సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మరో వైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment