varaprasad rao
-
బాబు చెప్పినట్లే.. షర్మిల, సునీత డ్రామాలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒప్పందం చేసుకుని మరీ సొంత అన్న వైఎస్ జగన్‌పై షర్మిల, సునీత విమర్శలు చేయడం మూర్ఖత్వమని నేషనల్ దళిత జేఏసీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ వల్ల వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలు పెరిగితే.. షర్మిల వల్ల దివంగత నేత ప్రతిష్ట దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ చనిపోతే.. ప్రకృతి ఆగ్రహంతో పావురాల గుట్టలో మాంసపు ముద్ద అయ్యాడంటూ రేవంత్ వికృత విమర్శలు చేసిన విషయాన్ని షర్మిల మరిచిపోవడం దారుణమని పేర్కొన్నారు. చరిత్ర పుటల్లో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నాడని.. అటువంటి రేవంత్, చంద్రబాబు పంచన చేరి షర్మిల, అనీల్‌కుమార్, సునీత ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తన బాబాయి వివేకా చివరి కోరిక మేరకు కడప ఎంపీకి పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతోందని, అదే నిజమైతే 2019లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. చనిపోయిన వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పంచన చేరడం దారుణమైతే.. అన్న వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం మరింత దారుణమన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ‘రుజువు కాని నేరారోపణలను అభ్యర్థిపై చేయకూడదని, అవేమి పట్టించుకోకుండా షర్మిల చేస్తున్న ఆరోపణలు, విమర్శలు దారుణమని పేర్కొన్నారు. వైఎస్ వివేకాను దాదాపు 20 ఏళ్లపాటు ఒంటరిగా వదిలేసి తన తల్లి సౌభాగ్యమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న నర్రెడ్డి సునీత ఇప్పుడు నీతులు చెబుతున్న తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గు పడుతుందని తెలిపారు. వివేకాను గొడ్డలితో నరికి చంపానని, ఆయన మార్మాంగాలను చిద్రం చేశానని బాహాటంగా చెబుతున్న దస్తగిరికి బెయిల్ ఇప్పించడమే కాకుండా అతన్ని సంరక్షిస్తున్న సునీత ఇప్పుడు ఎవరికి అనుకూలంగా పలుకులు పలుకుతుందో జనం గమనిస్తున్నారన్నారు. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో రక్తపు మరకలను శుద్ధిచేసిన నలుగురికీ నేటికీ జీతాలు ఇచ్చి పోషిస్తున్న సునీత ఇష్టం వచ్చినట్టు వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే జనం సహించరని వరప్రసాదరావు హెచ్చరించారు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
గుడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరప్రసాదరావు ప్రచారం
-
దుగ్గరాజు పట్నంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: దుగ్గరాజు పట్నం ఓడరేవు తీసుకొని వచ్చేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ పోర్టును కాపాడేందుకే దుగ్గరాజు పట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సోమవారం దుగ్గరాజు పట్నం పోర్టు నిర్మాణం పురోగతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కలిసి ఈ విషయంపై చర్చిద్దామని వచ్చానని తెలిపారు. 2018వరకు దుగ్గరాజు పట్నం తొలి దశ పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క లెటర్ రాస్తే.. కేంద్రం ఎనిమిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్దంగా ఉందని నితిన్ గడ్కరీ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. అయితే బకింగ్ హామ్ కెనాల్‌కు మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగేల చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు. -
చంద్రబాబు నాయుడు కాదు.. ఆయన పీకే నాయుడు
-
‘చంద్రబాబు దీక్షకు దిగడం హాస్యాస్పదం’
సాక్షి, విజయవాడ : ‘ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉంద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ రావు ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకే ఆయన ఈ దీక్ష చేపట్టారని అన్నారు. వైఎస్సాఆర్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చేసిన ‘ధర్మ పోరాట దీక్ష’ కొంగ చేసే దొంగ జపంలాంటిద’ని వాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ వల్లే ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యే హోదా’ అంశంపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక హోదా సాధించి ఉంటే రాష్ట్రం ఇన్ని అప్పుల్లో కూరుకుపోయేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయని బాబు 2019 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనలో చంద్రబాబుకు పదేళ్ల అనుభవం మాట ఏమోగానీ, ప్రజలను మోసం చేయడంలో మాత్రం చాలా అనుభవం ఉందని చురకలంటించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగమైన టీడీపీ ఇప్పుడు తప్పంతా బీజేపీదే అన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం ఎందాకైనా పోరాడుతుందనీ.. అందుకనే పార్టీ ఎంపీలమంతా రాజీనామా చేశామని వరప్రసాద్ తెలిపారు. -
‘30 సార్లు తిరిగి ఏం తీసుకొచ్చారు?’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మరో వైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు : ఎంపీ వరప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీ ఎంపీల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. విభజన జరిగి నాలుగేళ్లైనా హామీలు అమలు కాలేదంటూ నిరసనలు వ్యక్తం చేశారు. రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టులు మంజూరు చేయాలంటూ ధర్నాకు దిగారు. సభ్యుల ఆందోళనతో లోక్‌సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. ఈసందర్భంగా వైసీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఆంధ్రపదేశ్ అన్నివిధాలుగా నష్టపోయిందని, వెంటనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ విమర్శించారు. రాష్ట్రం కోసం ప్రజలంతా రోడ్డెక్కితే చంద్రబాబుకు చీమకుట్టినట్లుగానైనా లేదంటూ మండిపడ్డారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి అబద్దాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, ఇంకెన్ని రోజుల ప్రజలను మోసం చేస్తారంటూ వరప్రసాద్ ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ కొత్తగా ఏమీ చెప్పకపోయినా సుజనా చౌదరి, తెలుగుదేశం ఎంపీలు చప్పట్టు కొట్టడం ఏంటని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడకుండా మంత్రులు అశోక్ గజనతిరాజు, సుజనా చౌదరి, ఇంకా మంత్రి పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాలన్నారు. -
'ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారన్నారు. హోదా ఇవ్వకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబును వరప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్థతతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వరప్రసాద్ మండిపడ్డారు. -
అది బినామీ కంపెనీయే: పనామా పత్రాలు
పనామా పత్రాలు బయటకొచ్చినప్పడే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్(67)కు సంబంధించిన టోగోలోని వాసెం కంపెనీ గురించిన విస్తృత కథనాలు బయటకొచ్చాయి. వాసెమ్ కంపెనీలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. అయితే కెన్లెమ్ లిమిటెడ్ కంపెనీలో 24 శాతం షేర్లు మోటపర్తి శివరామ ప్రసాద్వే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కెన్లెమ్ కంపెనీ యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. దాంతో ఇది బినామీ పేర్ల మీద నడుస్తున్న కంపెనీ అని, దీని అసలు యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు వెల్లడించాయి. టోగోలో ఉన్న వాసెం సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు విదేశీయులవే అని, ఈ షేర్ హోల్డర్లలో ఒకరు మోటపర్తి శివరామ ప్రసాద్ అని పనామా పత్రాలు వెల్లడించాయి. నామమాత్రపు కంపెనీ పేరు మీద పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతం మోటపర్తి ఘనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించి పన్ను ఎగ్గొట్టే లక్ష్యంతోనే బినామీల పేర్లమీద ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. అయితే అక్కడ ఉన్న కంపెనీలలో 61 శాతం షేర్ హోల్డర్లు ఎవరనే విషయం టోగో వారికి తెలియదని పనామా పత్రాలు తెలిపాయి. -
'ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తాం'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పత్యేక హోదా కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ విషయం గురించి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వరప్రసాదరావు పేర్కొన్నారు. -
కల నెరవేరింది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : లోక్‌సభలో అడుగు పెట్టాలనుకున్న వరప్రసాదరావు కోరిక రెండో ప్రయత్నంలో నెరవేరింది. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండో సారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకంటే అధికంగా ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి జయరాం మీద 37,425 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో తనను ఓడించిన చింతా డిపాజిట్లు గల్లంతు చేశారు. ఆ ఇద్దరికీ డిపాజిట్లు గల్లంతు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. రామనారాయణరెడ్డికి ఆత్మకూరులో 8927 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు సార్లు తిరుపతి ఎంపీగా గెలిచిన చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో 33,333 ఓట్లు మాత్రమే లభించి ఘోర పరాజయం చవిచూశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు తిరుపతి లోక్‌సభ అభ్యర్థి విజయం విషయంలో 2009 ఎన్నికల నాటి పరిస్థితే పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఒక్క సర్వేపల్లిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల గెలిచారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఎంపీగా సుమారు 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు విషయంలో ఇదే పునరావృతమైంది. తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే వరప్రసాద్ 10,399 ఓట్లు అధికంగా సంపాదించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 7583 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే వరప్రసాద్‌కు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 9915 ఓట్లు అధికంగా వచ్చి బీజేపీ అభ్యర్థి కంటే 2332 ఓట్లు ఎక్కువ సంపాదించారు. సత్యవేడుపరిధిలో టీడీపీ అభ్యర్థి ఆదిత్య 4273 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ వరప్రసాద్‌కు బీజేపీ అభ్యర్థి కంటే 5183 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం కంటే వరప్రసాద్‌కు 9456 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సర్వేపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధనరెడ్డి 5447 ఓట్ల మెజారిటీతో గెలిస్తే వరప్రసాద్‌కు 23,242 ఓట్ల ఆధిక్యత దక్కింది. అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 17,795 ఓట్లు అధికంగా వచ్చాయి. గూడూరులో సునీల్‌కుమార్‌కు 9,088 మెజార్టీ వస్తే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 19,786 ఓట్ల మెజార్టీ వచ్చింది. వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి 5,525 మెజార్టీతో గెలిస్తే వరప్రసాద్‌కు ఇక్కడ 2857 ఓట్లు అధికంగా వచ్చాయి. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సంజీవయ్య 3726 ఓట్లతో గెలిస్తే వరప్రసాద్‌కు మాత్రం ఇక్కడ 13,898 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు ఆధిక్యతలు వచ్చి బీజేపీ అభ్యర్థి జయరాంను 37,425 ఓట్ల తేడాతో వరప్రసాద్ ఓడించారు.