
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment