జస్టిస్ ఇందిరా బెనర్జీ
న్యూఢిల్లీ: హోటల్ రాయల్ ప్లాజాకు సంబంధించిన కేసులో తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ చెప్పారు. ఆగస్టు 30న కోర్టులో ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రాతో కలిసి వాదనలు వింటున్న సందర్భంగా జస్టిస్ బెనర్జీ ఈ విషయం చెప్పారు. ఎవరో వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఇలాంటి ప్రయత్నాలను చాలా సీరియస్‌గా పరిగణిస్తామని ఆమె హెచ్చరించారు.
5న పూర్తిస్థాయి మహిళా బెంచ్ విచారణ..
సుప్రీంకోర్టు మరో అరుదైన ఘటనకు వేదిక కానుంది. అందరూ మహిళా జడ్జీలే ఉన్న బెంచ్ సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో కేసుల విచారణను చేపట్టనుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీల బెంచ్ బుధవారం కేసులను విచారించనుంది. ఇంతకుముందు జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌ల బెంచ్ 2013లో తొలిసారి సుప్రీంలో కేసులను విచారించిన పూర్తిస్థాయి మహిళా బెంచ్‌గా చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment