
దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు.
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు.
చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ..
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు.
చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..!
వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస