S A Bobde
-
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
చెక్ బౌన్స్ సత్వర పరిష్కారానికి సుప్రీం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. 1973, సీఆర్పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మున్ముందు కోర్టు హాళ్లూ చిన్నవి అవుతాయి
పణాజి: సాంకేతికత కారణంగా భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాలు, కోర్టు గదులు కూడా చిన్నవిగా మారి పోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. న్యాయం అందించే విషయంలో కరోనా మహమ్మారి పలు సవాళ్లు విసిరినప్పటికీ, ఆ పరిణామం కోర్టుల నవీకరణకు బాటలు వేసిందని ఆయన తెలిపారు. శనివారం పోర్వోరిమ్‌లో ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం కొత్త భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. ‘రవి శంకర్ ప్రసాద్ మంత్రిత్వం కారణంగానే కోర్టు గదులు చిన్నవిగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాను. అదేవిధంగా, భారీగా ఉండే కోర్టు పత్రాలను భద్రపరిచేందుకు చాలా గదులుండేవి. కానీ, ఈ–ఫైలింగ్, డేటా రాకతో ఇకపై పెద్ద సంఖ్యలో గదుల అవసరం కూడా ఉండదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కనీస ప్రమాణాలు, ప్రణాళికలను రూపొందించింది’అని ఆయన చెప్పారు. ‘మౌలిక వసతులపై చర్చించేటప్పుడు కొత్త భవనాల నిర్మాణం అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. ఇవి అవసరమే అయినప్పటికీ ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించాల్సి ఉంది’అని సీజేఐ అన్నారు. ముంబై హైకోర్టుకు కొత్త భవనం నిర్మించాలన్న ఆయన..‘అప్పట్లో కేవలం ఏడుగురు జడ్జీలకు మాత్రమే సరిపోయే విధంగా నిర్మించారు. కానీ, ఇప్పుడు అక్కడ 40 మందికి పైగా జడ్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు’అని వివరించారు. నాలుగున్నర శతాబ్ధాల ఘన చరిత్ర గోవా న్యాయవ్యవస్థకు ఉందని సీజేఐ జస్టిస్ బాబ్డే చెప్పారు. పోర్చుగీస్ పాలకులు ఆసియాలోనే మొట్టమొదటి హైకోర్టును 1544లో గోవాలోనే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. గోవా ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీల్లో తను కూడా ఉన్నానని, తనను కొందరు గోవా జడ్జీగా పేర్కొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జస్టిస్ రమణ ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ న్యాయ మౌలిక వసతుల కార్పొరేషన్ అవసరం ఉందని చెప్పారు. దీనిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఈ కొత్త కార్పొరేషన్ న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులకు అవసరమైన ఏకరూపకత, ప్రామాణీకరణను తెస్తుందని చెప్పారు. అన్ని కోర్టులకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, కోర్టు పత్రాల ఈ–ఫైలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వంటివి కూడా మౌలిక వసతుల కిందికే వస్తాయని వివరించారు. ‘శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో కోర్టులను నిర్వహిస్తున్న ఉదాహరణలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల రికార్డు గదులు కూడా ఉండటం లేదు. వాష్ రూంలు, వెయిటింగ్ గదులు లేని కోర్టు ప్రాంగణాలు కూడా ఉన్నాయి’అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా సాగుతుండటంతో కోర్టులను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లినట్లయిం దన్నారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు హాజరయ్యారు. -
ఎన్నికల బాండ్ల విక్రయానికి ఓకే చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్నికల బాండ్ల విక్రయానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 2018 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం నిరాటంకంగా జరుగుతోందని, ఇప్పుడు వీటిపై స్టే విధించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పశ్చిమబెంగాల్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఎన్నికల బాండ్లను విక్రయిస్తే షెల్ కంపెనీలు పుట్టుకొచ్చి రాజకీయ పార్టీలకు అక్రమ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అందుకే ఈ బాండ్ల విక్రయాలపై స్టే ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలు సంస్థల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల విదేశీ కంపెనీల నుంచి నిధులు పెద్ద ఎత్తున వచ్చి అవి దుర్వినియోగమవుతున్నాయని, ఆ అకౌంట్లలో పారదర్శకత కనిపించడం లేదని ఎడిఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై , కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకొనే ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఎన్నికల బాండ్ల విక్రయం చేపడుతున్నామని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటు 15 రోజుల వరకు మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీలు ఈ నిధులపై ఆదాయ పన్ను కూడా కట్టాలని అలాంటప్పుడు అక్రమ మార్గాల్లో నగదు వచ్చే అవకాశమే లేదని కేంద్రం పేర్కొంది. ఎన్నికల సంఘం కూడా బాండ్ల విక్రయానికి మద్దతు తెలపడంతో సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్‌పై... టాటా గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వెజ్ సోమవారం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎస్.రామసుబ్రమణియన్ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్ సెల్ తరఫున సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది. కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు. ‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్‌కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్‌పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. -
కొత్త సీజేఐ పేరును సూచించండి
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్‌గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ అత్యంత సీనియర్. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ఉంది. -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
పెళ్లి చేసుకోమని చెప్పలేదు: ఎస్ఏ బాబ్డే
న్యూఢిల్లీ: ‘‘మహిళలు అంటే మాకు చాలా గౌరవం.. వారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే. గతవారం ఓ అత్యాచార నిందితుడి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు.. ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రముఖ పౌరులు, మేధావులు, రచయితలు, కళాకారులు చీఫ్ జస్టిస్ బొబ్డేకు క్షమాపణ చెప్పాలని.. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగాలని కోరుతూ 5,000 మందికి పైగా ప్రజలు పిటిషన్లో సంతకం చేశారు. ఈ క్రమంలో వీటిపై ఎస్ ఏ బాబ్డే స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మేం నిందితుడిని ‘‘నీవు పెళ్లి చేసుకోబోతున్నావా’’ అని మాత్రమే ప్రశ్నించాము. అంతేతప్ప ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకో.. లేదంటే జైలుకెళ్తావ్’’ అని చెప్పలేదు. అలా ఎన్నిటికి చెప్పం. కోర్టు వ్యాఖ్యలని వక్రీకరించారు. ఈ సంస్థ, ముఖ్యంగా ఈ బెంచ్, స్త్రీత్వం పట్ల అత్యధిక గౌరవం కలిగి ఉంది’’ అని తెలిపారు. చదవండి: పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు వాళ్లిద్దరి మధ్య శృంగారాన్ని రేప్ అంటారా: సుప్రీం -
చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా?
న్యూఢిల్లీ: కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా అన్న అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల సభ్యులు, సెక్రటరీలు, అధికారుల పేర్లను గురువారంనాటికి తెలియజేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఆర్. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. వివిధ మంత్రిత్వశాఖల సెక్రటరీలు, అధికారులు, సంబంధిత వర్గాలతో చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కార అంశంపై చర్చించాల్సి ఉందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు పేర్కొనడంతో, అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. 35 లక్షల పెండింగ్ కేసులు... నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని ఫిబ్రవరి 25వ తేదీన సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు తిరిగి బుధవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్ఐ యాక్ట్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో ధర్మాసనం ఈ అంశంపై దృష్టి పెట్టింది. 247వ అధికరణ కింద (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వారం రోజుల్లో తెలియజేయాలని ధర్మాసనం గత నెల 25న అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యం లో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. -
లైంగిక వేధింపుల కేసు: గొగోయ్‌కి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన మీద నమోదైన సుమోటో లైంగిక వేధింపుల కేసును గురువారం సుప్రీం కోర్టు క్లోజ్ చేసింది. రంజన్ గొగోయ్‌పై నమోదైన కేసులో కుట్ర కోణం ఉండవచ్చని అనుమానించిన కోర్టు ఇలా చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. జస్టిస్ పట్నాయక్ కమిటీ, సీజేఐ ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ నివేదిక మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి ఉత్తర్వుల ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలు ఆయనపై కుట్రను ప్రేరేపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ గొగోయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని పట్నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ పొందలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఎన్ఆర్సీ లాంటి కేసుల్లో జస్టిస్ గొగోయ్ ఇచ్చిన తీర్పులపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రంజన్ గొగోయ్ కొన్ని కఠినమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలు విచారణర్హం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలను చేసినట్టు మేం అభిప్రాయపడ్డాం.. సుమోటాగా స్వీకరించిన ఈ కేసును మూసివేస్తున్నామని’’ కోర్టు స్పష్టం చేసింది. చదవండి: జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే యంత్రాంగమే ఎదుర్కోగలదు -
జస్టిస్ రాకేష్ జడ్జిమెంట్‌పై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, అమరావతి : మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరణమణకు ఒక్కరోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ రాకేష్ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఆ తర్వాత అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గతంలోనే న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. -
సడలని రైతుల ఆత్మస్థైర్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలి, అకాల వర్షాలు కురుస్తున్నా ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏమాత్రం వెనకడుగు పడే పరిస్థితులు కనిపించట్లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనను విరమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విపరీతమైన చలిని సైతం తట్టుకుంటూ వర్షం నుంచి తప్పించుకొనేం దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారమే జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. 26న ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. ఈ ట్రాక్టర్ మార్చ్‌లో సుమారు 20 వేల మంది పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రామ్‌రాజీ ధుల్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఈ ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేందుకు çపంజాబ్, హరియాణాల్లోని వేలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు మరిన్ని ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు రైతు నేతలు ప్రయత్నిస్తున్నారు. చర్చలపై, రైతుల సమస్యలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ విమర్శించింది. రేవారి వద్ద ఉన్న నిరసనకారులు, స్థానికుల మధ్య వివాదం సృష్టించేందుకు హర్యానా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో తమ పశువులను సైతం నిరసన స్థలికి తీసుకు వచ్చేందుకు వందలాదిమంది రైతులు సన్నాహాలు చేస్తున్నారు. చర్చలు జరగాలన్నదే మా ఆకాంక్ష: సుప్రీం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన విషయంలో పురోగతి లేదని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య చర్చలు జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పూ, పురోగతి కనిపించడం లేదని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, త్వరలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.చర్చలను కొనసాగించాలని ఈ సందర్బంగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ ప్రకటించారు. -
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను, లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుంది. -
నా సూచనలు సీజేఐకి మెయిల్ చేశా: ఉండవల్లి
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్‌లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు. -
రేవంత్ పిటిషన్ అశోక్ భూషణ్ బెంచ్‌కు బదిలీ
ఢిల్లీ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డె నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణం లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేతను అర్దరాత్రి చేపట్టారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కూల్చివేత చేపట్టారు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం అని పిటిషన్లో తెలిపారు. తాజగా గురువారం కేసు విచారణ సందర్భంగా సచివాలయం నిర్మాణాల కూల్చివేత పూర్తయిందా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పులో అభ్యంతరం ఏముందని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించారు. (చదవండి : తెలంగాణ వర్షాలపై స్పందించిన యూవీ) దీనికి సమాధానంగా సచివాలయం కూల్చివేత అనేది నూతన సచివాలయం నిర్మాణానికి సన్నద్దం చేయడమా కాదా అన్నది తేల్చాల్సి ఉందని శ్రావణ్ కుమార్ వివరించారు. అయితే కేసు విచారణ యోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చునని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చినందు వల్ల రేవంత్ రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని తుషార్ మెహతా వెల్లడించారు. సచివాలయం అంశంపై గతంలో జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ విచారణ జరపడంతో.. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అదే బెంచ్ కు బదిలీ చేస్తామని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ ప్రతిపాదనను తుషార్ మెహతా వ్యతిరేకించారు. కేసు విచారణ యోగ్యమైనది కాదు కాబట్టి బదిలీ అవసరంలేదని వాదించారు. దీనికి అంగీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ రేవంత్ రెడ్డి కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 26న జరిగే అవకాశం ఉంది. -
వారి కోసం 14న నీట్ నిర్వహణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్‌కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. -
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు ప్రముఖులు ట్విటర్ ద్వారా ఇలా స్పందించారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్) సీఎం వర్సెస్ సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాశారు. - బార్ అండ్ బెంచ్ [CM vs Supreme Court Judge] Andhra Pradesh Chief Minister YS Jagan Reddy writes to CJI SA Bobde. Complains that Justice NV Ramana is influencing the sittings of Andhra Pradesh High Court. @ysjagan @AndhraPradeshCM @JaiTDP pic.twitter.com/XYrdBTdWwK — Bar & Bench (@barandbench) October 10, 2020 ఇప్పుడు స్పష్టం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారాలు బహిర్గతం చేసినప్పటి నుంచి ఆయన సన్నిహితుడైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని ఇప్పుడు స్పష్టమైందని జగన్ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆరోపించారు. - పాయల్ మెహతా ఏపీలో పెద్ద కథ.. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబ అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపించారు. ఈ కథను నివేదించకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ దీనిని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - రాజ్‌దీప్ సర్దేశాయ్ Big story is brewing in Andhra: a CM has directly accused next SC chief justice’s family of corruption. So far there has been a strange HC gag order on reporting this story! Now @ysjagan seems to have decided to take the battle to the public and the SC! Watch this space! pic.twitter.com/LH0k60p14S — Rajdeep Sardesai (@sardesairajdeep) October 10, 2020 ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర : హిందుస్తాన్ టైమ్స్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కూల్చి వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఆరోపించిందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక వెబ్సైట్లో పూర్తి వివరాలతో ఓ కథనం ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట) జస్టిస్ రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఎన్వీ రమణ గతంలో టీడీపీ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, అదనపు అడ్వకేట్ జనరల్ అని ఆ లేఖలో వివరించారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసం అవినీతి వ్యవహారాలపై తొలి దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టే ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడం సహా తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వరుస తీర్పులు ఇచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ దశల్లో దాదాపు 30 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (పిల్) ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, జస్టిస్ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించారని ఆరోపించారు. జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి రమేష్, జస్టిస్ కె.లలిత, మరికొంత న్యాయమూర్తులు టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్పులిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటనతో పాటు సీఎం రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ కల్లం శనివారం ఆలస్యంగా మీడియాకు విడుదల చేశారు. (జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది
-
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా... అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్‌కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు. మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది... ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే.. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది. ► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్‌ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు. ► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్‌ను అనుమతించే దిశగా ప్రభావం. ► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కె. లలిత జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి. జస్టిస్ డి.రమేష్ జస్టిస్ రమేష్‌ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్‌కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది.. ► రమేష్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు. సత్యనారాయణ మూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్‌ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్‌లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు. జస్టిస్ డి.సోమయాజులు ► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్‌ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది. ► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని.. జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్‌ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్‌ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. 1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్ 2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్ 3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు 4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్‌ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్‌కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
సుప్రీంలో ‘కొత్త రోస్టర్’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్), లెటర్ పిటిషన్లు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు విచారించనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేసుల విచారణ విషయంలో కొత్త రోస్టర్ ఆఫ్ అసైన్మెంట్ను రూపొందించారు. నూతన రోస్టర్ విధానం ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది నవంబర్ 29న విడుదల చేసిన రోస్టర్ ప్రకారం.. ఇలాంటి పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. -
ఆ తీర్పుపై స్పష్టత అవసరం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు విషయంలో ఐదుగురు జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్పష్టత అవసరమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పులోని కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ దీనికి సంబంధించి నా మదిలో అనేక ప్రశ్నలు మెదలుతున్నాయి. ఈ విషయం గురించి నా సహోదరుల(న్యాయమూర్తులు)తో చర్చించాల్సి ఉంది. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు గందరగోళం సృష్టించేదిగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ 2014 జనవరి ఒకటిలోగా పూర్తయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనిపై మళ్లీ వివాదం సృష్టించడం చెల్లదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏడాది మార్చి 6న తీర్పు వెలువరించింది. దీనిపై బాధితులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.(చదవండి: మారటోరియం... 3 రోజుల్లో ‘కేంద్రం’ నిర్ణయం..!) -
జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు. ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు.