
'కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోంది'
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు.
ప్రకాశం:కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం లక్షల మంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ వైఎస్ కుటుంబంపై, బ్రదర్ అనిల్ పై అసత్య ఆరోపణలు చేస్తుందని జూపూడి తెలిపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కాంగ్రెస్-టీడీపీలు నిర్లక్ష్యంగా వ్యవరించడం తగదన్నారు. ప్రజల ఓటుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు.
అంతకు ముందు శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమైక్య పార్టీలకు మద్దతు ఇచ్చి.. మిగిలిన పార్టీలపై ఒత్తిడి పెంచాలని ఆమో ప్రజలకు సూచించారు.