సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సోమవారం సాయంత్రం 5.00 గంటలలోపు న్యాయవాదుల అన్ని చాంబర్లను సీల్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వ్యక్తిగత వాదనలు ఉండవని స్పష్టం చేశారు. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతామని వెల్లడించారు. (లాక్‌డౌన్: ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి)
న్యాయవాదులు తమ ఆఫీసులో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరుకావాలి సీజే సూచించారు. ఈ ఆదేశాలను ప్రతి వారం సమీక్షిస్తామని, కోర్టుహాల్లో న్యాయవాదులు వ్యక్తిగతంగా హాజరు కావద్దని తెలిపారు. కోర్టులోకి ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే ఐడీ కార్డులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీజే ప్రకటించారు. కాగా దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న విషయ తెలిసిందే. ప్రజలంతా లాక్‌డౌన్ పాటించాలని కేంద్రం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment