జత్వానీ నుంచి జప్తు చేసిన ఆధారాలను భద్రపరచండి | Secure the confiscated evidence from Jatwani | Sakshi
Sakshi News home page

జత్వానీ నుంచి జప్తు చేసిన ఆధారాలను భద్రపరచండి

Published Thu, Sep 5 2024 4:49 AM | Last Updated on Thu, Sep 5 2024 4:49 AM

Secure the confiscated evidence from Jatwani

దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశం

జత్వానీ ఫోన్లలో కీలక సమాచారాన్ని పోలీసులు ధ్వంసం చేస్తున్నారు

వాటిని భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కుక్కల విద్యాసాగర్‌ పిటిషన్‌

సాక్షి, అమరావతి: సినీ నటి కాదంబరి జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన ఆధారాలను తదు­పరి విచారణ వరకు జాగ్రత్త చేయాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవ­హారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచార­ణను ఈనెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

భారీగా డబ్బు గుంజారంటూ ఫిర్యాదు
తనను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు సినీనటి కాదంబరి నరేంద్ర కుమార్‌ జత్వానీ, ఆమె తల్లి తదితరులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన జత్వానీ మొబైల్‌ ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉప­కరణాలను ఆమెకు వెనక్కి ఇవ్వకుండా జాగ్రత్త చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఫిర్యాదు­దారు విద్యాసాగర్‌ మంగళవారం హైకోర్టులో పిటి­షన్‌ దాఖలు చేశారు. 

ఆమె బ్యాంకు ఖాతాల నిర్వ­హణకు అనుమతులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ చక్రవర్తి బుధవారం విచారణ జరి­పారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయ­వాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తన హక్కుల పరిరక్షణ కోసం పిటిషనర్‌ ఈ వ్యా­జ్యం దాఖలు చేశారన్నారు. ప్రభుత్వం మారడంతో దాని ప్రభావం ఈ కేసుపై పడిందన్నారు. విద్యాసాగర్‌ జత్వానీ బాధితుడని, అయితే ఇప్పుడు పిటిషన­ర్‌ను నిందితునిగా, జత్వానీని బాధి­తురాలుగా చూపు­తున్నారని వివరించారు. పిటిç­Ùనర్‌పై తప్పుడు కేసు పెట్టారన్నారు. 

ఇప్ప­టివరకు సేకరించిన కీలక ఆధారాలన్నింటినీ పోలీ­సులు ధ్వంసం చేసు­్తన్నారన్నారు. జత్వానీ నుంచి స్వాధీనం చేసు­కున్న ఫోన్లలో ఆమె పిటిషనర్‌ను ఏ విధంగా బెది­రించిందీ, బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు వసూలు చేసిందీ తదితర కీలక వివరాలున్నా­యని తెలిపారు. జప్తు చేసిన ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకర­ణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తు­న్నారని, ఇది తీవ్ర ఆందోళ­నకరమని, ఇదే జరిగితే పిటి­షనర్‌కు తీరని నష్టం జరుగుతుందన్నారు. 

ప్రభుత్వం తర­ఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. జత్వానీపై నమోదు చేసిన కేసులో ఆధారాలన్నింటినీ వారం పాటు భద్రప­రచాలని దర్యాప్తు అధికారికి చెబుతా­నన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వారం గడువు కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement