సాక్షి, ముంబై : ఆదివారం వచ్చిందంటే చాలు దగ్గరలోని మైదానంలో వాలిపోయి ఇష్టమైన ఆటలతో సరదాగా గడిపేయడానికి చాలామంది ఇష్టపడతారు. స్టాప్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సివిల్ ఇంజనీర్ వరకు వారాంతంలో కాలక్షేపం కోసం అంతోకొంత సమయం వెచ్చిస్తారా. దీనికి తానేమీ అతీతున్ని కాదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే సైతం మైదానంలో కాలుమోపారు. ఎప్పుడూ కేసులతో బిజీబిజీగా ఉండే సీజే.. ఆదివారం సరదాగా గడిపారు. రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వచ్చిన బాబ్డే సహచరులతో కలిసి క్రికెట్ ఆడారు. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆల్ జడ్జ్‌స్ ఎలెవన్,-హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. 15 ఓవర్ల ఈ మ్యాచ్‌లో ఆల్ జడ్జ్‌స్ జట్టు తరుఫున బరిలోకి దిగిన బాబ్డే 18 పరుగులతో రాణించి.. మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. మ్యాచ్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment