'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది' | ysrcp given more importance to jupudi prabhakara rao | Sakshi
Sakshi News home page

'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది'

Published Sun, Aug 10 2014 4:05 PM | Last Updated on Thu, Aug 9 2018 4:32 PM

'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది' - Sakshi

'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది'

నెల్లూరు:జూపూడి ప్రభాకర రావుకి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితులకు వైఎస్సార్ కుటుంబం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణ స్వామిలు తెలిపారు. తన ఓటమికి సుబ్బారెడ్డే కారణమని జూపూడి చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోమాట్లాడిన పార్టీ నేతలు.. ఇప్పటికైనా జూపూడి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ తరుపునే అధిక సీట్లను దళితులే గెలిచారని వారు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement