
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే తప్పుకున్నారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ బాబ్డే ప్రకటించారు. దీంతో బుధవారం మరో బెంచ్ విచారణ చేపట్టనుంది. మరో కేసు.. కేసులో దోషిగా తేలిన రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నవారు రాజకీయ పార్టీలకు ఎలా నేతృత్వం వహిస్తారంటూ సుప్రీంలో దాఖలైన పిల్ విచారణ నుంచీ సీజేఐ తప్పుకున్నారు. లాయర్ అయిన జస్టిస్ బాబ్డే కుమార్తె ఇదే అంశంపై మరో విచారణ బెంచ్ ఎదుట వాదనలు వినిపించడంతో ఆయన కేసు విచారణ నుంచీ తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment