న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్), లెటర్ పిటిషన్లు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు విచారించనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేసుల విచారణ విషయంలో కొత్త రోస్టర్ ఆఫ్ అసైన్‌మెంట్‌ను రూపొందించారు. నూతన రోస్టర్ విధానం ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది నవంబర్ 29న విడుదల చేసిన రోస్టర్ ప్రకారం.. ఇలాంటి పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment