Dalit Christians
-
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
NRI News: యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్లు. శనివారం సాయంత్రం బుర్ దుబాయ్‌లోని వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ కృతజ్ఞత సభకు యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు. -
తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్‌కు, మైనారిటీల జాతీయ కమిషన్‌కు, భారత రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
దళిత క్రైస్తవులకూ భూపంపిణీ
సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు (షెడ్యూల్ కులాల నుంచి క్రైస్తవులుగా మారినవారికి) భూపంపిణీ పథకంలో భాగంగా మూడు ఎకరాల పంపిణీ, భూ కొనుగోలు పథకాలు ప్రభుత్వం వర్తింపజేయనుంది. దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైనహక్కులు (విద్యా,ఉద్యోగ రిజర్వేషన్లు తదితర సౌకర్యాలు) మినహా ఇతర రాయితీలను వర్తింపజేస్తూ రాష్ట్ర షెడ్యూల్కులాల అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) జె.రేమండ్ పీటర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. షెడ్యూల్కులాల సహకార ఆర్థిక సంస్థ మంజూరు చేసే ఆర్థిక సహకార పథకాలతోపాటు, ఏయే పథకాలు షెడ్యూల్ కులాల(హిందువులు)వారికి వర్తిస్తాయో(చట్టబద్ధ హక్కులు మినహా) అవన్నీ ఎస్సీ కన్వర్డెడ్ క్రిస్టియన్లకు, బౌద్ధమతంలోకి మారిన వారికి కూడా వర్తింపజేస్తున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ (మైనారిటీస్) సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార ఆర్థికసంస్థ వైస్-చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ జీవోలో తెలిపారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటివి షెడ్యూల్కులాల వారికే వర్తిస్తాయని జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ రాయితీలను పొందేందుకు దళిత క్రైస్తవులు అనర్హులని స్పష్టం చేసింది. -
లోక్‌సభలో 'దళిత క్రైస్తవులు' ప్రత్యేక ప్రస్తావన
న్యూఢిల్లీః దళిత క్రై స్తవులను కేంద్రం ఆదుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన ప్రత్యేక ప్రస్తావనల కింద మాట్లాడారు. దళిత క్రై స్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. దళితులు ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారని లేదు. చాలా కులాలు, వర్గాలు పురాతన కాలం నుంచి వేర్వేరు మతాలను ఆచరిస్తున్నాయని వివరించారు. అలాగే క్రైస్తవ మతాన్ని కూడా కొన్ని వర్గాలు ఆచరిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని దళితుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పూర్తిగా మారలేదు. ఇప్పటికీ వారు కుల వివక్షకు గురవుతూనే ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు. వారు సామాజిక అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. ఆర్థికంగా, విద్యాపరంగా వారు వెనకబడి ఉన్నారని తెలిపారు. దళిత క్రై స్తవులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి దళితులతో సమానంగా ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్పారు. అందువల్ల దళితులతో సమానంగా దళిత క్రైస్తవులను గుర్తించి వారిని సామాజిక స్థితిగతుల్లో మార్పు తేవాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు. ** -
'క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'
ఉండి : క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రైస్తవులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డెల్టా ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్నే కాంక్షించేవారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదన్నారు. బిల్లులో ఎన్నో తప్పులున్నాయని, విభజన జరగకుండా న్యాయపోరాటం చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళతామని తాము ఆశిస్తున్నామన్నారు. కేంద్రంలో సమైక్యం కోరుకున్న వారితోనే పొత్తు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.