
సాక్షి, ఒంగోలు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు బనాయిస్తే... మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదంటూ టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వర్గీయులు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించి, అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఒంగోలు కోర్టు సెంటర్‌లో అడ్డుకున్నారు. పోలీసుల చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను కుల రాజకీయాలకు దూరం అని ప్రచారం చేసుకుంటుండగా.. టీడీపీ నేతలు ఏకంగా ‘కమ్మపాలెం’లో ప్రతిపక్ష పార్టీకి అనుమతే లేదంటూ ఆందోళనకు దిగటం విడ్డూరం.
కొనసాగుతున్న ఉద్రిక్తత
తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే వరకు కదిలేది లేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనుచరుల వాహనంలోనే ఆయన బైఠాయించారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.



Comments
Please login to add a commentAdd a comment