న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అతడి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ సుప్రీంకోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే... విచారణ జాబితాలో ముఖేష్ పిటిషన్‌కు ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న వ్యక్తి.. అభ్యర్థన టాప్ ప్రియారిటీ కలిగి ఉంటుంది. ఈ విషయంలో మీరు రిజిస్ట్రీని ఆశ్రయించండి’’ అని ఆయన న్యాయవాదికి సూచించారు. కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వారిని ఉరితీయాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశాలు జారీచేసింది.(ఆ ముగ్గురికీ మరిన్ని అవకాశాలు ఉన్నాయా?)
ఇక ఇప్పటికే ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న దోషులు.. వారికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసి భంగపడ్డారు. చివరి ప్రయత్నంగా ముఖేష్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరగా.. ఆయన దానిని తిరస్కరించారు. అయితే ఉరిశిక్ష తేదీ దగ్గరపడుతున్న వేళ్ల ముఖేష్ మరోసారి న్యాయస్థానం తలుపు తట్టాడు. ఆర్టికల్32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా శనివారం సుప్రీంకోర్టును కోరాడు. దీంతో అతడి అభ్యర్థన పరిశీలనను వేగవంతం చేస్తామని కోర్టు సోమవారం తెలిపింది.(‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!)
Comments
Please login to add a commentAdd a comment