న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాను విచారణ చేపట్టిన కేసుల్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటోందని సుప్రీం కోర్టు పేర్కొంది.సీబీఐ తమ లోటుపాట్లను గుర్తించి సంస్థని బలోపేతం చేయడానికి ఏయే చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ ఎస్.కె.కౌల్, ఎంఎం సుందరేశ్‌ల డివిజన్ బెంచ్ ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో నిందితులకు శిక్ష పడేలా ఎన్ని కేసుల్ని విజయవంతంగా వాదించిందో ఆ వివరాలను ఆరు వారాల్లోగా అందించాలని సీబీఐ డైరెక్టర్‌ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment