న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్‌కు, మైనారిటీల జాతీయ కమిషన్‌కు, భారత రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment