Case Investigation
-
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా ఆగడాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ధనవంతులను తన అందంతో ట్రాప్ చేస్తున్న మాయా లేడీ.. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం భారత్‌కి రప్పిస్తోంది. విచారణలో పోలీసులే షాకయ్యే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.మంచి అమ్మాయిగా నటించి...విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.ఇంటికి రప్పించి.. నగ్నంగా ఫోటోలు తీసి..ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
జత్వానీ నుంచి జప్తు చేసిన ఆధారాలను భద్రపరచండి
సాక్షి, అమరావతి: సినీ నటి కాదంబరి జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన ఆధారాలను తదుపరి విచారణ వరకు జాగ్రత్త చేయాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.భారీగా డబ్బు గుంజారంటూ ఫిర్యాదుతనను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు సినీనటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఆమె తల్లి తదితరులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన జత్వానీ మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆమెకు వెనక్కి ఇవ్వకుండా జాగ్రత్త చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఫిర్యాదుదారు విద్యాసాగర్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బ్యాంకు ఖాతాల నిర్వహణకు అనుమతులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ చక్రవర్తి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తన హక్కుల పరిరక్షణ కోసం పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ప్రభుత్వం మారడంతో దాని ప్రభావం ఈ కేసుపై పడిందన్నారు. విద్యాసాగర్ జత్వానీ బాధితుడని, అయితే ఇప్పుడు పిటిషనర్‌ను నిందితునిగా, జత్వానీని బాధితురాలుగా చూపుతున్నారని వివరించారు. పిటిçÙనర్‌పై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఇప్పటివరకు సేకరించిన కీలక ఆధారాలన్నింటినీ పోలీసులు ధ్వంసం చేసు్తన్నారన్నారు. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఆమె పిటిషనర్‌ను ఏ విధంగా బెదిరించిందీ, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిందీ తదితర కీలక వివరాలున్నాయని తెలిపారు. జప్తు చేసిన ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళనకరమని, ఇదే జరిగితే పిటిషనర్‌కు తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. జత్వానీపై నమోదు చేసిన కేసులో ఆధారాలన్నింటినీ వారం పాటు భద్రపరచాలని దర్యాప్తు అధికారికి చెబుతానన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వారం గడువు కోరారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ డాబా కొట్ల జంక్షన్ వద్ద వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజిలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరితులు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలు»ొమ్మలుగా మారిన యువత వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు (శనివారానికి) రెండు రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజిలతో పోల్చి చూశారు. సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వారిని మరింత లోతుగా విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలినవారు అతనికి సహకరించినట్లు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడినవారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంతవరకు నమ్మవద్దని కోరారు. అప్పటివరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించవద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసువర్గాలు తెలిపాయి. -
నగదు అక్రమ రవాణాపైనా సిట్ నజర్!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు. ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
నకిలీ పాస్ పోర్ట్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: షిక గోయల్
-
ట్రంప్ అరెస్టయితే వాట్ నెక్ట్స్? అమెరికాలో కల్లోలం రేగుతుందా?
నన్ను అరెస్ట్ చేస్తారంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కల్లోలం రేగింది. శృంగార తారతో లైంగిక సంబంధాల్ని పెట్టుకొని 2016 ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరెత్తకుండా ట్రంప్ భారీగా డబ్బులు ముట్టజెప్పారన్న కేసును న్యూయార్క్ జ్యూరీ గత కొన్ని వారాలుగా రహస్య విచారణ సాగిస్తోంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ఆయనపై నేరాభియోగాలు నమోదవుతాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ లైంగిక సంబంధాల ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2006 ఏడాదిలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ట్రంప్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియెల్స్ ఒకప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. ట్రంప్ నిర్వహించే రియాల్టీ షో ‘ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి తనతో గడిపారని ఆరోపణలు గుప్పించారు. అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి హనీబంచ్ అని ముద్దుగా పిలిచేవారని చెప్పుకొచ్చారు. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలపై నోరెత్తకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కొహెన్ తొలుత ఈ డబ్బులు డేనియెల్స్‌కు చెల్లిస్తే, ఆ తర్వాత ట్రంప్ మైఖేల్‌కి డబ్బులు ఇచ్చారు. మైఖేల్ తనకు డబ్బులు ఇచ్చినట్టుగా డేనియల్స్ చెబుతూ ఉంటే, అవి లాయర్‌కి ఫీజు చెల్లించినట్టుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఏం జరగబోతోంది ? డబ్బులిచ్చి పోర్న్ స్టార్ నోరుమూయించారన్న ఆరోపణలపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఆధారాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆయన మాజీ లాయర్ కోహెన్ సాక్ష్యమిచ్చారు. డేనియెల్స్‌కు డబ్బులు ఇచ్చినట్టుగా కోర్టు ఎదుట అంగీకరించారు. మైఖేల్ కోహెన్‌కు లీగల్ అడ్వైజర్‌గా పని చేసిన రాబర్ట్ కోస్టెల్లో ఇన్నాళ్లూ ట్రంప్‌కు వ్యతిరేకంగా జ్యూరీలో మాట్లాడి ఇప్పుడు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది. ట్రంప్‌కి అనుకూలంగా సాక్ష్యమిచ్చినట్టుగా సమాచారం. ట్రంప్ కోర్టుకి హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రాండ్ జ్యూరీ ఏం చెయ్యాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒక కేసులో నిందితుడిని దోషిగా లేదంటే నిరపరాధిగా తేల్చే అధికారం గ్రాండ్ జ్యూరీకి ఉండదు. కేవలం ఆధారాలు సేకరించి నేరాభియోగాలు మోపగలదు. అయితే మన్హటన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఆధారాలుంటే నిందితుడ్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసుని నమోదు చేస్తారు. అదే జరిగితే తొలిసారి క్రిమినల్ కేసులుఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ అవుతారు. ఈ అభియోగాలు రుజువై ట్రంప్ దోషిగా తేలితే నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడతానని ప్రకటించిన ట్రంప్ ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. దేశాధ్యక్షుడిగా పోటీ పడే వ్యక్తి నేరచరిత్ర, జైలు జీవితం వంటి అంశాలపై అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్షుడయ్యే అవకాశం అభ్యర్థికి ఉంది. సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఈ నేరారోపణలు నైతికంగా ట్రంప్‌ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఓట్లు అడగడం, చర్చా కార్యక్రమంలో పాల్గొనడం వంటివి ప్రజల ఎదుట ఆయన స్థాయిని తగ్గిస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ దాడుల్ని తలపిస్తాయా? ట్రంప్ అరెస్ట్‌యితే దేశంలో ఆయన అనుచరులు ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తారోనన్న ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ తాను అరెస్ట్ అవుతానని, అందరూ నిరసనలకు దిగాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అశాంతిని రేపుతోంది. దేశాన్నే చంపేస్తోంది. ఇదే తగిన సమయం. మనందరం మేల్కోవాలి. గట్టిగా నిరసనకు దిగాలి’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. 2021 జనవరిలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల్లో అక్రమాల కారణంగానే తాను ఓడిపోయాయని ట్రంప్ భావించడం, ఆయన అనుచరులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి, హింసాకాండతో దేశం అట్టుడికిపోయింది. ఈసారి ట్రంప్ అనుచరులు న్యూయార్క్ కోర్టుపై దాడులకు తెగబడతారన్న అనుమానాలున్నాయి. మన్హటన్ న్యాయవాది బ్రాగ్ న్యూయార్క్ పోలీసులతో మాట్లాడి కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాల్సిందిగా రాసిన లేఖ ఒకటి మీడియాకు లభ్యమైంది. కోర్టులు, ఇతర కార్యాలయాలపై ఎవరి కన్ను పడినా, వారిని పూర్తిగా విచారించే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉంది. ట్రంప్ ఎదుర్కొంటున్న ఇతర కేసులు ♦ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ప్రభుత్వ రహస్య పత్రాలను ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తీసుకునివెళ్లారన్న ఆరోపణలపై కేసు విచారణ కొనసాగుతోంది. ♦ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాతఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్అనుచరులు 2021 జనవరి 6నఅమెరికన్ క్యాపిటల్ భవనంపై దాడి చేసి హింసాకాండ సృష్టించిన కేసు. ♦ 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా ట్రంప్, ఆయన అనుచరులబృందం నడుచుకున్నట్టు నమోదైన కేసు. -
సీబీఐ సక్సెస్ రేటు అంతంత మాత్రం: సుప్రీం
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాను విచారణ చేపట్టిన కేసుల్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటోందని సుప్రీం కోర్టు పేర్కొంది.సీబీఐ తమ లోటుపాట్లను గుర్తించి సంస్థని బలోపేతం చేయడానికి ఏయే చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, ఎంఎం సుందరేశ్‌ల డివిజన్ బెంచ్ ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో నిందితులకు శిక్ష పడేలా ఎన్ని కేసుల్ని విజయవంతంగా వాదించిందో ఆ వివరాలను ఆరు వారాల్లోగా అందించాలని సీబీఐ డైరెక్టర్ని ఆదేశించింది. -
అది కేసును ప్రభావితం చేసే కుట్రే
సాక్షి, అమరావతి: సీఐడీ అధికారులు తన సెల్‌ఫోన్ తీసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే కుట్రతోనే ఆయన ఇలా చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. కేసు విచారణలో భాగంగా ఏదైనా వస్తువును జప్తు చేసే చట్టబద్ధమైన అధికారం దర్యాప్తు అధికారులకు ఉందనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు మాట్లాడ కూడదని.. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది విచారణను ప్రభావితం చేయడం కిందకు వస్తుందని చెబుతున్నారు. కేవలం విచారణను తప్పుదారి పట్టించాలనే దురుద్దేశంతోనే రఘురామకృష్ణరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు భారత శిక్షా స్మృతిలోని నిబంధనలను న్యాయ నిపుణులు ప్రధానంగా ఉదహరిస్తున్నారు. జప్తు చేసే విశేష అధికారాలు సెక్షన్ 102 ప్రకారం నేరంతో సంబంధం ఉందని అనిపించిన వస్తువులను జప్తు చేసే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. దర్యాప్తు సమయంలో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పటికప్పుడు తటస్థ సాక్షులతో నిమిత్తం లేకుండా జప్తు చేసే విశేష అధికారాలు కూడా అధికారులకు ఉన్నాయి. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని సార్లు కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు వెళ్లినప్పుడు జప్తు చేసిన వస్తువుల గురించి విచారణ అధికారికి తెలియజేయాలి. విచారణ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానానికి సమర్పిస్తామని లిఖిత పూర్వకంగా తెలియజేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సమర్పించవచ్చు సెక్షన్ 167 ప్రకారం జప్తు చేసిన వస్తువుల గురించి రిమాండ్ రిపోర్ట్‌తో పాటు సమర్పించాలని లేదు. కేసు విచారణలో భాగంగా ఎప్పుడైనాసరే సమర్పించవచ్చు. న్యాయస్థానానికి తరలించడానికి అవకాశం ఉన్న వస్తువుల జప్తు గురించి తర్వాత అయినా సరే ప్రస్తావించవచ్చు. తరలించడానికి అవకాశం లేనివాటి గురించి అప్పటికప్పుడు చెప్పాలి. రఘురామకృష్ణరాజు కేసులో సెల్‌ఫోన్ అన్నది న్యాయస్థానానికి తరలించదగిన వస్తువే కాబట్టి దాని గురించి తర్వాత చెప్పే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. ఆ వస్తువుల గురించి నిందితుడు మాట్లాడరాదు సెక్షన్ 165 ప్రకారం దర్యాప్తు అధికారులు జప్తు చేసిన వస్తువుల గురించి నిందితుడు మాట్లాడకూడదు. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఈ దృష్ట్యా తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని రఘురామకృష్ణరాజు ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. జప్తు చేసిన వస్తువులు అన్నింటి గురించి కూడా దర్యాప్తు అధికారులు వెంటనే ప్రస్తావించాలని కచ్చితమైన నిబంధన లేదు. కొన్ని సార్లు వివిధ కారణాలతో అన్ని వస్తువుల గురించి ప్రస్తావించలేకపోవచ్చు. తర్వాత చార్జ్‌షీట్ నమోదు చేసినప్పుడుగానీ ప్రత్యేక మెమో వేసిగానీ ఆ వస్తువుల జప్తు గురించి న్యాయస్థానానికి తెలియజేసే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. రఘురామకృష్ణరాజు వాదన అసంబద్ధం తన సెల్‌ఫోన్‌ను జప్తు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం అసంబద్ధంగా ఉంది. దాని గురించి విచారణ సమయంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు రఘురామకృష్ణరాజు మాట్లాడటం నిబంధనలకు వ్యతిరేకం. కేవలం దర్యాప్తు అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. జప్తు అంశాల్లో లోటుపాట్లను సాకుగా చూపించి కేసు నుంచి తప్పించుకోలేరని పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ బల్బీర్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. – కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది -
రేప్ కేసుల విచారణ తీరుపై ‘సుప్రీం’ కమిటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. -
ప్రలోభపెట్టాలనుకున్నారు: జస్టిస్ ఇందిరా
న్యూఢిల్లీ: హోటల్ రాయల్ ప్లాజాకు సంబంధించిన కేసులో తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ చెప్పారు. ఆగస్టు 30న కోర్టులో ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రాతో కలిసి వాదనలు వింటున్న సందర్భంగా జస్టిస్ బెనర్జీ ఈ విషయం చెప్పారు. ఎవరో వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఇలాంటి ప్రయత్నాలను చాలా సీరియస్‌గా పరిగణిస్తామని ఆమె హెచ్చరించారు. 5న పూర్తిస్థాయి మహిళా బెంచ్ విచారణ.. సుప్రీంకోర్టు మరో అరుదైన ఘటనకు వేదిక కానుంది. అందరూ మహిళా జడ్జీలే ఉన్న బెంచ్ సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో కేసుల విచారణను చేపట్టనుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీల బెంచ్ బుధవారం కేసులను విచారించనుంది. ఇంతకుముందు జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌ల బెంచ్ 2013లో తొలిసారి సుప్రీంలో కేసులను విచారించిన పూర్తిస్థాయి మహిళా బెంచ్గా చరిత్ర సృష్టించింది. -
ఐఎస్సీ సేవలు షురూ
ప్రయోగాత్మకంగా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ - బుధవారం నుంచి ప్రారంభమైన ఐఎస్సీ సేవలు - వివిధ కేసుల దర్యాప్తులో దిశానిర్దేశానికి ఏర్పాటు - ప్రతి ఠాణాకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయింపు - వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన నగర కొత్వాల్ సాక్షి, హైదరాబాద్: నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును మెరుగుపరచడం, శిక్షల శాతం పెంచడం లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్(ఐఎస్సీ) బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా పని చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్ని విభాగాలు, పోలీసుస్టేషన్ల అధికారులకు ఐఎస్సీ పనితీరును వివరించారు. ప్రస్తుతం నగరానికి మాత్రమే సేవలందిస్తున్న దీని పరిధిని రాష్ట్ర స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ దర్యాప్తు అధికారికి ఎలాంటి సందేహం వచ్చినా నివృత్తి చేయడానికి అనువుగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత లోపాలను సరిచేసి సిటీలో శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువస్తారు. రెండో దశలో రాష్ట్రంలోని అన్ని విభాగాలు, ఠాణాలకు సేవలు అందించనున్నారు. మూడు కోణాలూ ఎంతో కీలకం.. ఏదైనా నేరం జరిగినప్పుడు ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించడం, దర్యాప్తు చేయడం నుంచి అభియోగపత్రాలు దాఖలు చేయడం వరకు మూడు కోణాలు అత్యంత కీలక భూమిక పోషిస్తుంటాయి. ప్రాథమికంగా పోలీసులకు సంబంధించిన మాన్యువల్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు దీన్ని అనుసరిస్తూనే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటూ వాటిని పక్కాగా అమలు చేయాల్సిందే. ఈ రెండింటికీ మించి ఘటనాస్థలి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలంటే దానికీ కొన్ని నియమనిబంధనల్ని పాటించాల్సిందే. పోలీసు, లీగల్, ఫోరెన్సిక్.. ఈ 3 కోణాలను పరిగణనలోకి తీసుకుంటూ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే కేసుల దర్యాప్తు మధ్యలోకి వచ్చేసరికో, అభియోగపత్రాలు దాఖలు చేసేటప్పుడో కేసు దర్యాప్తులో ఈ మూడింటికీ మధ్య పొంతన లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే ఐఎస్సీ రూపుదిద్దుకుంది. కేసులపై బదిలీల ప్రభావం ఉండదు.. పోలీసు అధికారులను నిర్దిష్ట సమయాల్లో బదిలీ చేయడం సాధారణం. అయితే ప్రస్తుతం ఓ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి బదిలీ అయితే.. ఆయన స్థానంలోకి వచ్చిన వారే ఆ బాధ్యతలు స్వీకరించాలి. ఇలా కొత్తగా వస్తున్న వారికి ఆ కేసుపై పట్టు ఉండట్లేదు. ఫలితంగా సగం పక్కాగా సాగిన దర్యాప్తు ఆపై లొసుగులతో సాగుతోంది. న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పే సమయంలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలకు ఐఎస్సీ పరిష్కారంగా నిలవనుంది. ఓ కేసు నమోదైనప్పటి నుంచి ప్రతి దశలోనూ దీనిపై సెంటర్ అధికారులకు పరిజ్ఞానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు మారినా కేసులు పక్కాగా ముందుకు సాగేలా ఐఎస్సీ నిపుణులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాల్‌సెంటర్ మాదిరిగా ఐఎస్సీ.. నగర పోలీసు కమిషనరేట్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఐఎస్సీలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు, నిపుణులే ఉంటారు. పదవీ విరమణ చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఇద్దరు న్యాయ నిపుణులు, మరో ఇద్దరు ఫోరెన్సిక్/క్లూస్ ఎక్స్‌పర్ట్‌లను నియమించారు. ఒక్కో షిఫ్ట్‌లో ముగ్గురు చొప్పున రెండు షిఫ్టుల్లో 24 గంటలూ ఐఎస్సీ లో అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినప్పటి నుంచి ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేసే వరకు ఎలాంటి అనుమానం వచ్చినా ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఫోన్‌కాల్, వీడి యో కాన్ఫరెన్స్, చాటింగ్‌లతో పాటు హైదరా బాద్ పోలీసు కాప్ యాప్ ద్వారానూ నిపుణుల్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. దీనికోసం ప్రతి ఠాణాకు ఓ ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించారు. -
నయీమ్ అనుచరుల్లో గుబులు
పీడీయాక్ట్.. నయీమ్ అనుచరుల్లో గుబులు రేపుతోంది. గ్యాంగ్‌స్టర్ కేసు దర్యాప్తును పోలీస్ యంత్రాంగం ముమ్మరం చేయడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. సిట్‌పై నమ్మకం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడం.. అదే సమయంలో సీబీఐకి అప్పగించాలనే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సాక్షి,యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరులు మరో ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరంతా భువనగిరికి చెందినవారే. వీరిలో మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ నాసర్, బచ్చు నాగరాజు, కత్తుల జంగయ్య, పులి రాజు, సరిగడ హరిపై పీడీయాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు గత ఏడాది ముఖ్య అనుచరులైన భువనగిరికి చెందిన పాశం శ్రీను, ఎస్కె షకీల్, భువనగిరి జెడ్పీటీసీ సందెల సుధాకర్‌పై పీడీయాక్ట్ నమోదు అయింది. ఇందులో ఎస్కె షకీల్ గుండెపోటుతో మృతిచెందారు. కాగా మిగతా ఇద్దరు పీడీయాక్ట్‌తో పాటు పలు కేసుల్లో వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతని అనుచరులపై సుమారు 174 కేసులు నమోదయ్యాయి. ఇందులో 124 మందిని వివిధ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలు, భూకబ్జాలు, బలవంతపు వసూళ్లు, అక్రమ ఆయుధాలు సరఫరా చేశారనే అభియోగాలతో పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ప్రతిపక్షాల విమర్శలు.. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈనేపథ్యంలో ఇటీవల హైకోర్టుకు సిట్ అధికారులు సమర్పించిన నివేదికలో గ్యాంగ్‌స్టర్‌కు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు పోలీసు అధికారులు నయీమ్‌తో కలిసి భోజనాలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మరోసారి నయీమ్ కేసు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నయీమ్ కేసు విషయంలో వెనుకడుగు వేసిందన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నయీమ్ కేసులో ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని నయీమ్ కేసును సీబీఐకి అప్పగించేదిలేదని తేల్చేశారు. నిందితులు వీరే పీడీయాక్ట్ నమోదు అయిన వారిలో అబ్దుల్ నాసర్ టీడీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన ఆయన జనవరి30న మున్సిపల్ సమావేశానికి హాజరై సంతకం చేసి వెళ్లారు. ఈయన నయీమ్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా చలామణి అయ్యారు. ∙కత్తుల జంగయ్య, పులి నాగరాజు ఇద్దరు నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు అనుచరులుగా ఉన్నారు. పాశం శ్రీను చెప్పినట్లుగా వ్యాపారుల వద్దకు వెళ్లి నయీమ్ బెదిరింపులకు డబ్బులు తేవడం, బాధితులకు ఫోన్లు చేసి బెదిరించడం వీరి ప్రధాన వృత్తి. బచ్చు నాగరాజు ఓ సెల్ ఫోన్ షాపును నిర్వహిస్తుంటాడు. నాగరాజు తన షాపుకు వచ్చే వారి వివరాలతో కొత్త సిమ్ కార్డులను తీసుకుని నేరుగా పాశం శ్రీనుకు అందజేస్తాడు. దీంతో అ సీమ్ కార్డులు నేరుగా నయీం వద్దకు వెళ్తాయి. అ సీమ్ కార్డులను అనుచరుల వద్ద ఉంటాయి. ఇందులో భాగంగానే బచ్చు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి జైలుకు పంపారు. సరగడ హరి పట్టణంలోని గంజ్మార్కెట్కు వెళ్లే ఓ ఆలయం వద్ద ఉంటూ పూజలు చేస్తుంటాడు. ప్రధానంగా గంజ్మార్కెట్లో డబ్బులు ఎక్కువగా ఉండే షాపుల యాజమానుల వివరాలు తెలుసుకుని నేరుగా నయీమ్‌కు చేరవేస్తాడని పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. -
పెండింగ్’ సమస్యలు!
సంపాదకీయం: కేసు విచారణలో ఎడతెగని జాప్యం జరిగితే శిక్ష విధింపులో కనికరం చూపవచ్చని సుప్రీంకోర్టు రెండురోజులక్రితం ఇచ్చిన తీర్పు ఎందరికో ఉపశమనం కలగ జేస్తుంది. ఓడిపోయినవాడు కోర్టులోనే ఏడిస్తే... కేసు నెగ్గినవాడు ఇంటికెళ్లి ఏడుస్తాడన్న నానుడి ఇప్పటిది కాదు. కాలదోషం పట్టిన నిబంధనలు కావొచ్చు... కావాలని విచారణను జాప్యం చేయడం కోసం ‘వేలికేస్తే కాలికి... కాలికేస్తే వేలికి’ అన్నట్టు వ్యవహరించే న్యాయవాదులవల్ల కావొచ్చు... తగిన సంఖ్యలో న్యాయమూర్తులను నియమించలేని మన పాలకుల చేతగానితనంవల్ల కావొచ్చు...మన దర్యాప్తు విభాగాల తీరుతెన్నులవల్ల కావొచ్చు పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతున్నది. సర్వోన్నత న్యాయస్థానంనుంచి కింది కోర్టు వరకూ దాదాపు మూడున్నర కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక అంచనా. సుప్రీంకోర్టులో 65,661 కేసులు, దేశంలోని 21 హైకోర్టుల్లో 44,34,191 కేసులు పెండింగ్‌లో ఉంటే కింది కోర్టుల్లో మరో మూడు కోట్ల కేసులు వాయిదాల్లో నడుస్తున్నాయి. ఇందులో క్రిమినల్ కేసుల వాటా కూడా తక్కువేమీ కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15, 20 సంవత్సరాల్లో పెండింగ్ కేసులు 15 కోట్లు దాటినా ఆశ్చర్యంలేదని నిపుణులు చెబుతారు. ఒక నేరానికి విచారణ జరిపి శిక్ష ఖరారుచేయాల్సి ఉండగా...అసలు విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా పరిణమించడం ఒక వైచిత్రి. ఇందుకు కారణాలు అనేకానేకం. అడపా దడపా ఇచ్చే తీర్పుల్లో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. లా కమిషన్ నివేదికల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు వెలువడుతూనే ఉంటాయి. కానీ, పరిస్థితి మాత్రం ‘ఎక్కడేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉంది. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించడానికి ముందురోజు ఇటలీ మెరైన్ల కేసులో సాగుతున్న జాప్యంపై ఆ దేశం నిరసన వ్యక్తంచేసింది. రెండేళ్లుగా తమ మెరైన్లు ఇద్దరూ జైళ్లలో మగ్గుతున్నారని, ఇంతటి జాప్యం జరిగింది గనుక వారిద్దరినీ బేషరతుగా విడుదలచేయాలని మన సుప్రీంకోర్టును కోరింది. కేరళ తీరంలో సముద్ర దొంగలుగా భావించి ఇద్దరు జాలర్లను కాల్చిచంపిన కేసులో ముద్దాయిలైన ఈ మెరైన్లపై ఇంతవరకూ చార్జిషీటే దాఖలు చేయలేదంటే మన దర్యాప్తు విభాగాల తీరు ఎలా ఉన్నదో అర్ధమవుతుంది. ఎఫ్ఐఆర్ దాఖలుకు రెండేళ్ల సమయం పట్టడం విచిత్రమే అయినా మన వ్యవస్థలోని సంక్లిష్టత కారణంగా అది వేరే రకంగా ఉండటం సాధ్యంకాదని విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారంటే ఎంతటి నిస్సహాయత అలుముకొని ఉన్నదో అర్ధమవుతుంది. ఏళ్లకేళ్లు సాగుతున్న విచారణలు నిరుపేదల మూల్గులు పీలుస్తున్నాయి. అసలు ఎలాంటి నేరమూ చేయనివారూ, కొన్ని సందర్భాల్లో తాము చేసిన నేరమేమిటో కూడా తెలియనివారూ సంవత్సరాలతరబడి జైళ్లలో మగ్గుతున్నారు. వారి కుటుంబసభ్యులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. కేవలం మూడు నెలల శిక్షపడే కేసుల్లో కూడా విచారణ తేలక పదేళ్లుగా జైల్లో మగ్గుతున్నవారున్నారు. ఒకవేళ ఏనాటికైనా విచారణ పూర్తయి అలాంటివారంతా నిర్దోషులుగా బయటపడితే వారు కోల్పోయిన స్వేచ్ఛాయుత జీవనానికి ప్రభుత్వాలు తగిన పరిహారం చెల్లిస్తాయా అంటే అదీ లేదు. అసలు మన జైళ్లలో ఉన్నవారిలో 70శాతంమంది విచారణలో ఉన్న ఖైదీలేనని ఒక సర్వేలో వెల్లడైంది. ఎప్పటికీ తేలని కేసులవల్ల పేదవర్గాలవారు సమస్యలు ఎదుర్కొంటుంటే... డబ్బూ, పలుకుబడీ ఉన్నవారికి అదొక వరంగా మారుతున్నది. విచారణ పెండింగ్‌లో ఉండటాన్ని చూపి అలాంటివారు బెయిల్ తెచ్చుకుని స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి బాధితులు యధావిధిగా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కేసుల విచారణకు అవసరమైనంతమంది న్యాయమూర్తులు కొరవడటం పెండింగ్ కేసులకు ముఖ్యమైన కార ణమనడంలో సందేహం లేదు. మన జనాభాకు అనుగుణమైన రీతిలో న్యాయమూర్తుల సంఖ్య లేదు. పది లక్షలమంది జనాభాకు 14మంది న్యాయమూర్తులున్నారని ఒక అంచనా. సుప్రీంకోర్టులో 15శాతం, హైకోర్టుల్లో 30 శాతం, కింది కోర్టుల్లో దాదాపు 25 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కేసుల వెనక మనుషులు, వారి విలువైన జీవితాలు ఉంటాయన్న ఎరుక లేనివారివల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. జవాబుదారీతనం ఉంటే దీన్ని చాలావరకూ సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఏదో కారణాన్ని చూపి వాయిదాలు కోరే న్యాయవాదులు, ఆ విషయంలో ఉదారంగా వ్యవహరించే న్యాయమూర్తులవల్ల కూడా జాప్యం జరుగుతుందని మరువరాదు. సకాలంలో సమకూడని న్యాయం అన్యాయం కిందే లెక్కని వేరే చెప్పనవసరంలేదు. సంస్థాగతంగా తమలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా న్యాయస్థానాలకుంటుంది. నిజానికి ఆ దిశగా సుప్రీంకోర్టు ఇప్పటికే కొంత కృషి చేసింది. విచారణలో జాప్యాన్ని నివారించమని సందర్భం వచ్చినప్పుడల్లా కింది కోర్టులకు సూచిస్తూనే ఉంది. తాజా తీర్పు ఇవ్వడానికి కారణమైన కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ సంగతే చెప్పింది. ఒక సివిల్ తగాదా పరిష్కారానికి కింది కోర్టుల్లో సగటున 15 సంవత్సరాలు, క్రిమినల్ కేసు సగటున పదేళ్లు పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేసింది. ఆ కేసుల్ని సవాల్ చేసిన పక్షంలో వాటి పరిష్కారానికి మరో పదేళ్లు పడుతున్నదని కూడా తెలిపింది. నిర్దిష్ట కాలావధిలో దర్యాప్తు, విచారణ ప్రక్రియలు పూర్తికావాలన్న నిబంధన విధిస్తేతప్ప దీన్ని సరిదిద్దడం అసాధ్యం. కనుక ఆ దిశగా కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
ఐదేళ్ళుగా సాగుతున్న జంటహత్యల కేసు విచారణ
-
నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణ!
రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం న్యూఢిల్లీ: నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణను పూర్తిచేయడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అవినీతి నిరోధక సవరణ బిల్లు-2013ను సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మంత్రులు సహా ప్రభుత్వాధికారులపై తగిన కోర్టులో ఫిర్యాదు చేసినట్లయితేనే ప్రభుత్వం వారి విచారణకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వాధికారులపై విచారణకు అనుమతించే విషయాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత యంత్రాంగం మూడు నెలల్లో తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అటార్నీ జనరల్ లేదా అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదింపుల తర్వాత ఈ గడువును గరిష్టంగా మరో నెలరోజులు పొడిగించొచ్చు. అవినీతి కేసులకు సంబంధించి ప్రభుత్వాధికారులపై విచారణకు సంబంధిత శాఖకు చెందిన మంత్రి అనుమతి ఇస్తారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులపై విచారణకు ప్రధాని అనుమతి ఇస్తారు. 2జీ కేసులో మాజీ మంత్రి రాజాపై విచారణకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని 16 నెలలు గడిచినా, ప్రధాని కార్యాలయం స్పందించలేదంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వానికి అక్షింతలు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ముందుకు తెచ్చింది.