సాక్షి, అమరావతి: దుగ్గరాజు పట్నం ఓడరేవు తీసుకొని వచ్చేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ పోర్టును కాపాడేందుకే దుగ్గరాజు పట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సోమవారం దుగ్గరాజు పట్నం పోర్టు నిర్మాణం పురోగతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కలిసి ఈ విషయంపై చర్చిద్దామని వచ్చానని తెలిపారు.
2018వరకు దుగ్గరాజు పట్నం తొలి దశ పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క లెటర్ రాస్తే.. కేంద్రం ఎనిమిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్దంగా ఉందని నితిన్ గడ్కరీ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. అయితే బకింగ్ హామ్ కెనాల్‌కు మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగేల చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment