న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సీనియర్లు విచారించనున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ ఉన్నారు. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇందులో కోర్టు ధిక్కారం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, సోషల్ జస్టిస్ వంటి అంశాల కేసులు సీజేఐ పరిధిలో ఉంటాయి. ట్రాయ్, ఎంక్వైరీ కమిషన్, కంపెనీ లా వంటి వాటి కేసులను కూడా సీజేఐ తన పరిధిలోనే ఉంచుకున్నారు.
సాయుధ బలగాలు, పారామిలిటరీ, సాధారణ, క్రిమినల్ సివిల్ కేసులు, ట్రిబ్యునల్‌కు సంబంధించిన కేసులను ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భూ సేకరణలు, మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు, కొత్త విద్యా సంస్థలకు సంబంధించిన కేసులను జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ప్రభుత్వాలు, లోకల్ బాడీల కాంట్రాక్టులు, కేసుల లీజులు, ఫ్యామిలీ లా వంటి వ్యవహారాలను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment