బెంగళూరు: కోర్టుల్లో విచారణను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథను వాడాల్సిఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే చెప్పారు. శనివారం బెంగళూరులో ఆయన మాట్లాడారు. జడ్జిలు, లాయర్లు కేసుల్లో కొన్ని విషయాలను వెదుక్కునేందుకు సమయం వృథా కాకుండా కృత్రిమ మేథ సహాయం తీసుకోవాల్సి ఉందన్నారు. లాయర్లు, జడ్జిలకు ఉపయోగపడేందుకు మాత్రమే కృత్రిమ మేధ ఉంటుందని, జడ్జిల ప్రమేయం లేకుండా టెక్నాలజీ ద్వారా తీర్పులు వెలువడే అవకాశం లేదన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను తగ్గించే ప్రయత్నం కూడా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment