోడ్డు, మరికొన్ని ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యే ఫొటోలు, తన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయం ముందే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడంటే జిల్లా అధికారులంటే కూడా లెక్కలేదన్నట్లుగా అతని తీరు ఉంది. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు కూడా అతన్ని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే జనార్దన్ అండదండలు అతనికి మెండుగా ఉన్నాయని, అందుకే ఇలా రెచ్చిపోతున్నాడని సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకి ప్రభుత్వ ఉద్యోగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జిల్లా అధికారులు ఏ విధంగా పరిగణిస్తారో వేచి చూడాలి మరి.ఫ్లెక్సీల కారణంగా చర్చి సెంటర్లో రోడ్డు ప్రమాదం...నగరంలోని ప్రధాన కూడలి అయిన చర్చి సెంటర్లో రోడ్లకు అడ్డంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కారణంగా ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదుటి వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకూ పూర్తిగా కనిపించకుండా జంక్షన్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనదారులు రాకపోకలు సాగించే సమయంలో ఫ్లెక్సీలు అడ్డుగా ఉండి ఇతర వాహనాలు కనిపించక ఫెక్సీల పక్కనే కారు, మోటారు సైకిల్ ఢీకొన్నాయి. దాంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక జీజీహెచ్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై ఒంగోలు నగర పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
మా కారు ఎక్కండి... సున్నితంగా తిరస్కరించిన కలెక్టర్ అన్సారియా
ఒంగోలు అర్బన్: సాధారణ విషయాలు మాట్లాడేందుకు కలెక్టర్ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంగళవారం వచ్చి కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా సాధారణ విష యాలు చర్చించేందుకు వచ్చామని దామచర్ల తెలిపారు. అయితే కలెక్టరేట్ నుంచి నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లేందుకు అప్పుడే కలెక్టర్ కూడా కారు వద్దకు వచ్చారు. దీంతో దామచర్ల తాను మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నానని కలిసి వెళ్లేందుకు తన కారు ఎక్కాలని పదేపదే కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ ఎమ్మెల్యే కారు ఎక్కబోయి కూడా వెనక్కు వెళ్లిపోయారు. మళ్లీ ఎమ్మెల్యే తన కారు ఎక్కాలంటూ కోరడంతో కలెక్టర్ సున్నితంగా తిరస్కరించి తన కారులో మున్సిపల్ కార్పొరేషన్‌కు బయలు దేరారు. జరిగిన సంఘటనను అక్కడే ఉన్న కూటమి నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
దేనికైనా సిద్ధమే దామచర్ల కు బాలినేని వార్నింగ్
-
టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ
కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటేఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్ వాటర్ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్ వాటర్ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు కాలేదు.👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.👉 స్థానిక బైపాస్‌లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్ఎస్పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ కాగితాలు చూపించాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కోరినందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌నే ముట్టడించారు.బాబు మెప్పుకోసం..తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది. అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.జెడ్పీ పీఠంపైనా కుట్రే..2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.కాపులపైనా కేసులుఅధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు. -
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
టీడీపీ నేత జనార్దన్ తీరుపై బాలినేని ఆగ్రహం
-
రాయపాటి అరుణపై దాడి
జనసేనలో నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు ఆరోపణలుచేసుకునే స్థాయి దాటి దాడి చేసే వరకూ వచ్చింది. మహిళానేతపై దాడి చేసి అడ్డువచ్చిన వారిని జిల్లా అధ్యక్షుడి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ అని చూడకుండా ఆమైపె చేయి చేసుకున్నారు. నడిరోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృషికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా..పోత్తులతో బిజీగా ఉన్నాం.. ఎన్నికలు ముగిసిన తర్వాత చూసుకుందాంలే అంటూ ఈజీగా తీసుకున్నారు. అధినేత తీరుపై పార్టీ కేడర్ విస్తుపోతోంది. జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గానికి మాజీ ఎమ్మెల్యే దామచర్ల అండదండలు ఉండడంతో పేట్రేగి పోతున్నారని బాధితురాలి వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా జనసేనలో గ్రూపు తగాదాలు రోడ్డెక్కాయి. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య పొసగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికల మీద ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం జరుగుతోంది. పార్టీకి సంబంధించి జిల్లాలో పెత్తనం సాగిస్తున్న రియాజ్ వర్గం పార్టీ సమావేశాలకు అరుణను ఆహ్వానించడం లేదు. ఒకవేళ పిలిచినా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వక పోవడం, చేతిలో ఉన్న మైకును సైతం లాక్కోవడం చేస్తున్నారు. ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా తరచుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఈ విషయం గురించి అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ అండతో రియాజ్ వర్గం పేట్రేగిపోతోందని అరుణ వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలోనే దాడికి ప్లాన్... ఆదివారం ఒంగోలులోని పీఏజీ కన్వెన్షన్ హాలులో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన అరుణను ప్రొటోకాల్ ప్రకారం వేదికపైకి ఆహ్వానించాల్సి ఉంది. అయితే ఆమెను పిలవలేదు సరికదా, కనీసం ప్రసంగించే అవకాశం కల్పించకుండా అవమానాలకు గురిచేశారు. సమావేశంలో ఎక్కడో చివరన ఆమెకు సీటు కేటాయించారు. దీనిని ఆమె ప్రశ్నించి ఉంటే సమావేశంలోనే దాడికి ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. దాంతో అదే రోజు సాయంత్రం నాగులుప్పలపాడు మండలంలో జరిగే జెండా విష్కరణ కార్యక్రమంలో అరుణ మీద దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇదంతా జనార్దన్ కనుసన్నల్లోనే జరిగినట్లు అరుణ వర్గానికి చెందిన పలువురు జనసేన కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారును వెంబడించి... ఛాతిపై దాడి చేసి నాగులప్పలపాడు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జండావిష్కరణ కార్యక్రమానికి సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్‌తో కలిసి అరుణ వెళ్లారు. కార్యక్రమాలు పూర్తయ్యే సరికి రాత్రి 9 గంటలు దాటింది. తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్ద రియాజ్ అనుచరులు రాంబాబు, మాత్యాల కళ్యాణ్ తదితరులు అరుణ ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. అరుణ అనుచరుడు చరణ్ మీద దాడికి దిగారు. అక్కడ నుంచి తప్పించుకొన్న అరుణ కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్దకు రాగానే కారును ఆపి అరుణపై దాడికి దిగారు. ఛాతీపై చేయ్యేసి పిడిగుద్దులు కురిపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ..నిన్ను చంపేస్తా అంటూ బెదిరించారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. అధ్యక్ష్యా ఇలా అయితే ఎలా.. రాష్ట్ర అధికార ప్రతినిధి మీద దాడి జరిగినా ఖండించకపోవడమే కాకుండా ఇప్పుడు పొత్తులతో బిజీగా ఉన్నాను. ఎన్నికల తరువాత కూచొని మాట్లాడుదాంలే అని చెప్పడం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ చెప్పడం కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర నాయకురాలికే పార్టీలో భద్రత లేకపోతే సామాన్య మహిళా కార్యకర్తల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రియాజ్, అరుణ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టకుండా ఉండడం వల్లనే నేడు దాడుల వరకు పరిస్థితి వెళ్లిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ జనసేన నాయకులను తరచుగా అవమానిస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల కార్యకర్తలు మనస్తాపం చెందుతున్నారు. పార్టీలో సాక్షాత్తూ మహిళపై దాడి జరిగినా అధిష్టానం స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడిని పట్టించుకోని జనార్దన్ ... జనసేనలో గ్రూపుల గొడవలను దామచర్ల జనార్దన్ రాజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న గ్రూపు తగాదాల్లో ఆయన ఒక గ్రూపును ప్రోత్సహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అరుణ మీద దాడి జరిగిన తరువాత చికిత్స కోసం ఆమె నేరుగా జీజీహెచ్‌కు వచ్చారు. అరుణ మీద జరిగిన దాడిని కనీస మర్యాదగా కూడా ఖండించలేదు. జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నా అరుణను పరామర్శించలేదు. కావాలనే రియాజ్‌తో కలిసి సోమవారం జీజీహెచ్‌కు వచ్చిన ఆయన ఒక మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ అని కూడా చూడకుండా ఆయన వ్యవహరించిన తీరుపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఒంగోలు టీడీపీ అభ్యర్ధిగా జనార్దన్ పేరును ప్రకటించిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లి అరుణ అభినందిచారు. అదికూడా జనార్దన్ పట్టించుకోకుండా రియాజ్ వర్గాన్ని వెనుకేసుకుంటూ వస్తున్నారని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. -
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్‌లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్‌కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ దౌర్జన్యం.. సీఐకి బెదిరింపులు
సాక్షి, ఒంగోలు: ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత దామచర్ల జనార్ధనరావు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులతో వెళ్లి పీఎస్‌లో పోలీసులను బెదిరింపులకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో గొడవకు కారణమైన టీడీపీ కార్యకర్తను.. దామచర్ల జనార్ధన్ పీఎస్ నుంచి తీసుకెళ్లారు. నిందితుడిని తీసుకెళ్లొదన్న సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్పీతో చంద్రబాబు మాట్లాడాతరంటూ నిందితుడిని తీసుకెళ్లారు. అయితే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనుమతి లేకుండా నిందితుడిని దామచర్ల తీసుకెళ్లడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అవినీతికి కేరాఫ్ దామచర్ల జనార్దన్
ఒంగోలు: అభివృద్ధి పథం అంటూ అభివృద్ధి భూతాన్ని ప్రజలకు చూపిస్తే నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని, అవినీతికి కేరాఫ్‌గా దామచర్ల జనార్దన్ నిలిచిపోయారంటూ నగర మేయర్ గంగాడ సుజాత విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడైనా పనులు నిలిచిపోతే ఆందోళన చేశామని, కానీ పనులు వేగవంతంగా జరుగుతుంటే దానిని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో నిరసన చేయడం దామచర్లకు మాత్రమే చెల్లిందన్నారు. బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద కమీషన్‌తోపాటు దాదాపు రూ.10 కోట్ల అప్పు, ఇంకా మరికొంత మంది వద్ద అప్పు తీసుకుని వారిని దామచర్ల ఎలా వేధిస్తుందీ అందరికీ తెలుసన్నారు. మల్లవరం నుంచి నగరానికి పైప్‌లైన్ పనుల్లో ఎంత కక్కుర్తి పడింది, చివరకు టీడీపీ నాయకుల స్థలాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే వదిలేసి పత్తా లేకుండా పోయిన విషయం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. చివరకు జనార్దన్ కమీషన్లకు భయపడి కాంట్రాక్టర్లు సైతం పరారయ్యే పరిస్థితి వస్తే వారికి బకాయిలు సైతం తీర్చి నేడు పనులు వేగవంతంగా చేయిస్తుంటే కళ్లుండి చూడలేని స్థితి నెలకొందని విమర్శించారు. నిద్రలో సైతం బాలినేని ఫోబియాతో జనార్దన్ వణికిపోతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ మాట్లాడుతూ మభ్యపెట్టడం, మోసపుచ్చడం అనేది చంద్రబాబు నాయుడికి మాత్రమే వెన్నతో పెట్టిన విద్య అని జనం అనుకునేవారని, కానీ నేడు ఆ జాబితాలో జనార్దన్ కూడా చేరిపోయారని విమర్శించారు. ఒంగోలులో 20 వేల పెన్షన్లు తీసివేశారంటూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని, 2 వేల పెన్షన్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతే తిరిగి వాటిని బాలినేని స్వయంగా పర్యవేక్షించి 1800 పెన్షన్లు పునరుద్ధరించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం పెన్షన్లు తిరిగి వచ్చాయన్న విషయం ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ప్లాన్‌చేసి బకింగ్‌హాం కెనాల్ బ్రిడ్జి అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ విమర్శించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు మాట్లాడుతూ ప్రతి చోట యాక్టింగ్ షోలు సక్సెస్ కావని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒంగోలులో ఎంతమంది పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు? నేడు వాటి విలువ ఎంతో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని, కానీ జనార్దన్ హయాంలో ఎంతమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి ఎంతమంది పేదల ఆస్తులు పెరగడానికి దోహదపడ్డారో సమాధానం చెప్పాలన్నారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు మాట్లాడుతూ రెండేళ్లపాటు కరోనా విలయ తాండవం చేసినప్పుడు ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడితే అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు బెంగళూరు, హైదరాబాదులో తలదాచుకుని, నేడు రోడ్ల మీదకు వస్తున్న తీరు చూసి ఇదేం ఖర్మ అంటూ జనం ఈసడించుకునే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్ మాట్లాడుతూ గోల్డెన్ స్పూన్ అని చెప్పుకునే జనార్దన్‌కు నిద్రలో సైతం బాలినేని కుటుంబాన్ని తలుచుకునే పరిస్థితి దాపురించిందని, బాలినేని ఫోబియాతో వణికిపోతున్నారని విమర్శించారు. టీడీపీ కోసం అంటూ బండ్లమిట్ట వద్ద ముస్లిం దుకాణాలను ధ్వంసం చేసింది, బుడబుక్కల వారి ఇళ్లను ధ్వంసం చేసింది, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఎలా కాజేయాలనుకుంది ప్రజలందరికీ తెలుసని, కబ్జాదారు ఎవరు, కనికరించేది ఎవరో కూడా అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు కుమార్తె పెళ్లికోసం కాళ్లు పట్టుకుని ఆర్థికసాయం అందించమని జనార్దన్‌ను ప్రాధేయపడితే చివరకు రూ.50 వేలు చేతిలో పెట్టి లక్ష రూపాయలకు ఓచర్ రాయించుకున్నారంటూ మండిపడ్డారు. కార్పొరేటర్ తాడి కృష్ణలత మాట్లాడుతూ అభివృద్ధి మీరు చేస్తే నగరంలో తమ సమస్యలు తీర్చండంటూ జనం మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని, నేడు నిధులు అత్యధికంగా పేద ప్రజానీకం నివాసం ఉండే ప్రాంతాల్లోనే వెచ్చిస్తున్న సంగతి తెలుసుకోవాలన్నారు. బొమ్మనేని మురళి మాట్లాడుతూ బకింగ్‌హాం కెనాల్ ప్రాజెక్టుకు కేవలం 40 శాతం పనులు చేసి 80 శాతం చేశానంటూ ప్రజలను నమ్మించాలని చూడడం జనార్దన్ కుట్రలో భాగమే అన్నారు. 2015లో బ్రిడ్జి మంజూరైతే టెండర్ ఖరారుకు 16 నెలలు, మరో ఏడాదికి అంటే 2017లో శంకుస్థాపన చేశారని..ఇదీ టీడీపీ హయాంలో వేగవంతంగా పనులు జరగడం అంటూ విమర్శించారు. ప్రతి పనిలోను పర్సంటేజీలే అని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనార్దన్ హయాంలో ప్రతి పనిలోను 20 శాతం అదనానికి టెండర్లు పడడమే ఇందుకు నిదర్శమని మండిపడ్డారు. -
నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు. చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు) కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం. బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా.. ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు -
'ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్'
సాక్షి, ప్రకాశం: భూ ఆక్రమణలపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఓ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో రూ.5కోట్లు తీసుకోలేదని దామచర్ల ప్రమాణం చేయగలారా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి రూ.100కోట్లు కొట్టేసిన చరిత్ర ఆయనది అంటూ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో దామచర్ల జనార్ధన్ అవినీతి బాగోతాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
ఉనికి కోసం..సొంత పార్టీ వాళ్లకే మళ్లీ కండువాలేసి కొత్తగా చేరినట్లు..!
ఎక్కడైనా ఒక పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చిన వారిని ఆ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటారు. కానీ ఇప్పటికే పార్టీలో ఉన్న వారు మరోసారి కొత్తగా చేరినట్లు కలరింగ్ ఇవ్వడం, పక్క పార్టీకి చెందిన యువకులను మాయమాటలు చెప్పి పార్టీ కార్యాలయానికి పిలిపించి మెడలో పచ్చకండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు టీడీపీ జిల్లా నేతలు. నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని జనాలకు చెప్పుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీకి ప్రజల్లో నూకలు చెల్లిపోతున్నాయి. పార్టీ కేడర్ క్రమంగా దూరమవుతోంది. దీంతో అధినాయకత్వం మొదలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఏమీ పాలుపోవడం లేదు. ఎలాగైనా పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దొడ్డిదారి మార్గాన్ని అన్వేషించాడు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరిని బయటకు గెంటేస్తారా...వాళ్లను దగ్గరకు తీద్దామని ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలో ఉండేవాళ్లకే టీడీపీ కండువాలు వేసి వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీలో నుంచి కాకర్ల ఈశ్వర్ అనే కార్యకర్తను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా పెట్టాడు. దీనిని గమనించిన దామచర్ల.. కాకర్ల ఈశ్వర్‌కు వలవేశాడు. ఎలాగూ బాలినేని కుటుంబం తనను దూరంగా పెట్టింది. కాబట్టి ఇక్కడ మంచి ప్యాకేజీ మాట్లాకుంటే పోలా అని ఈశ్వర్ తలచాడు. దీంతో ఈశ్వర్ వైఎస్సార్సీపీలోని కొందరు అనుచరులకు ‘‘బాలినేని ప్రణీత్ అన్న వస్తున్నాడు వెళదాము రండి’’ అంటూ ఆదివారం కబురు పంపాడు. యువకులు కొందరు ద్విచక్ర వాహనాలు వేసుకొని వచ్చారు. వాళ్లందరి వాహనాలకు పెట్రోలు కొట్టించాడు. వీరితో పాటు టీడీపీ కార్యాలయం కూడా పార్టీలోని మరికొందరు యువకులను వాళ్లకు తోడు చేసింది. అయితే ఈశ్వర్ చెప్పింది ఒకటి..చేసింది మరొకటి. బాలినేని నివాసానికి అని చెప్పి పాత గుంటూరురోడ్డులోని టీడీపీ ఆఫీసుకు వాళ్లను తీసుకెళ్లాడు. దీంతో కొందరు ఆ విషయం పసిగట్టి వెనక్కు వెళ్లిపోయారు. కొందరు సన్నిహితంగా ఉండేవాళ్లు టీడీపీ కార్యాలయంలో ఇరుక్కుపోయారు. వాళ్లకు దామచర్ల చేత బలవంతంగా టీడీపీ కండువాలు వేయించాడు. సందట్లో సడేమియా అంటూ టీడీపీలో ఉన్న వాళ్లకు కూడా కొంతమందికి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్సీపీ నుంచి వచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా తేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పొరపాటు జరిగిపోయిందని సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కార్యాలయంలో ఈశ్వర్ చేసిన దుశ్చర్య గురించి చెప్పారు. టీడీపీలోకి వెళ్లటం తమకు ఇష్టం లేదంటూ మళ్లీ మేయర్ గంగాడ సుజాతతో పాటు మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల వద్ద పార్టీ కండువాలు వేయించుకున్నారు. పార్టీ కండువాలు వేయించుకున్న వారిలో బాపట్ల సాయి, కొప్పెర్ల విజయ్, శేఖర్, షాహిద్‌తో పాటు పలువురు ఉన్నారు. ఇదే తరహాలో నాలుగు రోజుల క్రితం మూడో డివిజన్లో కూడా మరో తంతు జరిగింది. మెప్మాలో గతంలో ఆర్పీగా పనిచేసిన టీడీపీ చెందిన ముంతాజ్.. గ్రూపు మీటింగ్ ఉందని చెప్పి కొంతమంది మహిళలను డివిజన్‌లోకి పిలిపించింది. వాళ్లలో పది మంది వరకు టీడీపీ వాళ్లే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఏ ఒక్కరూ అక్కడకు వెళ్లలేదు. డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి దామచర్లను పిలిపించింది. వైఎస్సార్సీపీ నుంచి పార్టీలోకి వస్తున్నారంటూ దామచర్లకు చెప్పింది. అంతే ఆయన పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కండువాల కార్యక్రమానికి ముందే కొంతమంది మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అసలు మూడో డివిజన్ టీడీపీ అధ్యక్షుడికి గానీ, కార్యదర్శికి కానీ ఈ కండువాల పంచాయితీనే తెలియదు. దీన్ని బట్టి అసలు టీడీపీలో ఎవరు ఉన్నారో కూడా దామచర్లకు తెలియదంటే ఆయనకు పార్టీ మీద ఉన్న పట్టు ఏపాటిదో అట్టే అర్థమవుతోంది. ప్యాకేజీల కోసం వచ్చే వారి కోసం దామచర్ల తివాచీలు పరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు సాగించిన భూదందా నేటికీ కొనసాగుతోంది. అమాయక పేద ప్రజలకు స్థలాల ఆశ చూపి గతంలో డబ్బు గుంజిన టీడీపీ నాయకులు నేడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలు.. అదే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో భూదందా సాగిస్తుండటం సంచలనంగా మారింది. చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట పెళ్లూరు. చెరువుకొమ్ముపాలెం మధ్య ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి బిట్లు బిట్లుగా విక్రయించిన మహిళా నాయకురాలు.. తాజాగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే యత్నం చేస్తోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన స్థానికులను చంపేస్తామంటూ రౌడీలతో బెదిరిస్తుండటంతో వారు ప్రాణ భయంతో బుధవారం ఎస్పీ మలికాగర్గ్ వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం–పెళ్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమి గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. ఈ అక్రమాల దందాకు ప్రధాన సూత్రధారురాలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచర వర్గానికి చెందిన పాలేటి అమృత. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఆమె.. దానికి ఏకంగా అమృత నగర్‌గా పేరుపెట్టింది. అందులో గుడిసెలు వేసి పట్టాలిప్పిస్తానని చెప్పడంతో సుమారు 55 మంది వరకు ఆశపడ్డారు. ఒక్కొక్కరికి 10 గదుల చొప్పున స్థలం కేటాయించిన అమృత రూ.లక్ష చొప్పున అప్పనంగా దండుకుంది. రౌడీ మూకలతో బెదిరింపులు.. చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో 55 మంది గుడిసెలు వేసుకోగా ప్రస్తుతం అక్కడ 30 కుటుంబాలే కాపురముంటున్నాయి. సుమారు 25 మంది అమృత బెదిరింపులకు భయపడి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మామిడిపాలేనికి చెందిన కొందరు రౌడీïÙటర్లను పంపి తరచూ బెదిరిస్తుండటంతో చేసేదేమీ లేక వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఖాళీ చేసి వెళ్లిన వారి గుడిసెలను కూడా అమృత రూ.లక్ష చొప్పున మళ్లీ బేరానికి పెట్టి అమ్మేసింది. అమృత నగర్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కాలంలో ప్రభుదాస్ అనే వ్యక్తితో కలిసి ప్లాట్లు వేసి 15 మందికి విక్రయించడంతో స్థానికులు తమకు ఇబ్బందులొస్తాయని ఎదురుచెప్పడం అమృతకు కంటగింపుగా మారింది. బుధవారం రాత్రి పది గంటల సమయంలో అమృతతోపాటు 10 మంది వ్యక్తులు గుడిసెల వద్దకు వచ్చి బెదిరించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అమ్మో ఆ వేధింపులు తాళలేం... సుబానీ బ్యాచ్, ప్రభుదాస్ బ్యాచ్ పేరుతో కొందరు రౌడీలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల వద్ద నానాయాగీ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ఇళ్ల మధ్యలో మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో పాటు రాళ్లు వేస్తున్నారని, తలుపులు కొట్టి బెదిరిస్తుండటంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా అమృత బెదిరించిందని స్థానికులు ఆరోపించారు. ‘‘మీరు ఎక్కడికెళ్లినా నాకేమీ కాదు. నాకు దామచర్ల జనార్దన్ సపోర్ట్ ఉంది’’ అంటూ పాలేటి అమృత బహిరంగంగా బెదిరిస్తోందని చెప్పారు. ‘కుక్క జోలికెళ్లి చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకని వదిలేశాం’ అంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు అమృత వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్పీగారూ మీరే కాపాడాలి.. చెరువుకొమ్ముపాలెం కాలనీ వాసుల మొర ‘ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అమృత అనే మహిళ తమ వద్ద నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని చూపింది. గతంలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. మళ్లీ రూ.50 వేలు డబ్బు ఇవ్వాలంటూ రౌడీలను పంపించి బెదిరిస్తోంది. రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇళ్ల వద్దకు రౌడీలు వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రశి్నస్తే దాడి చేస్తున్నారు. మంగళవారం తాలూకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అమృత బారి నుంచి మాకు రక్షణ కలి్పంచండి’ అని కాలనీ వాసులు బుధవారం ఎస్పీని వేడుకున్నారు. -
గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా
సాక్షి, ఒంగోలు: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చాటుమాటు పనులు అన్న చందంగా ఉంది తెలుగు తమ్ముళ్ల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెగబడిన టీడీపీ నాయకులు.. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా దందాకు తెరలేపారు. ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గంజాయి, గుట్కా వ్యాపారం చేస్తూ మాఫియాగా మారాడు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన శ్రీమన్నారాయణ తల్లి మస్తానమ్మ ప్రస్తుతం ఒంగోలు 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా టీడీపీలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి గంజాయి, గుట్కాల వ్యాపారం చేస్తూ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా గంజాయి, గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు శ్రీమన్నారాయణ అత్యంత సన్నిహితుడు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంజాయి, గుట్కా వ్యాపారం జోరుగా సాగించాడు. మాజీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కూడా అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చాడు. యువతకు ఉపాధి కోసం టీడీపీ ధర్నాలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న శ్రీమన్నారాయణ (ఫైల్) గుడ్లూరు పోలీసులకు గంజాయితో పట్టుబడి గుడ్లూరు పోలీసులకు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గత ఏడాది గంజాయితో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ 25వ తేదీన గుడ్లూరు పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి కారులో గంజాయితో వస్తూ దీనిని గమనించిన గుట్లాపల్లి శ్రీమన్నాయణ బృందం కారును తిరిగి కావలి వైపునకు తిప్పడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అప్పట్లో వారి వద్ద కారులో 10 కేజీల గంజాయి దొరికింది. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీమన్నారాయణతో పాటు తెట్టుకు చెందిన తిరుమలరాజు వెంకటేశ్వరరాజు, ఏకొల్లు కృష్ణార్జున రావు, బెంగళూరుకు చెందిన శంకర్ మోహన్, ప్రధాన నిందితుడు శ్రీమన్నారాయణ కారు డ్రైవర్ రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు) ) గుట్కా ప్యాకెట్లతో నిందితులు శ్రీమన్నారాయణ, కారు డ్రైవర్ ఒంగోలులో గుట్కాల నిల్వలతో... ఒంగోలు నగరంలో కారులో గుట్కాలు తరలిస్తున్నట్లు ఎస్పీ మలికాగర్గ్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రారావు తన సిబ్బందితో దాడి చేసి కారును పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న ముల్లూరి వెంకట నాగ శివ చరణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 27,375 గుట్కాప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ అక్రమ వ్యాపారం బయటపడింది. ఒంగోలు నగరంలోని బృందావన్ నగర్ 11 వ లైన్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల గుట్టు రట్టయింది. ఆ ఇంట్లో 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ఇల్లు 46వ డివిజన్ టీడీపీకి చెందిన కార్పొరేటర్ గుట్లాపల్లి మస్తానమ్మ, కుమారుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణది అని తేలింది. మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ రూ.3,43,224 గా ఎస్ఈబీ పోలీసులు తేల్చారు. ఇలా గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. -
కంచే చేను మేసింది
సాక్షి, ఒంగోలు టౌన్: పోలీసు కాలనీలో పార్కు కబ్జాకు గురైంది. పోలీసు కాలనీలో పార్కు కబ్జా చేసే ధైర్యం ఎవరికి ఉందా అనే కదా అనుమానం. పోలీసు పార్కును కబ్జాచేసే ధైర్యం పోలీసులకే ఉంటుంది. కొంతమంది పోలీసులు దీనిని అక్షరాలా నిజం చేశారు. పోలీసు పవర్‌ను ఉపయోగించి పార్కు స్థలానికి నకిలీ పత్రాలు పుట్టించారు. అంతటితో ఆగకుండా క్రయవిక్రయాలు కూడా జరిపించేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే వారికి వత్తాసు పలకడంతో పోలీసు చక్రం తిప్పేశారు. ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువైన పార్కు స్థలాన్ని యథేచ్ఛగా విక్రయించి తమను ఎవరూ అడ్డుకోలేరంటూ పరోక్ష సంకేతాలు పంపారు. ఇదేదో జిల్లా మారుమూల ప్రాంతంలో జరిగిందనుకుంటే పొరబడినట్టే. ఈ ఘటన సాక్షాత్తు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది. కన్ను పడింది కబ్జా చేశారు.. ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీరాం కాలనీలో పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద 1975వ సంవత్సరంలో 13.45 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారు. 1280 రూపాయల చొప్పున ఒక్కో ప్లాటును సొసైటీలోని సభ్యులైన పోలీసులు కొనుగోలు చేశారు. అందులో 4 2సెంట్ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. పోలీసు కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కింద ప్లాట్లు కొనుగోలు చేసినవారు నిదానంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పోలీసు శాఖకు చెందిన కొంతమంది కన్ను పార్కు కోసం విడిచి పెట్టిన స్థలంపై కన్ను పడింది. పోలీస్.. మాకు అడ్డేముందంటూ పార్కు కోసం కేటాయిచిన స్థలాన్ని కబ్జా చేసేశారు. పార్కు స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను పుట్టించి అడ్డగోలుగా విక్రయించేశారు. 42 సెంట్లలో సగానికిపైగా అక్రమ కట్టడాలు ఉన్నాయి. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్, తాలూకా పోలీసు స్టేషన్‌లోని ఒక ఏఎస్ఐ కబ్జా బాగోతాన్ని నడిపించారు. దీనంతటిలో ఒక డివిజనల్ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రిటైర్డు హెడ్ కానిస్టేబుల్ ఒక సొసైటీని పుట్టించి తాను దానికి ప్రెసిడెంట్‌నంటూ హవా కొనసాగించాడు. అంతేగాకుండా పార్కు స్థలంలో 11 మంది పేర్లు పుట్టించి, వారిలో నలుగురిచేత స్టేటస్ కో కూడా తెప్పించుకునేలా చక్రం తిప్పారు. వత్తాసు పలికిన తాజా మాజీ ఎమ్మెల్యే.. పోలీసు పార్కు స్థలం అన్యాక్రాంతమైన సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే అక్రమార్కులకు వత్తాసు పలికారు. పది మందికి ఉపయోగపడే పార్కు అన్యాక్రాంతమైన విషయాన్ని అప్పటి ఎమ్మెల్యేగా వ్యవహరించిన దామచర్ల జనార్ధనరావు దృష్టికి తీసుకువెళితే ఆయన లైట్‌గా తీసుకోవడం కూడా అక్రమార్కులకు ఊతమిచ్చినట్లయిందని సొసైటీ సభ్యులు వాపోయారు. ఎక్కడైనా చిన్న స్థలం కబ్జాకు గురైతే ఆగమేఘాలమీద స్పందించి యంత్రాంగం రూ.8 కోట్లపైగా విలువైన స్థలం కబ్జాకు గురైతే సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడం చూస్తుంటే నాటి అధికారపార్టీ ఏ స్థాయిలో వారికి అనుకూలంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీరాం కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుడు తమ ప్రాంతంలో అన్యాక్రాంతమైన పార్కు విషయమై తాజా మాజీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకువస్తే ‘పోలీసుల విషయంలో జోక్యం ఎందుకంటూ’ హెచ్చరించడంతో ఆ పార్టీ డివిజన్ నాయకుడు విస్తుపోయాడు. రెండేళ్ల క్రితం తాలూకా పోలీసు స్టేషన్లో స్థానికంగా ఉండే రిటైర్డు పోలీసు ఫిర్యాదు చేస్తే దామచర్ల ఒత్తిడితో దానిని ఫాల్స్ కేస్‌గా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. పార్కు గేట్లతో ఆక్రమణ వెలుగులోకి.. పోలీసు హౌసింగ్ సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పార్కు కోసం 42 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నగర పాలక చుట్టూ ప్రహరీ నిర్మించి పార్కు గేట్లను వేసే సమయంలో ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించే సమయంలో ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. పార్కు గేట్లు పెట్టే సమయంలో పార్కు వాస్తవ చిత్రం వెలుగులోకి వచ్చింది. అప్పటికే పార్కును ఆక్రమించుకున్నవారు మరొకరికి, అక్కడ నుంచి మరొకరికి విక్రయించడం జరిగింది. వాస్తవానికి పోలీసు పార్కు అభివృద్ధికి నగర పాలక సంస్థ 9 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నిర్మాణ పనుల్లో భాగంగా గేట్లు ఏర్పాటు చేసే సమయంలో ఆక్రమణలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ సగానికిపైగా కుచించుకుపోయింది. పోలీసు బాస్‌ను పక్కదోవ పట్టించి.. పార్కు విషయంలో ఆక్రమణలకు ఆజ్యం పోసిన ఒక వర్గం పోలీసులు జిల్లా పోలీసు బాస్‌ను సైతం పక్కదోవ పట్టించడం గమనార్హం. పోలీసు హౌసింగ్ సొసైటీకి సంంధించి మామిడిపాలెంలోని సర్వే నంబర్ 122/10లో గత కొంతకాలంగా వివాదం నడుస్తూ పోలీసు శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ఆ స్థల వివాదం సమసిపోయింది. అదే సమయంలో శ్రీరాంకాలనీలోని పోలీసు సొసైటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 42 సెంట్లు పార్కు కోసం కేటాయించుకున్నారు. ఈ పార్కులో సగానికిపైగా ఆక్రమించుకున్న ఆక్రమణదారులు జిల్లా పోలీసు బాస్ వద్దకు ఈ పంచాయతీ వచ్చిన సమయంలో, శ్రీకారం కాలనీని కాకుండా మామిడిపాలెంలోని స్థల విషయాన్ని తెలియజేసి వివాదం సద్దుమణిగినట్లుగా జిల్లా పోలీసు బాస్‌నే ట్రాక్ తప్పించారు. పార్కు స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. పార్కు ఆక్రమణలకు గురైన విషయాన్ని పోలీసు అధిఆరులను కలిసి నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో అక్కడి పరిస్థితులను చూసి పార్కు ఏ స్థాయిలో ఆక్రమణలకు గురైందో నివేదిక అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఏసీపీని ఆశ్రయించారు. ఈ నేపథ్యం ఏసీపీ గురువారం ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి లే అవుట్‌ను కూడా గమనించారు. ఇందుకు సంబంధించిన నివేదికను నగర పాలక సంస్థ కమిషనర్‌కు అందించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుంటారని, స్థానికుల అవసరాల కోసం లేఅవుట్ ప్రకారం పార్కు ఉండేలా చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
బరితెగించిన దామచర్ల
సాక్షి, ఒంగోలు సిటీ: టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ బరితెగించారు. గురువారం ఉదయం ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాత్రివేళ పోలింగ్ సమయం మించిపోయినప్పటికీ ఓటర్లను అనుమతించాలంటూ పోలింగ్ అధికారులపై రుబాబు చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో గల అగ్జిలియం స్కూలు వద్ద జరుగుతున్న ఈ విషయం గురించి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. దామచర్ల, అతని వర్గీయులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులను కూడా దామచర్ల తనవైపు తిప్పుకోవడంతో డీఎస్పీలు రాధేష్ మురళి, శ్రీనివాసాచారి అత్యుత్సాహం ప్రదర్శించారు. దామచర్లకు దాసోహమై వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారు. టీడీపీ నాయకులను మాత్రం బుజ్జగిస్తూ పక్కకు పంపి తీవ్ర విమర్శల పాలయ్యారు. దామచర్ల, టీడీపీ నాయకులతో పాటు డీఎస్పీల తీరుతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది. అసలేం జరిగిందంటే... ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో అగ్జిలియం స్కూలు ఉంది. ఇక్కడ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తన అనుచరుల ద్వారా ఆ సమీపంలోని ముస్లింలను ప్రలోభాలకు గురిచేశారు. బుధవారం రాత్రి వీలు కాకపోవడంతో డబ్బు పంచలేకపోయామని, ఇప్పుడు డబ్బులిస్తామని, వెళ్లి టీడీపీకి ఓటేయాలని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా అగ్జిలియంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఒక బూత్‌లో టీడీపీ ఏజెంటు లేడని, పోలింగ్ ఆపాలని అధికారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బెదిరిపోయిన పీవో పోలింగ్ ఆపారు. అక్కడే తిష్టవేసి ఇష్టారాజ్యంగా దామచర్ల వ్యవహరించడంతో సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ నాయకులు కాకుమాను రాజశేఖర్, శింగరాజు వెంకట్రావు, ధూళిపూడి ప్రసాద్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో దామచర్ల పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీలు రాథేల్‌మురళి, శ్రీనివాసాచారిలు అక్కడికి చేరుకున్నారు. బాలినేని, దామచర్ల, వారి వర్గీయులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దామచర్ల, అతని వర్గీయులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, పోలింగ్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఇక్కడి నుంచి వారు వెళ్తేనే తాము కూడా వెళ్తామని బాలినేని, అతని అనుచరులు స్పష్టం చేశారు. పోలీసుల ఒత్తిడితో ఇద్దరు నాయకులతో పాటు వారి అనుచరులు బయటకు వచ్చి వాహనాలు తీశారు. అయితే, దామచర్ల, అతని అనుచరులు వారి వాహనాలను బాలినేని వాహనాలకు అడ్డంగా ఉంచి పక్కకు తీసే అవకాశం ఉన్నా తీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే లాఠీచార్జి... బాలినేని, దామచర్ల, వారి వర్గీయులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో డీఎస్పీలు, పోలీసులు లాఠీచార్జికి దిగారు. సమస్య వచ్చింది దామచర్ల కారణంగా అని, వారిని ముందుగా పంపించాలని బాలినేని వారిస్తున్నా వినిపించుకోకుండా వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే పోలీసులు లాఠీలతో దాడి చేశారు. తీవ్ర అసభ్యకర పదజాలంతో మహిళలపై సైతం విరుచుకుపడ్డారు. గొడవ ముదురుతుందని భావించిన దామచర్ల, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రివేళ మళ్లీ ఉద్రిక్తత... గురువారం రాత్రి స్థానిక వెంకటేశ్వరకాలనీలో దామచర్ల జనార్దన్ సోదరుడు సత్య పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. ఓటర్లకు డబ్బులిస్తున్నట్లుగా బాలినేనికి సమాచారం అందడంతో తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ సత్య అనుచరులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో సత్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ అగ్జిలియం వద్ద దామచర్ల జనార్దన్ పీవోతో గొడవ పడుతున్నారని సమాచారం అందడంతో బాలినేని వెంటనే అక్కడికి వెళ్లారు. పోలింగ్‌కు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లను అనుమతించాలని పీవోపై దామచర్ల ఒత్తిడి చేస్తున్నారు. సమయంలోగా స్లిప్పులు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తామని పీవో తెలిపారు. ఆ సమయంలో బాలినేని వెళ్లడంతో ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. రాత్రి పోలింగ్ అయ్యేంత వరకు అగ్జిలియం వద్దనే రెండువర్గాలు తిష్టవేశాయి. పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఉద్రిక్తత మధ్యే పోలింగ్ జరిగింది. -
ఒంగోలులో టీడీపీ అరాచకం
సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు అగ్జిలీయం పాఠశాలలోని పోలింగ్ బూత్‌ల్లో తెలుగుదేశం ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్‌లో కూర్చుని పోలింగ్ ఆపించారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని పోలింగి తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. గోరంట్ల కాంప్లెక్సు వద్ద బాలినేని వాహనాలు, దామచర్ల వాహనాలు ఎదురయ్యాయి. అక్కడ వారి అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు ప్రసాద్‌పై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై గొడవ జరిగింది. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామచర్లను అక్కడి నుంచి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గొడవకు దిగకుండా బాలినేని వారిని నియంత్రించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు ఏబీఎం కళాశాల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. డీఎస్పీ అక్కడికి చేరుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు గుమిగూడారు. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. బాలినేని డీఎస్పీతో మాట్లాడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను విడిపించారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ అనుచరులు కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలకు దిగారు. వారికి ఉన్న పోలీసు పలుకుబడిని ఉపయోగించి కార్యకర్తలపై కేసులు పెట్టించారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. బాలినేని, కాకుమాని రాజశేఖర్ వంటి నాయకులు టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారు. అగ్జిలియం, ఏబీఎం వద్ద జరిగిన సంఘటనలు కొద్దిపాటి ఉద్రిక్తలకు దారి తీశాయి. టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఓపీఎస్ పోలింగ్ బూత్ వద్ద కొందరు టీడీపీ మహిళలు వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకొనే పనిలో పడ్డారు. దీన్ని అక్కడున్న నాయకులు భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఓపీఎస్ వద్దకు చేరుకున్నారు. -
పిలిస్తే పలికే వాసన్న.. ఎదురైనా పట్టించుకోని దామచర్ల
సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర రాజకీయాలకు ఒంగోలు కేంద్ర బిందువు. ఇక్కడి ఫలితాలు పార్టీల భవితవ్యాలను తేల్చుతాయన్నది ఒక విశ్వాసం. గతంలో జరిగిన పరిణామాలు.. వివిధ సందర్భాలు దీనిని బలపరుస్తున్నాయి. ఇంత ప్రాధాన్యం గల ఒంగోలు అసెంబ్లీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ పోటీలో ఉన్నారు. నాలుగు పర్యాయాలు బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఐదేళ్లే దామచర్ల శాసనసభ్యునిగా పని చేశారు. రాజకీయాల్లో సీనియర్‌గా అనుభవజ్ఞునిగా బాలినేనికి మంచి పేరుంది. గత ఎన్నికల్లో దామచర్లకు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినా ప్రజారంజకంగా పాలన చేయలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అభ్యర్థుల గుణగణాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ♦ సౌమ్యుడు..మితభాషి. ♦ చిన్నవారినైనా..ఎంతటి వారినైనా ఒకే విధంగా గౌరవిస్తారు. ♦ నిత్యం చిరునవ్వు ఆయన పెదవిపైనే ఉంటుంది. కల్మషం లేని వ్యక్తి ♦ తనకు హాని చేసిన వారినైనా పెద్దమనసుతో క్షమిస్తారు. ♦ ఎంత కష్టం వచ్చినా నమ్మిన వారి కోసం నిలబడే వ్యక్తిత్వం ♦ అనారోగ్యం, కుటుంబ సమస్యలున్నాయంటే తన జేబులో ఎంత ఉన్నా ఇచ్చే దానగుణం ♦ దైవాన్ని అధికంగా నమ్ముతారు. అంతకన్నా ఎక్కువగా అభిమానులకు బాసటగా నిలుస్తారు. ♦ వాసన్న అంటే ఇట్టే పలికే గుణం ఆయన సొంతం అభిమానుల అభిమతం ఇది. ♦ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ♦ అవినీతి రహితుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రజల నుంచి మన్ననలు ♦ జిల్లాలోని సమస్యలపై సంపూర్ణ అవగాహన దామచర్ల జనార్దన్ ♦ గర్విష్టి, రాచరిక పాలన సాగిస్తారన్న విమర్శ ♦ మనస్సులో ఒకటి పెట్టుకొని వేరొకటి మాట్లాడుతుంటారు. ♦ ఆయన మాటల్లో అర్థాలు నిగూఢంగా ఉంటాయి. ♦ ఖర్చు పెట్టే ప్రతి పైసా తిరిగి వసూలు చేయడం ఆయన నైజం. ♦ తను, తనవారన్న స్వార్థం ♦ దామచర్ల అందించే సహాయం రాజకీయ నాయకులు అందించే తరహాలోనే ఉంటుందన్న విమర్శలు ♦ నియోజకవర్గం, జిల్లా ప్రజలు రైతులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన అంతంతమాత్రమే ♦ గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తారన్న అభియోగం ♦ ఎవరైనా, ఎంతటి వారైనా దామచర్ల ఇంటికి వస్తే వీధి గుమ్మం వద్దే చెప్పులు విడిచి రావాలి ♦ సామాన్యులకు అందుబాటులో ఉండరన్న విమర్శ ♦ ఐదేళ్ల పాలనలోనే ఎన్నో అవినీతి ఆరోపణలు ♦ సీనియర్ నేతలను గౌరవించరన్న అభియోగం ♦ తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ♦ తన స్వార్థం కోసం అధికారుల బలిచేస్తారన్న ప్రచారం -
ఏయ్ పోలీస్ ఖబడ్దార్
కొత్తపట్నం: ఎన్నికల ప్రచారంలో బాణసంచా కాల్చకూడదన్న పోలీసులపై అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. ఖబడ్దార్.. జాగ్రత్త అంటూ తీవ్ర పదజాలంతో రోడ్ షోలో మైక్ ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దనరావు ఆదివారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బస్టాండ్ సెంటర్లో రోడ్‌షో నిర్వహిస్తుండగా పార్టీ కార్యకర్తలు మందుగుండు సామగ్రి పేల్చడం మొదలు పెట్టారు. ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఎన్నికల నింబంధనల ప్రకారం మందుగుండు పేల్చకూడదని వారి నుంచి బాణసంచా తీసుకున్నారు. దీనిపై కార్యకర్తలు దామచర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన జనార్దన్ ‘ఏయ్ పోలీస్.. ఖబడ్దార్! మా వాళ్లు మందుగుండు పేల్చుతుంటే తీసుకుంటావా, నీ మీద ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. మేము చేస్తా ఉంటే చూడటమే మీ పని. నీ ఇష్టం జాగ్రత్తగా ఉండు’ అంటూ బహిరంగ సభలోనే మైక్ ద్వారా తీవ్ర స్వరంతో హెచ్చరించాడు.ఈ హఠాత్పరిణామంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది నిర్ఘాంతపోయారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రోడ్డుషోలో బాణసంచా భారీగా పేల్చారు. కాగా, ఇటీవల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్డుషో సందర్భంగా మందుగుండు సామగ్రి పేల్చుతుంటే.. పోలీసులు కార్యకర్తల చేతుల్లో నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు బాలినేనికి ఫిర్యాదు చేస్తే పోలీసులకు సహకరించాలని బాణాసంచా కాల్పులు నిలుపుదల చేయించారు. -
రూ.కోట్ల స్థలం..ధారాదత్తం
సాక్షి, ఒంగోలు అర్బన్: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాటి నగరపాలక కమిషనర్ వెంకటకృష్ణ కుమ్మక్కై కోట్ల విలువైన స్థలాన్ని తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు. నగరపాలక సంస్థకు చెందిన దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లో ఎటువంటి అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 షాపులు నిర్మించి ధారాదత్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం సదరు స్థలం రూ.3 కోట్లపైనే ఉంటుంది. ఆ కాంప్లెక్స్‌కు డీజే (దామచర్ల జనార్దన్) కాంప్లెక్స్ అని కూడా నామకరణం చేశారు. సదరు డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం అధికారులు, అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఒకరికి ఒకరు పొంతన లేని వివరణలు ఇవ్వడం విశేషం. అధికారుల తడబాటును చూస్తే కచ్చితంగా కూరగాయల మార్కెట్లోని డీజే కాంప్లెక్స్ అనధికారిక నిర్మాణం అని తేటతెల్లమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి నగరపాలక అధికారులు ఎంత నలిగిపోతున్నారో డీజే కాంప్లెక్స్‌పై వివరణలు చెప్పడంలో అర్థమవుతోంది. ఇంకా ఎవరికీ షాపులు కేటాయించలేదని ఒక అధికారి అంటుంటే మరొకరు వేలం వేసి కేటాయించామని అంటున్నారు. ఇంకొకరు మాకేం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆయన హయాంలో ఒక్క పేదవాడికి ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేని సుమారు 10 వేల పట్టాలు పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ఊరచెరువు సర్వే నంబర్ 14/1లోని 7 ఎకరాల స్థలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిర్మాణాలు చేసి అగ్రికల్చర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంది. 2007లో సదరు 7 ఎకరాలను నగరపాలక సంస్థ ఏఎంసీతో ఒప్పందాలు చేసుకుని స్వాధీన పరుచుకుంది. అప్పటి నుంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. మార్కెట్లో పడమర వైపు రిటైల్ కూరగాయల వ్యాపారం కోసం షాపులు కేటాయించగా, తూర్పు వైపు డిజైన్ ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ షాపులు కేటాయించారు. హోల్‌సేల్ షాపులకు దక్షిణం వైపున డిజైన్ ప్రకారం లోడ్‌తో వచ్చిన లారీలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే కన్ను ఆ స్థలంపై పడింది. అంతే వెంటనే నాటి ఓఎంసీ కమిషనర్‌కు హుకుం జారీ చేసి ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు షాపుల కేటాయించాలని వారే స్వయంగా నిర్మించుకుంటారని చెప్పడంతో వెంటనే షాపుల నిర్మాణం జరిగిపోయి డీజే కాంప్లెక్స్‌గా వెలిసింది. డీజే కాంప్లెక్స్ ఏర్పడేందుకు సహకరించిన కమిషనర్‌కు, దానికి ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యేకు దాదాపుగా రూ.10 లక్షలు ముట్టినట్లు సమాచారం. ముస్లింల నోరుకొట్టి.. అక్రమంగా నిర్మించి టీడీపీ కార్యకర్తలకు కేటాయించిన డీజే కాంప్లెక్స్‌కు పడమర వైపు కూతవేటు దూరంలో ఉన్న బండ్లమిట్టలో గత 30 ఏళ్లుగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న ముస్లింలకు చెందిన షెడ్లను స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్లు పోలీసు బందోబస్తుతో పొక్లయినర్లతో బలవంతంగా 2015లో తొలగించారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. కేవలం బాలినేని అభిమానులు కావడం వలనే 30 ఏళ్ల నాటి వ్యాపార కేంద్రాలను కూలదోశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లింల షాపుల తొలగింపుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మరీ.. 14/1 ఊరచెరువుకు సంబంధించి మొత్తం 77 ఎకరాల స్థలం ఉండగా దానిలో 7 ఎకరాల్లో దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఉంది. ఒక ప్రైవేటు వ్యక్తి స్థలానికి సంబంధించి నగరపాలక సంస్థతో వివాదం ఉండటంతో హైకోర్టును (రిట్ పిటిషన్ 7981/2012) ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు సదరు సర్వే నంబర్‌ను వాటర్ బాడీగా భావిస్తూ ఆ సర్వే నంబర్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే కోర్టు ధిక్కారం కింద వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులచే కాంప్లెక్స్ నిర్మాణం చేసి షాపులను కేటాయించారు. దానికి నాటి కమిషనర్ పూర్తిస్థాయిలో సహకరించి నగరపాలక ఆస్తులను ధారాదత్తం చేశారు. మొత్తం మీద టీడీపీ కార్యకర్తలకు షాపులు ఇచ్చినా బిజినెస్ బిజినెస్సే.. బావమరిది బావమరిదే అన్నట్లు లక్షల్లో వసూలు చేసుకున్నారు. దీనిపై వివరణ అడిగితే నగరపాలక అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నికలయ్యాక వేలం నిర్వహిస్తాం.. బాధ్యతలు స్వీకరించే సమయానికే కాంప్లెక్స్ ఉంది. అయితే ఆ షాపులు ఇంకా ఎవరికీ కేటాయించలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ నిలిపివేశాం. ఎన్నికల అనంతరం వేలం నిర్వహించి పద్ధతి ప్రకారం షాపుల కేటాయిస్తాం. – శకుంతల ప్రస్తుత కమిషనర్ మార్కెట్ లోపల నిర్మాణాలకు మాకు సంబంధం లేదు మార్కెట్ లోపల జరిగిన నిర్మాణాలకు, మాకు ఎటువంటి సంబంధంలేదు. ఏ విధంగా కేటాయించారు, ఎలా నిర్మించారనే వివరాలు మాకు తెలియవు. ఆ కాంప్లెక్స్‌కు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు పై అధికారుల నుంచి రాలేదు. కమిషనర్ ద్వారా వివరాలు తీసుకోండి. – కె.వెంకటేశ్వర్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ కౌన్సిల్ తీర్మానం అయింది కలెక్టర్ ఉత్తర్వులు రావాలి డీజే కాంప్లెక్స్‌లోని షాపులకు వేలం నిర్వహించాం. దానికి సంబంధించిన తీర్మానం కూడా చేశాం. అయితే ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ నుంచి అప్రూవల్ రావాలి. షాపునకు వెయ్యి రూపాయల లెక్కన వేలం నిర్వహిస్తే రూ.1200, రూ.1300 లెక్కన పాట జరిగింది. – శంకర్(ఆర్ఓ) రెవెన్యూ అధికారి వివరాలు ఆర్ఓని అడగాలి డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఎటువంటి పన్నులు లేవు. కేవలం లీజు మాత్రమే ఉంటుంది. అయినా పూర్తి వివరాలు రెవెన్యూ అధికారిని అడగాలి. – బ్రహ్మయ్య అసిస్టెంట్ కమిషనర్ -
ఒం‘గోలు’ కొట్టేవారెవరో ?
సాక్షి, ఒంగోలు : ఇదరూ ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర తిరగ రాయడంతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి«గా బరిలో ఉండగా..గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోసారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అజాతశత్రువు, మంచి వ్యక్తిగా గుర్తింపుపొందిన బాలినేని విజయమే లక్ష్యంగా గడప గడపకు వెళ్తున్నారు. నవరత్నాలను వివరించి వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత ప్రయోజనాల కోసమే ఐదేళ్లు పాకులాడిన జనార్దన్‌కు ఇంటి పోరు తప్పడం లేదు. మురికి వాడలను పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బాలినేనికే విజయావకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలుత ద్విసభ్యుల నియామకం ఉండేది. ఈ నియోజకవర్గానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. 1952, 1955లో ద్విసభ్యుల నియామకం జరిగింది. 1957 నుంచి అసెంబ్లీకి ఒకే అభ్యర్థి ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో కొంతభాగం, నాగులుప్పలపాడు మండలంలోని కొంత భాగం ఉండేవి. 2009 పునర్విభజన సమయంలో ఒంగోలు నగరం, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలం మొత్తం కలిపి నియోజకవర్గంగా అవతరించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. తొలుత 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావ్పై తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2004 , 2009, 2012లలో వరుసగా విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌రావుపై ఏకంగా 27,403 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. భళా..బాలినేని సౌమ్యుడు, మంచి వ్యక్తిగా పేరుపొందారు. ఎవ్వరైనా సరే నేరుగా ఆయన వద్దకే వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. నమ్మినవారి కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేశారు. జిల్లాలోని పేదలకు వైద్యం అందించేందుకు రిమ్స్ వైద్యశాలను మంజూరు చేయించి నిర్మించారు. వేలాది మంది పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు నివాస గృహాలను నిర్మించి ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, మంత్రిగా పనిచేసినా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ప్రజల గుర్తింపు పొందారు. జనం వద్దకు వెళ్లని జనార్దన్ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల జనార్దన్‌రావు గెలిచిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయనే భావన ప్రజానీకంలో వ్యక్తం అవుతుంది. కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారన్న విమర్శలూ వచ్చాయి. కొందరు అనుచరులకే కాంట్రాక్టు పనులు కట్టబెట్టడంతో మిగిలిన టీడీపీ కేడర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారింది. నగరంలో కొన్ని ప్రధాన ప్రాంతాలకే రోడ్డు, డ్రైనేజీలాంటి పనులు మంజూరు చేయించి అధికంగా ఉన్న మురికి వాడలను పట్టించుకోదు. మురికి వాడల్లో వసతుల కల్పన గాలికొదిలేశారు. రోడ్లు, తాగునీరు అందని పరిస్థితి. కక్ష సాధింపుకు దిగే వ్యక్తిగా జనార్దన్‌కు పేరుంది. ఇటీవల కమ్మపాలెంలో జరిగిన ఘటనతో గొడవలు సృష్టించే సంస్కృతి ఉన్న నాయకుడుగా నిలిచారు. ఈ పరిస్థితులలో స్థానికేతరుడు అయిన జనార్దన్ ఓ వైపు, నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్న బాలినేని మరో వైపు పోటీలో ఉన్నారు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,29,317 పురుషులు : 1,11,183 మహిళలు : 1,18,101 ఇతరులు : 33 -
రహదారా.. మీ జాగీరా..!
సాక్షి, ఒంగోలు సబర్బన్: అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా వ్యవహరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారం నిబంధనలు ఉల్లంఘించి మరీ చేపట్టారు. ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ సమీపంలో నీలాయపాలెం సెంటర్ వద్ద పార్టీ కార్యకర్తలు దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై భారీ స్క్రీన్ పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ప్రజలను ఆకట్టుకోవటానికి భారీ స్థాయిలో పాట కచేరి నిర్వహించారు. రోడ్డు మీదనే స్టేజీ ఏర్పాటు చేయటంతో నిత్యం రద్దీగా ఉండే ట్రంకు రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ షాపుల యజమానులు వ్యాపారాలు జరగక అసహనానికి లోనయ్యారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు రోడ్డు మీదనే కార్యక్రమం ఏర్పాటు చేయటంతో ప్రజల అవస్థలు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే స్టేజీ మీద ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ మీద ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గంలో దామచర్ల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించి మరీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు, ఎమ్మెల్యే జనార్ధన్ ఫొటోలు, టీడీపీ జెండాలు, దామచర్ల బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు, ప్రసంగాలు ఇలా చాలానే ప్రచారం చేశారు. పోలవరం నిర్మాణ పనులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు గురించి కూడా వీడియోలతో కూడిన ప్రచారాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి పొద్దుపోయే వరకు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కల్పించటంతో పాటు ఎన్నికల నిబంధనలను నిలువునా ఉల్లంఘించారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి మరీ కార్యక్రమాన్ని కొనసాగేలా సహకరించారు. రాత్రి గం.9.52కు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేదిక దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆ తరువాత సమయం అయిపోయిందంటూ పోలీసులు వచ్చి ఆపడంతో కార్యక్రమాన్ని ముగించారు. రోడ్డు మీద వేదిక నిర్వహణకు, మైక్ పర్మిషన్ ఇచ్చినట్లు పోలీసు అధికారులే అంగీకరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా రోడ్డు మీదనే ఏర్పాటు చేసినా పట్టించుకోలేదంటే పోలీసులు అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. -
ఎవడబ్బ సొమ్మని మీ వాళ్లకే ప్లాట్లు ఇప్పిస్తారు?
సాక్షి, ఒంగోలు టౌన్: ‘గతంలో జరిగిన ఎన్నికల్లో మేమంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఐదేళ్లపాటు మమ్మల్ని పట్టించుకోలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా పేదలమైన మాకు రాకుండా చేశాడు. ఎవడబ్బ సొమ్మని మీ పార్టీ వాళ్లకే ఇప్పిస్తారు. మేము మనుషులం కాదా? మీకు ఓట్లు వేసి గెలిపించలేదా? మమ్మల్ని ఇంత దారుణంగా మోసగిస్తారా? అంటూ ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌రావు తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని ప్రజలకు జీ ప్లస్ త్రీ కింద ఇళ్లు నిర్మిస్తామంటూ లబ్ధిదారుల నుంచి నగర పాలక సంస్థ డీడీల రూపంలో డబ్బులు కట్టించుకొంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దామచర్ల జనార్ధన్‌రావు హడావుడిగా ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అయితే ఎక్కువ శాతం ప్లాట్లు తెలుగుదేశం పార్టీ అనుయాయులకే దక్కాయి. లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు తీసుకొని తమ పార్టీకి అనుకూలమైన వారికే ప్లాట్లు వచ్చేలా చేశారు. అయితే దీనికి మాత్రం ప్రజల సమక్షంలో లాటరీ వేసి ప్లాట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. 14,656 ప్లాట్లకు సంబంధించి రూ.500, రూ.12,500, రూ.25 వేల చొప్పున లబ్ధిదారులను ఎంపికచేసి వారి నుంచి వాటా ధనాన్ని కట్టించుకున్నారు. అయితే స్థల సమస్యను సాకుగా చూపించి కేవలం 4512 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆ 4512 మంది లబ్ధిదారులను ప్రకటించలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు లబ్ధిదారులచే పడిగాపులు కాయించారు. నాలుగు రోజులు గడిచేసరికి ఎన్నికల కోడ్ వచ్చి పడింది. ఆ సమయానికే అధికారపార్టీ నాయకులు సూచించిన వారికే ఎక్కువ భాగం ఇళ్ల ప్లాట్లను కేటాయించేశారు. ఆదివారం ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారుల ప్లాట్ల కేటాయింపుపై నగర పాలక సంస్థ అధికారులు వివరణ ఇవ్వలేదు. దాంతో అంతకు ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో బుధవారం రావాలని చెప్పారు. దాంతో బుధవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు చేరుకున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ చాంబర్ నుంచి బయట ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం వరకు భారీ క్యూ నిలబడింది. అవాక్కైన కమిషనర్ ఉదయం తన చాంబర్‌కు చేరుకున్న కమిషనర్ శకుంతల ఆ జనాన్ని చూసి అవాక్కయ్యారు. ఎందుకు ఇంతమంది వచ్చారని తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే లబ్ధిదారుల్లో సహనం కోల్పోయి ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉండటంతో వారిని నియంత్రించలేక పోవడంతో చివరకు పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చిన తర్వాత నగర పాలక సంస్థ కమిషనర్ చాంబర్ పక్కన ఉన్న టెడ్కో విభాగం నుంచి బలవంతంగా బయటకు పంపించడంతో అప్పటి వరకు కొంతమేర శాంతంగా ఉన్న లబ్ధిదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. వెనుదిరిగిన కమిషనర్ దామచర్ల జనార్ధన్‌రావు తన పార్టీ వారికే ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేశారంటూ బాధితులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తాము మనుషులం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో వారిని శాంతింపచేసేందుకు కమిషనర్ శకుంతల వచ్చారు. డబ్బులు కట్టిన వారందరికీ ప్లాట్లు ఇస్తామని, కొంచెం సమయం పడుతోందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఏమీ చేయలేమంటూ చెప్పడంతో లబ్ధిదారులు రగిలిపోయారు. కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దామచర్ల తమకు అన్యాయం చేశారంటూ పలువురు కన్నీటి పర్యంతమైనారు. లబ్ధిదారులంతా ఒకే గొంతుక వినిపించడంతో కమిషనర్ సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. నా భర్తను మసీదులో పెట్టారు నా భర్త మరణించడంతో అద్దె ఇంట్లో ఉంచనీయకపోవడంతో మసీదులో పెట్టారు. చివరిచూపు కూడా సరిగా చూసుకోనీయలేదు. అదే సొంత ఇల్లు ఉంటే ఇంటి వద్దనే కొంతసేపు ఉంచేవారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఓటు అయితే వేయించుకున్నారుగాని ఇళ్లు మాత్రం ఇవ్వలేదు. – షేక్ ఖాదర్‌బీ, కొండమిట్ట పార్టీ కార్యకర్తలకే ప్లాట్లు ఏడాది క్రితం ఇంటి కోసం డిపాజిట్ కట్టాను. అద్దె ఇళ్లల్లో బాడుగలు చెల్లించలేక ఎప్పుడు ఇళ్లు ఇస్తారా అని ఎదురు చూశాను. ప్లాట్ల కేటా యింపు లాటరీకి ప్రతిరోజూ ఇక్కడకు వచ్చాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నప్పటికీ ప్లాటు రాలేదు. టీడీపీ కార్యకర్తలకే ప్లాట్లు కేటాయించారు. – గొల్లా పావని, సత్యనారాయణపురం నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను వేసుకొని తిరుగుతున్నా నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను చంకేసుకొని తిరుగున్నాను. నా పేరు పిలుస్తారని ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశాను. కొంతమందికే ప్లాట్లు ఇచ్చారు. నా పేరు రాలేదు. మూడు రోజులు పసిబిడ్డతో ఆటోలో వచ్చాను. నాలుగోరోజు డబ్బులు లేక అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చా. – ఎం మల్లీశ్వరి -
పార్టీ మారడం పునరాలోచించుకో
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో అధికార తెలుగుదేశంలో వేడి మొదలైంది. ముఖ్యమైన నేతలు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ఏం చేయాలో తెలియని డోలాయమానంలో పడింది. దీంతో అధిష్టానం జిల్లా అధ్యక్షుడు దామచర్లను రంగంలోకి దింపి సర్దుబాటు చర్యలు ప్రారంభించినా.. ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు. ఒంగోలు సబర్బన్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రచారం కాస్త జోరందుకుంది. అదే విధంగా జిల్లా మంత్రి శిద్దా రాఘవరావును దర్శి అసెంబ్లీకి కాకుండా ఒంగోలు పార్లమెంట్‌కు నిలబడాలని పార్టీ అధిష్టానం వత్తిడి తీసుకువస్తోంది. దీన్ని దర్శిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు అంశాలపై అధికార టీడీపీలో పెద్ద దుమారమే రేగింది. ఈ సమాచారాన్ని ఇంటిలిజెన్స్ నిఘా ద్వారా పసిగట్టిన టీడీపీ అధిష్టానం జిల్లాలోని పరిస్థితులపై దృష్టి సారించింది. ఈ రెండు వ్యవహారాలను తక్షణమే సర్దుకునే చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను పురమాయించింది. దీంతో దామచర్ల రంగంలోకి దిగి ఇరువురు నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు. శిద్దా, మాగుంటతో మంతనాలు.. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్‌కు వద్దని, దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేలా పార్టీ అధిష్టానం తన మనసు మార్చుకోవాలంటూ దర్శి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలు నగరానికి చేరుకున్నారు. పార్లమెంట్‌కు నిలబడేందుకు అంగీకరించవద్దని శిద్దాపై వత్తిడి చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి చేరుకొని కొంతసేపు చర్చలు జరిపారు. నాయకులు, కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయాలని చూశారు. అంతకు ముందు రామ్‌నగర్ రెండో లైన్లో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసానికి దామచర్ల జనార్దన్ చేరుకున్నారు. తొలుత మాగుంటతో ఏకాంతంగా చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ మారే ఆలోచనను పునరాలోచించుకోవాలంటే బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం దామచర్లతో పాటు బయటకు వచ్చిన మాగుంట మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలో బయటపెడతానని వెల్ల్లడించారు. సన్నిహితులతో, అభిమానులతో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, సంయమనం పాటించాలని హితవు పలికారు. -
మేం చేసిందే శాసనం.. వేసిందే శిలాఫలకం
సాక్షి, ఒంగోలు సిటీ: హవ్వ..నవ్విపోదురు..నాకేంటీ. ఇదీ టీడీపీ నేతల వరస. మేం రారాజులం అనుకుంటున్నారు. అధికారం మాదే. మేం చెప్పిందే అధికారులు వింటారు. ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. అడిగే వారు ఎక్కడున్నారనుకుంటున్నారు. ఇక ఇష్టారాజ్యంగా ఎలాంటి పని చేసినా కొందరు అధికారులు వంత పాడుతున్నారు. తాజాగా ఒంగోలు నియోజకవర్గంలోని కరవది–గుండాయపాలెం రోడ్డు అభివృద్ధి పని కేటాయింపులో అడ్డగోలు వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. ఇంకా టెండర్ ఎవరికి ఇవ్వాలో తేలలేదు. గుత్తేదారుని వివరాలు లేవు. దస్త్రమేమో ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీరు వద్ద పెండింగ్‌లో ఉంది. అయినా రోడ్డు పనికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని వేశారు. ఇదేమి చోద్యమన్న విమర్శలు వస్తున్నాయి. ఇదీ నేపథ్యం.. ఒంగోలు నియోజకవర్గంలోని కరవది–గుండాయపాలెం మార్గంలో దెబ్బతిన్న రోడ్డును అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ ప్లాను కింద నిధుల కేటాయింపు జరిగింది. 0/0 కిమీ నుంచి 13.200 కిమీ పొడవున రోడ్డు అభివృద్ధి పనులకు డిజైన్ చేశారు. ఈ పనికి రూ.18 కోట్లు అంచనా వేసి, గత ఏడాది అక్టోబర్‌లో ఈ పనికి టెండర్ పిలిచారు. ఇందులో ఎక్కువ భాగం మట్టి పని ఉన్నందున కాంట్రాక్టర్‌కు మంచి లాభం వస్తుంది. పై పెచ్చు అంచనాలు కూడా అధికంగా చూపించారు. దీంతో గుత్తేదారులు పని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. టీడీపీ నాయకుల నుంచి ఈ పని మాకు కావాలంటూ చెప్పకుండా టెండర్లు వేయవద్దని హుకుం ఉన్నా దానిని లెక్క చేయకుండా కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. తీరా టెండర్లు తెరిచే సమయానికి ముగ్గురు బరిలో మిగిలారు. ఇందులో ఆరికట్ల వెంకటేశ్వర్లతోపాటు మరో ఇద్దరు మాధవి ఇంజినీరింగ్, మిత్ర ఇంజినీరింగ్ కంపెనీలు ఈ పని కోసం టెండర్లు వేశాయి. ఇక్కడే అసలు మెలిక పడింది. ఏం తేలకుండానే శిలాఫలకం.. త్వరలోనే ఎన్నికల ప్రకటన జారీ అవుతుందన్న సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటూ తేలకుండానే టీడీపీ నేత శిలాఫలకాన్ని వేయించి రోడ్డు పనికి శంకుస్థాపన చేసినట్లుగా అన్పించుకున్నారు. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ పనిలో అధికారుల పాత్ర లేకపోలేదు. అదే గ్రామంలో మరో పని కరవది– కొప్పోలు రోడ్డు పని ఉంది. ఈ పని సుమారు రూ.4.7 కోట్లతో చేయాల్సి ఉంది. ఈ పనిని మిత్ర ఇంజినీరింగ్ కంపెనీ వారు టెండర్ ద్వారా తీసుకున్నారు. కాంట్రాక్టర్ ఈ పనికి కుదిరారు కాబట్టి పని ప్రారంభానికి శంకు స్థాపన చేయడం నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకం కాదు. అసలు పని ఒప్పందం జరగకుండా, కాంట్రాక్టర్ ఎవరో తేలకుండా కరవది–గుండాయపాలెం రోడ్డు పనికి ఎలా శిలాఫలకం వేసి శంకుస్ధాపన చేస్తారని విమర్శలునెలకున్నాయి. ఇలాగైతే ఎవరు పడితే వారు.. ఎలాగైతే అలా నిబంధనలతో పని లేకుండా రూ.కోట్లు విలువైన పనులను తీసుకోవడం, పర్సంటేజీలను దండుకోవడం వంటి వ్యవహారాలను బహిరంగంగానే చేయడానికి ఈ తరహా పనులే వీలు కల్పిస్తున్నాయి కదా అన్న విమర్శలు నెలకొన్నాయి. దస్త్రం సీఈ వద్ద పెండింగ్‌లో.. కరవది–గుండాయపాలెం రోడ్డు పని టెండర్ వివాదంలో చిక్కుకుంది. మాధవి, మిత్ర ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీల మధ్య పోటీ నెలకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నేరుగా తాము అనుకున్న గుత్తేదారునికే పని ఇవ్వమని లేఖ రాశారు. ఈ లేఖపై ఆర్అండ్బీ మంత్రి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆర్అండ్బీ అధికారులు కాలాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు పట్టించుకుంటారనుకున్నారేమో హడావుడిగా శిలాఫలకం తయారు చేయించి శంకుస్థాపన చేశారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదం.. టీడీపీ నాయకులు మాత్రం కాంట్రాక్టర్లకు ఇప్పుడైనా మించిపోయింది లేదు. టెండర్లను వెనక్కి తీసుకోమని ఒత్తిడి తెచ్చినా వీరు మాత్రం తొణకకుండా వేసిన టెండర్‌ను కదిలించలేదు. అధికారులు ఇక సమయం మించిపోతుందని భావించి టెండర్లను తెరిచారు. ఇందులో ఆరికట్ల వెంకటేశ్వుర్ల టెండర్‌ను సాంకేతికంగా పలు కారణాలను చూపించి తొలగించారు. ఇక మిగిలిన మాధవి, మిత్ర కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లులో మాధవి ఇంజినీరింగ్ వారు 6.66 శాతం పని అంచనాల కన్నా తక్కువ ధరకు కోట్ చేశారు. మిత్ర ఇంజినీరింగ్ వారు 4.95 శాతం పని అంచనా విలువ కన్నా అధికంగా కోట్ చేశారు. వీరిద్దరి మధ్య టెండర్లో సుమారు రూ.2 కోట్లకుపైగా తేడా ఉంది. తక్కువ ధర వేసిన వారికి టెండర్ ఇస్తే ప్రభుత్వానికి రూ.2 కోట్లు డబ్బు మిగులుతుంది. అలా కాదని సిఫార్సుకు తలొంచి నేత చెప్పిన వారికే టెండర్ ఇస్తే ప్రజల డబ్బు రూ.2 కోట్లకుపైగా దుర్వినియోగం అవుతుంది. ఇదంతా తెర వెనుక జరగాల్సిన పంచాయితీ తెర బయటకు వచ్చేసింది. ఒకరికొకరు పోటీ పడడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. అధికారులు వ్యవహారంలో ఇరకాటంలో పడ్డారు. అధికార పార్టీ నేత మాత్రం అధికారులపై ఎలాగైనా ఈ పని చేసి మా గుత్తేదారునికే పని ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారన్న విమర్శలున్నాయి. అధికారుల అడ్డగోలుతనం ఆరికట్ల వెంకటేశ్వర్లు తన టెండర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించారంటూ ఎలా..ఏవిధంగా..ఏ అంశాలను చూపించి తొలగించారని, తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటీషన్ నెంబర్ 41601/2018కింద విచారణ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఆర్అండ్బీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారన్న విమర్శలు నెలకొన్నాయి. పని ఎవరైనా ఆదాయం చేకూర్చి పెట్టే వారికి ఇస్తారు. ఇక్కడ మాత్రం ఎక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికి టెండర్ ఇవ్వడానికి నేత ఒత్తిడికి తలొగ్గి వ్యవహరించారన్న విమర్శలు నెలకొన్నాయి. ఒక వైపు హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే మరో వైపు టెండరుపై చర్యలు తీసుకోవడం అడ్డగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) వారు కూడా ఇది తప్పని తిరస్కరించడం గమనార్హం. 94 జీవోను అనుసరించి 25.2 కండీషన్ ప్రకారం ఉన్న నిబంధనలను కూడా వీరు పాటించలేదని విమర్శలు ఉన్నాయి. ఎక్కువ మొత్తానికి కోట్ చేసిన గుత్తేదారుని వద్ద నుంచి వాలంటరీ రిబేటుకు ఒప్పందాన్ని తీసుకున్నారు. జీవోలో ఎక్కువ ధరకు కోట్ చేసిన వారి కన్నా తక్కువ ధర ఉన్న వారు ఉన్నప్పుడు ఎలాంటి సంప్రదింపులకు తావు లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా వీటిని తుంగలో తొక్కి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు ఆరికట్ల కోర్టు కేసు, మరో వైపు తక్కువ ధరకు టెండర్ వేసిన గుత్తేదారుని టెండర్ ఫోర్సులో ఉండగా ఎక్కువ మొత్తానికి కోట్ చేసిన గుత్తేదారునికి ఇవ్వమని సిఫార్సు చేయడం వెనుక రాజకీయ రగడ చోటు చేసుకుంది. అధికారులు ఈ సిఫార్సులను సీఈ వద్దకు పంపితే ఆయన ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇంకా ఏ జవాబు రాయలేదు. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత మాత్రం ఆత్రంగా ఈ వివాదాస్పద పనికి శంకుస్ధాపన చేయడం గమనార్హం. శిలాఫలకంపై కాంట్రాక్టర్ వివరాలు, ఇతర వివరాలు లేకుండానే అధికారుల పేర్లతో శిలాఫలకాన్ని ఆవిష్కరించడం విమర్శలకు తావిచ్చింది. మేం..రారాజులం అన్న అధికార పార్టీ నేత దర్పం ఈ వ్యవహారంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం
సాక్షి, ఒంగోలు సిటీ : మీ ఊరికి ఎంత దూరమో .. మా ఊరికి అంతే దూరం అన్న లోకోక్తిని మరో మారు జనం ముందుకు తెస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎప్పుడో శంకుస్థాపన చేసిన షాదీఖానా నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అందరూ హర్షించదగ్గదే. అయితే శంకుస్థాపన చేసిన పూర్వ నాయకుల పేర్లను మారడమే విమర్శలకు తావిచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ వద్ద షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకం వైఎస్సార్ అభిమానులు కలత చెందేలా చేసింది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పాత శిలాఫలకాన్ని మాయం చేసి, కొత్తగా దామచర్ల జనార్దన్ ప్రారంభకులుగా వేసిన శిలాఫలకం చర్చలకు దారి తీసింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు విమర్శలను మూట గట్టుకున్నారు. పాత ఫలకాన్ని తొలగించి రాత్రికి రాత్రే కొత్త ఫలకం ఏర్పాటు అసలు జరిగింది ఇది ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు షాదీఖానా కోసం వినతులు వచ్చాయి. ఆయనకు వైఎస్సార్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఒంగోలు పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేయించి పనులు వెంటనే మొదలు పెట్టించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. బాలినేని చొరవతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ పని అప్పగించారు. వెంటనే ఉత్తర్వులను జారీ చేశారు. ఎండబ్ల్యూడీ గ్రాంటు నుంచి షాదీఖానాకు నిధులు కేటాయించారు. సీఎం హోదాలో రాజశేఖర్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒంగోలుకు మంజూరైన షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ దేవానంద్ ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే అనంతరం జరిగిన ప్రభుత్వం మార్పు, రాష్ట్ర విభజన ఇతర అంశాలు తోడై షాదీఖానా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన దివంగత వైఎస్సార్ వేసిన పేరు లేకుండా కొత్త శిలాఫలకం వేయడంతో అభిమానుల విమర్శలకు దారి తీసింది. టీడీపీ ఇదో తరహా రాజకీయం? నగరంలోని కొత్త మార్కెట్ వద్ద అధికార పార్టీ నేతలు బుధవారం నియోజకవర్గం పరిధిలో పూర్తయిన పలు పనులను ప్రారంభించే క్రమంలోనే షాదీఖానాను కూడా ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే అసలు రాజకీయం చోటు చేసుకుందని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాయం చేశారన్న అపవాదును అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు మూటగట్టుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించడం లేదు. తమ నాయకుని పేరును శాశ్వతంగా భవనంపై లేకుండా చేశారని బాధపడుతున్నారు. త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఈ తరహా రాజకీయం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయమా? అధికారికంగా వేసిన ఆహ్వానం పత్రికల్లోనూ ‘తాత శంకుస్థాపన–మనవడి ప్రారంభోత్సవం’ అంటూ ముద్రించిన పత్రికలోని వివరాలు చూసిన అభిమానులు ఇంత అన్యాయమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. పత్రికలో, కొత్త శిలాఫలకంలో కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వేయడం గమనార్హం. షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన కొత్త శిలాఫలకం న్యాయం కోరతామంటున్న వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించి, రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి న్యాయం కోరతామని, పాత శిలాఫలకాన్ని సంబంధిత అధికారులు ఏం చేశారో సమాచారం ఇవ్వమని కోరతామన్నారు. ఇక్కడ తగిన స్పందన రాని పక్షంలో న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదు
-
కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీని అనుమతించం...
సాక్షి, ఒంగోలు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు బనాయిస్తే... మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదంటూ టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వర్గీయులు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించి, అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఒంగోలు కోర్టు సెంటర్లో అడ్డుకున్నారు. పోలీసుల చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను కుల రాజకీయాలకు దూరం అని ప్రచారం చేసుకుంటుండగా.. టీడీపీ నేతలు ఏకంగా ‘కమ్మపాలెం’లో ప్రతిపక్ష పార్టీకి అనుమతే లేదంటూ ఆందోళనకు దిగటం విడ్డూరం. కొనసాగుతున్న ఉద్రిక్తత తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే వరకు కదిలేది లేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనుచరుల వాహనంలోనే ఆయన బైఠాయించారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. -
నువ్వేమైనా పుడింగివా.. కళ్లు నెత్తికెక్కాయా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండెపి టీడీపీ దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు రెండోరోజు శనివారం ఒంగోలు సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే స్వామిపై చిందులు తొక్కారు. ‘‘నీకు గర్వం పెరిగింది.. గర్వం వచ్చాక మోదీ ఇమేజ్ ఎలా పతనమైందో నీ పరిస్థితి అలాగే అవుతుంది. అలా అవకుండా చూసుకో. నేను కళ్లు తెరిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. నేను ఒక్క పిలుపిస్తే నీ పరిస్థితి కార్యకర్తకంటే దిగజారుతుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీల మాట కూడా వినవా..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలకు బిత్తరపోయిన స్వామికి నోట మాటరాక నిశ్చేష్టుడయ్యారు. సీఎం విరుచుకుపడిన తీరు చూసి ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు సైతం పాపం.. స్వామి.. అంటూ జాలిపడ్డారు. దళితులైన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ బీఎన్ విజయకుమార్‌లపై సీఎం విరుచుకుపడ్డారు. తన పర్యటనలో తొలిరోజైన శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఇదే హాలులో నిర్వహించిన సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతనూతలపాడులో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలే మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. బీఎన్‌ను మార్చాల్సిందేనంటూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. సీఎంకు, లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ బీఎన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పనితీరు బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 నియోజకవర్గాలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలపై సీఎం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. సీఎం తన సామాజిక వర్గం నేతల కోసమే దళిత ఎమ్మెల్యేలను చివాట్లు పెట్టారని వారి అనుచర వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన సామాజికవర్గానికి చెందిన మండల స్థాయి నేతలు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు.. దళిత ఎమ్మెల్యేలను తిట్టడంపై స్వపక్ష నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మీ తాత నాకు విధేయుడు.. కొండపిలో వర్గ విభేదాలకు ఆజ్యం పోశావంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ‘‘నిన్ను జిల్లా నాయకుడిని, ఎమ్మెల్యేని చేశాను. మీ తాతను ఎమ్మెల్యే, మంత్రిని చేశాను. వయసులో పెద్దవాడైనా ఆయన విధేయతగా ఉండేవారు. నీ దగ్గర ఆ అలవాటు లేదు. మీ తాత పనితీరు నీకు రాలేదు. పనిమెరుగు పరుచుకో’’ అంటూ సలహాఇచ్చారు. జిల్లా నాయకత్వం వహిస్తే.. అందరిని కలుపుకుపోవాలని చెప్పారు. తననెవరూ ఏ మార్చలేరంటూ సీఎం చెప్పారు. -
ఎమ్మెల్యే vs యాదవ సంఘం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించాల్సిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మాన కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డు పడ్డారు. ఇది యాదవ సంఘం నేతలు.. ఎమ్మెల్యే జనార్దన్ మధ్య మరింత వివాదాన్ని పెంచింది. దామచర్ల తీరుపై యాదవులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానం జరగకుండా అడ్డుపడ్డారని యాదవ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్మాన కార్యక్రమానికి రావద్దదంటూ ఎమ్మెల్యే సూచించడంతోనే టీటీడీ చైర్మన్ సన్మానం నిలిచి పోయిందని యాదవ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు టీడీపీలో చేరితేనే టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమానికి అనుమతిస్తానని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆ సంఘం నేతలు పేర్కొంటుండగా బాలనాగేంద్రం, రత్తయ్యలు కూడా నిర్ధారించడం గమనార్హం. టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన సుధాకర్ యాదవ్‌ను సన్మానించాలని జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తిరిగి పార్టీలు, రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు. సన్మానాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమంలో ఎక్కువ శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు గుర్తించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యక్రమం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతోందని, దానికి ఎలా వస్తారంటూ టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒకే అంటేనే తాను సన్మానానికి వస్తానంటూ టీటీడీ చైర్మన్ యాదవ్ సంఘం నేతలకు స్పష్టం చేశారు. దీంతో యాదవ సంఘం నేతలు జడా బాలనాగేంద్రం, జమ్ము రత్తయ్య తదితరులు ఎమ్మెల్యే జనార్దన్‌ను సంప్రదించారు. మీరు టీడీపీలో చేరితేనే కార్యక్రమాన్ని జరుపుదామని, ప్రస్తుతం ఈ సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు యాదవ సంఘం నేతలు తెలిపారు. అంతేకాకుండా సమావేశం టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిర్వహించాలని, సన్మాన కార్యక్రమానికి తానే అధ్యక్షత వహిస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లు నేతలు చెబుతున్నారు. అయితే పార్టీలకతీతంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఎమ్మెల్యే హోదాలో మీరు అధ్యక్షత వహించడం కుదరదని, మొత్తం కార్యక్రమం యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, మిగిలిన ప్రజా ప్రతినిధులు, నేతలు అతిథులుగానే వచ్చి వెళ్తారని యాదవ సంఘం నేతలు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే ససేమిరా అన్నట్లు యాదవ సంఘం నేతలు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సన్మాన కార్యక్రమం నిలిచి పోయిందని, ఎమ్మెల్యే పట్టుబట్టి సన్మానాన్ని ఆపించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ సన్మాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సరికాదని యాదవ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. -
ఎమ్మెల్యే దామచర్ల vs జెడ్పీ చైర్మన్ ఈదర
-
పేదల బతుకులపై.. పచ్చ మేడలు
టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు బండ్లమిట్టలో దుకాణాల కూల్చివేత 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలు టీడీపీ కార్యాలయం కోసమా..? బోటు షికారు వ్యాపారం కోసమా..? అప్పట్లో పట్టాలిచ్చిన కరణం బలరాంను దోషిగా చూపేందుకు దామచర్ల వ్యూహం అధికార పార్టీ నేతల దుకాణాలు, ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు మైనారిటీల బతుకులు ఛిద్రం చేయడంపై సర్వత్రా విమర్శలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారు. స్వలాభాపేక్షతో దారుణానికి ఒడిగట్టారు. 30 ఏళ్లుగా నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని బతుకుసాగదీస్తున్న పేదల ఇళ్లపై వారి కన్ను పడింది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం, దాన్ని చేజిక్కించుకుంటే కోట్లు వచ్చి పడినట్లే. అంతే..! అధికారులను అడ్డుపెట్టి పేద ముస్లింల చిరు దుకాణాలను మంగళవారం కూల్చివేశారు. అక్కడున్న మసీదును కూల్చటానికి కూడా వెనుకాడలేదు. స్థానికులు గొడవకు దిగకుండా పోలీసులను అడ్డుపెట్టారు. వారు కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా... అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు పోలీసులు చలించలేదు. అన్నీ పీకి వారి బతుకులను రోడ్డున పడవేశారు. బండ్లమిట్ట కూల్చివేత వెనుక పచ్చ నేతల స్వలాభాపేక్ష కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరం నడిబొడ్డున ఉన్న ఊరచెరువును ఆధునీకరించి బోటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేయాలని కార్పోరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోటింగ్ పార్కింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను దామచర్ల తమ అనుచరులకు ఇప్పించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం ఉంది. చెరువు ఈశాన్యంలో ప్రధాన గేటు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడ గత 30 ఏళ్ల నుంచి ఉన్న దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. అది వివాదం కాకుండా ఉండేందుకు ఆక్రమణలు, నకిలీ పట్టాలు అంటూ అధికారులతో ప్రచారం చేయించారు. చివరకు మంగళవారం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టారు. ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించి సొంత లాభం వ్యవహారాన్ని కప్పి పుచ్చుకునేందుకు, అధిష్టానం మద్ధతు పొందేందుకు అధికార పార్టీ స్థానిక ముఖ్యనేత వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఆక్రమిత స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కరణం బలరామకృష్ణమూర్తి ఎంపీగా ఉన్నప్పుడు పేద ముస్లింలు, మిగిలిన వర్గాలకు అప్పటి మున్సిపాలిటీ స్థలాన్ని పట్టాలుగా ఇచ్చినట్లు సమాచారం. ఆ స్థలాల్లోనే పేదలు అధిక శాతం దుకాణాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకు సాగదీస్తుండగా కొందరు చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం అటు కరణం... ఇటు ఎమ్మెల్యే దామచర్ల వర్గాల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కరణం పేదలకిచ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని తన అధిపత్యాన్ని చాటుకునేందుకు దామచర్ల వర్గం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కార్పోరేషన్ అధికారులను అడ్డుపెట్టి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వైపు ప్రస్తుతం కూలగొట్టిన దుకాణాలన్నీ 90 శాతంపైగా ముస్లిం పేదలవే. మిగిలిన వారు కాపులున్నారు. ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్ధతు పలికారన్న అక్కాసుతో పాటు తాజాగా కాపులు ముద్రగడకు మద్ధతు పలుకుతున్నారన్న అక్కసుతోనే అధికార పార్టీ నేతలు దుకాణాలను కూలగొట్టేందుకు సాహసించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ 14/1లో గతంలో పదుల ఎకరాల్లో విలువైన కార్పొరేషన్ స్థలం ఉంది. ఇప్పటికే ఆ స్థలంలో 90 శాతాన్ని ఆక్రమించి ఇళ్ల కట్టుకున్నారు. బండ్లమిట్ట ప్రాంతంలోనూ ఆక్రమిత స్థలాల్లో పెద్ద ఎత్తున దుకాణాలను నిర్మించారు. మంగళవారం అధికారులు అధికార పార్టీ నేతల ఇళ్లు, దుకాణాల జోలికి వెళ్లకుండా పేదలు నిర్మించుకున్న దుకాణాలను మాత్రమే కూల్చివేయటం గమనార్హం. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ కట్టడాలున్నాయి. అధికార పార్టీ నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అద్దంకి బస్టాండ్ సమీపంలో ఓ కాంప్లెక్స్ అక్రమంగా నిర్మిస్తున్నా... అధికార పార్టీ ముఖ్య నేత, కార్పోరేషన్ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకొని పట్టించుకోలేదు. గుంటూరు రోడ్డులో భూ బదలాయింపు లేకుండానే అధికార పార్టీ నేత అండతో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినా.. అధికారులు ముడుపులు తీసుకొని మిన్నకుండిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో అక్రమ కట్టడాలు కొకోల్లలు. అయినా అధికారులు వారి జోలికి వెళ్లలేదు. -
టీడీపీ నేతలతోనే వెళ్లండి
‘మా వాళ్లేమి చేసినా చూసీచూడనట్టు వెళ్లిపోండి ... మరీ ముక్కు సూటిగా పోవద్దంటూ’ విజయవాడలో గతంలో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హుకుం జారీ చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో ముందడుగు వేశారు. మంగళవారం నగరపాలక సంస్థలోని పలు విభాగాల సమీక్ష సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘నగరంలో ఏయే పనులు చేస్తారో నివేదిక తయారు చేసుకోండి ... పక్కా ప్రణాళికతో పనులు చేయడానికి డివిజన్లలోకి వెళ్లండి ...అలా వెళ్లే సమయంలో టీడీపీ స్థానిక నేతలను మీ వెంట తీసుకువెళ్లండి ... వారితోనే తిరగండి. వారిని కాదని వీధుల్లో ఏ పనీ చేయవద్దు’ అని ఆదేశించారు. అక్కడికే పరిమితం కాలేదు గత ప్రభుత్వాల్లో ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తాం ... ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే తొలగిస్తాం... కోర్టుకు వెళ్లినా సరే మా పని మేం చేసుకుపోతామంటూ తమ దౌర్జన్య ప్రణాళికనూ వారి ముందుంచారు. ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని సమస్యలపై నివేదిక తయారు చేయాలని, ఆ సమస్యలను గుర్తించేందుకు ఆయా డివిజన్లకు అధికారులు వెళ్ళినపుడు తప్పకుండా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులను వెంట తీసుకువెళ్ళాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్థన్ నగరపాలక సంస్థ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక నగరపాలక సంస్థలో విభాగాల వారీగా దామచర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ సెంటర్లో గతంలో ఇచ్చిన పట్టాలను, ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై కోర్డుకి వెళ్లినా మరింకేమి చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నీరు వృథాకాకుండా ప్రతి ఇంటిలో నీటి సంపులుండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత నాయకులు, అధికారులకు అలవాటు పడి చేసే పనులను మానుకొని సజావుగా పూర్తి చేయాలనిన్నారు. నగరంలో ఉన్న అన్నీ ముఖ్య కూడల్లో చెత్త డబ్బాలని ఉంచాలని సూచాంచారు. జనవరి 7 నుంచి తానుకూడా వార్డుల్లో పరిశీలిస్తానని అన్నారు. సమీక్ష అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పరిశుభ్ర ఒంగోలు కోసం రోడ్లు విస్తరించడం, ఆ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటుతామన్నారు. రోడ్డుకి మధ్యలో డివైడర్లు,సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్ల మధ్యలో అక్కడక్కడా దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగు కాలువల మరమ్మతులు, నిర్మాణాలతో పాటు సిమెంట్ రోడ్లు, ప్రతిరోజు మంచినీటి సరఫరా అయ్యేలా కృషి చేస్తానన్నారు. ట్రాఫిక్‌కి సంబంధించి సిగ్నల్ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాలని చెప్పారు. - క్లాక్ టవర్ నిర్మాణానికి అభ్యంతరాలతో స్థలం మార్చాం నగరంలో క్లాక్‌టవర్ నిర్మాణ విషయంపై విలేకర్లు ప్రశ్నించగా స్థానిక చర్చి సెంటర్లో చేపట్టాలని తొలుత అనుకున్నాం... చర్చి ప్రతినిధులు ‘అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమే ముద్దు క్లాక్ టవర్ వద్దు’ అనే విధంగా అడ్డుకోవడంతో పాత మార్కెట్ సెంటర్, మంగమూరు రోడ్డు భైపాస్ రోడ్డుపై నిర్మించేందుకుమార్పులు చేస్తామని అన్నారు. -
మా ఇసుకతో మీ వ్యాపారమా?
మోటుమాల (కొత్తపట్నం): మండలంలో ఇసుక రీచ్‌లు వివాదంగా మారుతున్నాయి. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకంలో ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని కొద్దికాలంగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని భావించడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మోటుమాలలో ఇసుక రీచ్‌ను కలెక్టర్ విజయకుమార్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం ప్రారంభించారు. ఇసుక తవ్వకంతో ఐదు గ్రామాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలవనీయకుండా ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు జత కలిశారు. అర్జీలిచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు ప్రజలను నెట్టి బయటకు పంపారు. దీనికి ముందు మహిళలు, గ్రామస్తులు ఎవరూ సభకు రావొద్దని ఎస్సై బి.నరసింహారావు హెచ్చరించారు. ఒకరినో, ఇద్దరినో అనుమతిస్తానని చెప్పారు. దీంతో వారికి కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకుండా పోయింది. కలెక్టర్ రీచ్‌ను ప్రారంభించి వెళ్లిన తర్వాత ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్‌ను అడ్డుకుని స్థానిక మహిళలు దాని డోర్లు ఊడదీసి ఇసుకను పారబోసారు. ఈ సందర్భంగా మోటుమాల సర్పంచ్ పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల ఎంపీటీసీ కోడూరి సులోచన మాట్లాడుతూ 1996కు ముందు పాదర్తి, మోటుమాల గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగాయని, 1996 తర్వాత సర్వే నం.465లో 115 ఎకరాలు మోటుమాల పంచాయతీకి అప్పటి కలెక్టర్ శర్మ అప్పగించారని వివరించారు. రహస్యంగా ఐకేపీ అధికారుల కమిటీ రహస్యంగా అధికార పార్టీ అండతో పాదర్తి గ్రూపు సంఘాలతో కమిటీ వేశారని ప్రజలు వాపోతున్నారు. పాదర్తి గ్రామానికి 26 గ్రూపులు, మోటుమాల 68 గ్రూపులున్నాయి. ఈ భూమి 1996లో అప్పటి కలెక్టర్ శర్మ మోటుమాలకు ఇచ్చినట్లు ఉత్తర్వులన్నాయి. తమ గ్రామాన్ని పక్కనబెట్టి పాదర్తికి అనుమతి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని డీఆర్డీఏ పీడీని మహిళలు ప్రశ్నించారు. తవ్వకాలు ఆపకుంటే ట్రాక్టర్లను అడ్డుకుంటామని గ్రామస్తులు, మహిళలు హెచ్చరించారు. -
ఈదరపై వేటుకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన ఈదర హరిబాబును కొనసాగించడానికి వీల్లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మన్నెం రవీంద్రతో పాటు చంద్రబాబునాయుడిని కలిశారు. ఈదరను పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉందని బాబు వద్ద జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును దామచర్ల జనార్దన్ కలిసిన కొద్ది సేపటికే జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు కూడా ఆయన్ను కలిసి చర్చించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన అంశంపై ఇప్పటికే ఈదర హరిబాబుపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడ్ని కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే.. టీడీపీ తర ఫున విప్ జారీ చేసిన అభ్యర్థి, టీడీపీకి చెందిన అడ్వకేట్లు జిల్లా ఎన్నికల అధికారిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఈదర హరిబాబును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. బలరాం కూడా తప్పని పరిస్థితుల్లో ఈదరపై వేటుకు అంగీకరించినట్లు సమాచారం. అందువల్లే ముందుగా జనార్దన్ కేవియట్ పిటీషన్ ద్వారా ఈదరకు కోర్టు ద్వారా స్టే పొందేందుకు వీలులేకుండా యత్నించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ విషయమై దామచర్ల జనార్దన్ ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలోని కొంత మందికి నామినేటెడ్ పోస్టుల విషయమై తాము సీఎంను కలిశామని తెలిపారు. మార్కెటింగ్ యార్డు తదితర పోస్టుల విషయమై జిల్లాకు చెందిన పలువురిని బాబు వద్దకు తీసుకువెళ్లినట్లు వివరించారు. పార్టీ అధ్యక్షుడు ఆదివారమే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. -
నువ్వా.. నేనా..?
సాక్షి, ఒంగోలు: ప్రజాసమస్యల్ని గాలికొదిలేసిన అధికార టీడీపీ.. సొంత కుంపటిని చల్లార్చుకునే పనిలో పడింది. కొన్నాళ్లుగా నడుస్తోన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఎన్నిక వ్యవహారం తాజాగా ఆ పార్టీలో చిచ్చురేపింది. సీనియర్, జూనియర్ల వివాదాన్ని తెరమీదికి తెచ్చింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెండు వర్గాలుగా చీలి కత్తులు దూసుకుంటున్నారు. పార్టీని నడపటంలో ఇరువురి ఆధిపత్యపోరు ఆది నుంచి కొనసాగుతూనే ఉన్నా.. అధినేత వద్ద తేలాల్సిన పంచాయితీల విషయమై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఈదర హరిబాబును ఇప్పటికే అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. అయితే, ఆయన్ను మరలా పార్టీలోకి చేర్చుకోవాలని కరణం బలరాం ప్రయత్నిస్తోండగా, మరోవైపు దామచర్ల జనార్దన్ తీవ్రంగా అడ్డుకుంటున్నారు. మిగతా నేతలను కలుపుకుని వర్గపోరును పోషిస్తున్న వీరిద్దరూ ‘ఈదర’ పంచాయితీ నేపథ్యంలో నువ్వా..నేనా..? అన్నట్టు తలపడుతున్నారు. అధిష్టానం వద్ద తమ మాటే నెగ్గించుకోవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తున్నారు. పార్టీ పగ్గాల కోసమే సిగపట్లు.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఈదర హరిబాబు స్వతంత్రంగా పోటీ చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా ఆయన కూడా వైస్‌చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థికే ఓటేశారు. ఈ వ్యవహారంలో హరిబాబు విప్‌ను ధిక్కరించారా..? లేదా..? అనే వ్యవహారం కొద్దిరోజుల్లో అధికారులు తేల్చనున్నారు. ఇదిలా ఉండగా, ఆయనపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదంటూ కరణం బలరాం తనవర్గాన్ని తోడుగా తీసుకుని చంద్రబాబుతో మాట్లాడారు. మరోవైపు దామచర్ల జనార్దన్ సైతం బాబు వద్దకెళ్లి ఈదరను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదంటూ.. నమ్మకద్రోహం కారణంగా పరువు పోగొట్టుకున్నామని చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇరువురి వాదనలు విన్న చంద్రబాబు మాత్రం బలరాం నిర్ణయం వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి వర్గం ఈ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ వ్యవహారాల్లో జనార్దన్ నిర్ణయాలకు అడ్డుతగులుతున్న కరణం బలరాంకు.. తాజాగా ఈ పంచాయితీ మరింత గుర్తింపును తెస్తోందని ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాను జిల్లాలో ఎవరికీ పోటీదారుడ్ని కాదని.. గొట్టిపాటి హనుమంతరావు సన్నిహితుడ్ని అని విలేకరుల సమావేశంలో చెప్పుకున్న ఈదర హరిబాబుకు కరణం బలరాం మద్దతివ్వడాన్ని పార్టీవర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గొట్టిపాటి కుటుంబంతో బద్ధవైరం నడుపుతున్న బలరాం ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జెడ్పీచైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేసినప్పటికీ.. ఎటూ ఆ పదవి అధికారపార్టీకి దక్కదనే ఉద్దేశాన్ని అధినేతకు వివరించి.. జిల్లాపార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనే ఆలోచనతో బలరాం పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది. సమీపంలో ఉన్న ఒంగోలు నగరపాలకసంస్థ ఎన్నికల్లో జనార్దన్ ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఈదర పంచాయితీని బలరాం భుజానికెత్తుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలకు దూరంగా మంత్రి శిద్దా.. పార్టీలో సీనియర్‌గా ఉంటూ జిల్లా రాజకీయాలు కొనసాగిస్తున్న కరణం బలరాం వైఖరిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భానుసారం అధినేత చంద్రబాబు కూడా బలరాంను కాదని ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి దామచర్ల జనార్దన్‌ను సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే.. బలరాం తనకు సంబంధంలేని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడాన్ని జనార్దన్ తరచూ అధినేత దృష్టికి తెస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిపదవి పొందిన శిద్దా రాఘవరావును అడ్డం పెట్టుకుని జనార్దన్ హవాకు చెక్‌పెడదామనే వ్యూహంతో కరణం బలరాం రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వరుస ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, సీట్లపంపకం, బీఫారంల పంపిణీ తదితర పనులన్నింటినీ శిద్దా రాఘవరావుతోనే నడిపించారు. మంత్రి అయిన తర్వాత కూడా శిద్దా రాఘవరావును తన నివాసానికి పిలిపించుకుని మరీ బలరాం మంతనాలు సాగించారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, కార్యకర్తలతో పాటు సామాన్యజనం సైతం మంత్రిని కలవకుండా.. కరణం బలరాంతో సంప్రదించడం.. ఆమేరకు ఆయన ఆదేశాలతో మంత్రి శిద్దా అధికారులకు ఫోన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలోనే విషయం గుర్తించిన మంత్రి.. కొద్దికాలంగా బలరాంకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఈదర హరిబాబు వ్యవహారంలో కూడా ఇరువర్గాల అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చేసి ముందుకెళ్తున్నారు. నిన్నటిదాకా జనార్దన్ పక్కనే ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావులు సైతం పార్టీ అధినేత నిర్ణయానికే కట్టుబడతామన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రం జనార్దన్ వర్గంలో ఉంటూ బలరాం ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏది ఏమైనా, అధికార నేతలు జిల్లాలో రైతాంగ, డ్వాక్రాసంఘాల రుణ సమస్యల్ని గాలికొదిలేసి.. స్వపక్ష కుమ్ములాటలకు అధికప్రాధాన్యమిచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒంగోలు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అవసరం
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలంటే వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని గుర్తించినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి ఇటీవల వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలోని కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న భవనాలతో పాటు ధ్వంసమైన డివైడర్లు, పైపులైన్ లీకేజీలను కార్పొరేషన్, విద్యుత్ శాఖాధికారులతో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించి ఒంగోలు నగర అభివృద్ధికి ఏడాదిలోగా బాటలు వేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకం కల్పిస్తూ కోర్టును ఆశ్రయించిన భవనాల యజమానులతో సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు. గోడు వెళ్లబోసుకున్న మహిళలు... కర్నూలు రోడ్డు, తదితర ప్రాంతాల్లో పర్యటించిన జనార్దన్‌ను స్థానిక వెంకటేశ్వరనగర్, మఠంబజార్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలు కలుసుకుని సమస్యలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సాయంత్రంలోగా నీరు సరఫరా చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారు. అదే విధంగా కర్నూలురోడ్డు విస్తరణలో కూలగొట్టిన భవనాలకు సెట్‌బ్యాక్‌కు సంబంధించిన టీడీఎస్ ఫారాలను కార్పొరేషన్ అధికారులు నేటికీ ఇవ్వలేదని వాటి యజమానులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులతో సంబంధం లేకుండానే కూలగొట్టిన భవనాల యజమానులకు వాటిని అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రోడ్డు విస్తరించిన ప్రాంతాల్లో ఇంకా రోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆ శాఖాధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు, కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఎంఈ చెన్నకేశవరెడ్డి, పర్యావరణ డీఈ గిరిధర్ తదితరులు ఉన్నారు. -
పదవుల కోసం ఆరాటం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, ఆ పార్టీ నాయకులు పదవుల కోసం అర్రులు జాస్తున్నారు. జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోరుతుండగా, ఓడిన వారు ఎమ్మెల్సీ పదవి కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో ఏదో విధంగా లబ్ధి పొందాలనే ఆతృతతో తెలుగు తమ్ముళ్లున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. పదేళ్లలో తొలిసారిగా ఐదునియోజకవర్గాల్లో విజయం సాధించామని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన దామచర్ల జనార్దన్, తాను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై భారీ మెజారిటీలో గెలిచానని తనకు మంత్రి పదవి ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాను బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడనని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనకు లోకేష్ సన్నిహితుడని వారితో సిఫారసు చేయించుకుని మంత్రి పదవి దక్కించుకుంటామని అంటున్నారు. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలని కోరుతుండగా, ఓడిన వారు కూడా తమకు నామినేటెడ్ పదవులో, ఎమ్మెల్సీలనో కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దివి శివరాం తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోరుకున్నట్లు తెలిసింది. అయితే ఆ పదవిని తిరుపతి టీడీపీ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తికి కేటాయించినట్లు, ఆయనకే ఆ పదవిని ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో మాగుంట కినుక వహించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత, తనకు న్యాయం జరగలేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పొందిన బీఎన్ విజయకుమార్ కూడా తనకు నామినేటెడ్ పదవి ఇప్పించాలని సుజనా చౌదరి ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి ఖరారయినట్లు భావిస్తున్న శిద్దా రాఘవరావు తన సన్నిహితులకు నామినేటెడ్ పదవులు కోరుతున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, లేనిపక్షంలో తన కుమారుడు కరణం వెంకటేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు వద్ద గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది. ఇదేవిధంగా ప్రతీ నాయకుడు తనకు పదవి కావాలని కోరుతున్నారు. సామాన్య కార్యకర్త కూడా తనకు రేషన్ దుకాణం లెసైన్సు ఇప్పించాలని డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. -
టీడీపీలో నువ్వా..నేనా..
సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం, బీజేపీ పొత్తు జిల్లాలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. సీనియర్ నేత కరణం బలరాంతో పాటు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కలిసి ఎవ రికి వారు సొంతవర్గాలను ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. పొత్తు ఖరారైన వెంటనే ఒంగోలులోని పార్టీ కార్యాలయ ధ్వంస రచనకు కరణం బలరాం సూత్రధారిగా వ్యవహరించారని దామచర్ల వర్గం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను టీడీపీలోకి తెచ్చుకోవడంలో కరణం బలరాం విజయవంతమయ్యారు. ప్రాదేశిక సమరంలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ఆర్థిక సహకారం అందించేందుకు బీఎన్ విజయ్‌కుమార్ కూడా సిద్ధమయ్యారు. అంతలో సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో విజయ్ వర్గం నీరుగారింది. అంతేకాక బీజేపీ తీర్థం పుచ్చుకున్న దారా సాంబయ్యను గెలిపించాలని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలు స్థానిక కేడర్‌కు మింగుడు పడలేదు. బలరాం అనుచరులను సైతం షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో బలరాం తెరవెనుక ఉండి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించడం, డెయిరీలో సమావేశం ఏర్పాటు చేయించడం, హైదరాబాద్ వెళ్లి హడావుడి చేయించడం జరుగుతోందని దామచర్ల వర్గం వేగుల ద్వారా అధినేతకు నివేదిక పంపింది. కొండపి సీటుకు ఎసరుపెట్టిన బలరాం ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్‌ను కాదని టీడీపీలోకొస్తే ఇటువంటి పరాభవం జరగడమేంటని రాజకీయ భవిష్యత్‌పై లెక్కలేస్తూ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ డీలా పడినట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన చర్చల్లో సంతనూతలపాడు బదులు కొండపి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ దారా సాంబయ్యను నిలుపుతున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమాచారంతో బీఎన్ విజయ్‌కుమార్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు. తొలుత పొత్తులో భాగంగా బీజేపీ నాయకత్వం కొండపి స్థానాన్ని కోరగా, చంద్రబాబు మాత్రం సంతనూతలపాడు లేదా గిద్దలూరు కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. ఎటూ టీడీపీ గెలవలేదనే ఆలోచనతోనే కొండపి, గిద్దలూరును త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధ పడినట్టు చెపుతున్నారు. దామచర్ల జనార్దన్ అనుంగు శిష్యుడు బాల వీరాంజనేయ స్వామి కిందటి ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ అతడినే బరిలో దించేందుకు నిర్ణయించారు. అయితే, బలరాం తెచ్చిన విజయ్‌కుమార్‌ను సంతనూతలపాడులో ఉండనివ్వకుండా చంద్రబాబు వద్ద దామచర్ల చక్రం తిప్పారని ప్రత్యర్థివర్గం ఆరోపిస్తుంది. దీంతో కరణం బలరాం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీని సంతనూతలపాడు నుంచి కొండపికి మార్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆది నుంచి టీడీపీలో సీనియర్‌గా ఉండటం అందర్నీ కలుపుకునిపోవడం కరణం బలరాం బలంగా చెబుతుండగా, జిల్లాపార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలతో మమేకం కాలేకపోవడం పార్టీలో జీతాలిచ్చి సొంత వ్యక్తులను పెట్టుకుని కార్యక్రమాలు చేయించడం దామచర్ల బలహీనతగా వైరివర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇద్దరిపై చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి. మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో పిడతల సాయికల్పనకు సీట్లు గల్లంతు కావడంలో కూడా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే కారణమని పార్టీనేతలు చెబుతున్నారు. తాజాగా, కొండపిలో తన సన్నిహితుడు బాలవీరాంజనేయ స్వామికి సీటులేకుండా చేయడంలో ప్రత్యర్థి ఎత్తుగడకు దామచర్ల ఎలాంటి పైఎత్తు వేస్తారోనని పార్టీ కేడర్ వేచిచూస్తోంది. -
చంద్రబాబు తీరుపై బలరాం అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండ నాలికకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టుగా తయారైంది జిల్లా టీడీపీ పరిస్థితి. కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిత్యం కలహించుకుంటున్న వారిద్దరికీ చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కానీ అధినేత తీరుపై బలరాం సీరియస్ అయ్యారు. తనకంటే జూనియర్ అయిన దామచర్లను, తనను ఒకేగాటన కట్టి మందలించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తనను చిన్నచూపు చూసి జిల్లాలో పార్టీని ఎలా గాడిలో పెడతారో చూస్తానంటున్నారు. ఇద్దరికీ క్లాస్ పీకిన చంద్రబాబు తన బస్సు యాత్రకు ముందే జిల్లా టీడీపీలో విభేదాల వ్యవహారాన్ని తేల్చేయాలని చంద్రబాబు భావించారు. కరణం బలరాం, దామచర్ల జనార్దన్లను చివరిసారిగా మందలించాలని నిర్ణయించారు. జిల్లాలో బస్సు యాత్ర ఖరారుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన నేతలతో సమావేశాన్ని దీనికి అవకాశంగా తీసుకున్నారు. జిల్లా ముఖ్య నేతలతో బస్సు యాత్రపై చంద్రబాబు సోమవారం రాత్రి చర్చించాల్సింది. కానీ ముందుగా బలరాం, దామచర్లను ప్రత్యేకంగా పిలిపించారు. వారిద్దరి మధ్య విభేదాల అంశాన్ని సూటిగా ప్రస్తావించారు. ‘మీరిద్దరూ గొడవ పడుతుండటం వల్ల పార్టీ బజారున పడుతోంది. వరుసగా రెండుసార్లు ఓడిపోయాం. అయినా మీరు మారకపోతే ఎలా?...ఇలా అయితే నేను పార్టీని ఎలా నడపాలి? నా స్థానంలో మీరు ఒక రోజు ఉండండి తెలుస్తుంది. పార్టీని నడపడం ఎంత కష్టమో’అని ఇద్దరిపై చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆగ్రహాన్ని గుర్తించిన దామచర్ల మౌనంగా ఉండిపోయారు. కానీ చంద్రబాబు మాటలకు బలరాం అడ్డుతగిలి అడ్డంగా దొరికిపోయారు. తాను పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే జనార్దనే సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటే మంచిదని తాను ప్రతిపాదిస్తే జనార్దన్ అడ్డుకోవడమేమిటని అడిగారు. ‘మీరు కూడా ఆయన మాటలకే విలువిచ్చి నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా రాజకీయాలు చూస్తున్న నాకంటే జనార్దన్‌కు ఎక్కువ తెలుసా?’అని ప్రశ్నించారు. తననే తప్పుబట్టడంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బలరాంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నావ్? అసలే రాష్ట్రంలో పరిస్థితులతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటన్నాం. ఇక సీనియర్వి అయిన నువ్వు కూడా తలనొప్పిగా మారితే ఎలా? నీ ఆధిపత్యం కోసం తపన తప్ప పార్టీ గురించి ఆలోచించవా? మీరు మారకపోతే నేనే ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత మీ ఇష్టం’అని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు అంత తీవ్రస్థాయిలో ముఖం మీదే మందలించడంతో బలరాం చిన్నబుచ్చుకున్నారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సోమవారం రాత్రి బలరాం, జనార్దన్లతో మాట్లాడేసరికే సమయం మించిపోవడంతో జిల్లా నేతలతో సమావేశాన్ని చంద్రబాబు మంగళవారానికి వాయిదా వేశారు. అధినేతపై బలరాం శివాలు: కాగా చంద్రబాబు తీరుపై కరణం బలరాం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఆయన తన అనుయాయులతో మాట్లాడుతూ అధినేత తీరుపై విరుచుకుపడ్డారు. తనకంటే బాగా జూనియర్ అయిన జనార్దన్ ముందు తనను అంతగా మందలించడాన్ని బలరాం తప్పుబడుతున్నారు. తనకు ఏదైనా చెప్పాలంటే విడిగా పిలిపించి చెబితే సరిపోయేదని... కానీ జనార్దన్ ముందే తనను తూలనాడితే ఇక ఆయన తనకు జిల్లాలో ఏం గౌరవం ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు తామిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినా జనార్దన్ మౌనంగా ఉండిపోవడాన్ని బలరాం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. ‘మాతో చంద్రబాబు ఏం చెప్పనున్నారో జనార్దన్‌కు ముందే తెలిసి ఉండాలి. కాబట్టే ఆయన అందుకు మానసికంగా సిద్ధపడిపోయి మౌనంగా ఉండిపోయారు. ఇదేమీ తెలియని నేను ప్రతిస్పందించి అధ్యక్షుడితో మాటలు పడాల్సి వచ్చింది’అని బలరాం వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఖరిపై బలరాం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమను మందలించబోతున్న విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుగానే జనార్దన్‌కు చేరవేశారన్నది ఆయన ఉద్దేశం. అందుకే జనార్దన్ మౌనంగా ఉండిపోయాడని... తాను మాత్రం దొరికిపోయానని భావిస్తున్నారు. ఇక తన తడాఖా చూపించాలని కరణం బలరాం భావిస్తున్నారు. జిల్లాలో పార్టీకి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తేగానీ తానేమిటో చంద్రబాబుకు తెలిసిరాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మునుముందు జిల్లా టీడీపీలో విభేదాలు సరికొత్త మలుపు తిరగనున్నాయని స్పష్టమవుతోంది. 30 తరువాతే యాత్ర బస్సు యాత్ర షెడ్యూల్‌పై చంద్రబాబు జిల్లా నేతలతో మంగళవారం చర్చించారు. డెయిరీ డెరైక్టర్ల ఎన్నికలు ఉన్నందున ఈ నెల 30 తరువాతే జిల్లాలో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో యాత్ర నిర్వహించిన అనంతరం జిల్లాలోకి ప్రవేశిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా పార్టీ ఇన్చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, శిద్దా రాఘవరావు, మన్నం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.