ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు బనాయిస్తే... మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదంటూ టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వర్గీయులు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించి, అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.