influence
-
ఈశాన్యంతో 34 శాతం అధిక వర్షం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ ఏడాది 34 శాతం అదికంగానే వర్షం పడింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక చలి పులి దెబ్బకు జనం గజగజ వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా ఈశాన్య రుతుపవనాలు ఆశా జనకంగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏదో ఒక తుఫాన్, వాయుగండం ప్రళయాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చి రాగానే చైన్నె, శివారు జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా పవనాలు విస్తరించారు. ఈ సీజన్లో సుమారు తొమ్మిది అల్పపీడనాలు బయలు దేరాయి. ఇందులో నాలుగు తమిళనాడు మీద తీవ్రంగానే దాడి చేశాయి. ఇందులో పెంగల్ తుపాన్ తాండవానికి పొరుగున ఉన్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటూ రాష్ట్రంలోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాలో వరుణ తాండం అంతాఇంతా కాదు. వరదలు పోటెత్తి గ్రామాలను ముంచేశాయి. ఆ తదుపరి తిరునల్వేలి, తెన్కాశి తదితర జిల్లాల మీద తీవ్ర అల్పపీడనం ప్రభావాన్ని చూపించాయి. ప్రధానంగా డెల్టాలోని నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో అయితే సాధారణం కంటే రెట్టింపుగా వర్ష పాతం నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య సీజన్ ముగింపుదశకు చేరింది. ఈ సీజన్లో రాష్ట్రంలో కడలూరు జిల్లాలో అధిక వర్షం పడింది. అతి తక్కువ వర్షం తూత్తుకుడిలో నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ సీజన్లో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 57 సెం.మీ వర్షం కురిసింది. తిరుపత్తూరులో 25 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 45 సెం.మీ వర్షం కురిసింది. కృష్ణగిరిలో 27 సెం.మీ వర్షంకు బదలుగా 49 సెం.మీ పడింది. విల్లుపురంలో 50 సెం.మీ కురవాల్సి ఉండగా 88 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి, కాంచీపురం తదితర జిల్లాల్లోనూ సాధాకరణం కంటే అధికంగానే వర్షం పడింది. చైన్నెలో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా అదనంగా 10 సెం.మీ కురిసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తగా 34 శాతం అధికంగానే వర్షాన్ని ఈశాన్య రుతు పవనాలు తీసుకొచ్చాయి. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక క్రమంగా మంచు దుప్పటితో పాటుూ చలి ప్రభావం రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చలి క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. -
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు:‘ హత్యాచార’ నిందితుడి తల్లి..
దేశానికి రాజైనా తల్లికి కొడుకే చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, ఈ నేరానికి సంబంధించి సివిల్ వాలంటీర్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది, భారతదేశం అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఈ హత్యాచారానికి పాల్పడ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని నిందితుడి తల్లి చెప్పింది. సమాజం వెలివేసింది...‘‘నా కుమార్తెలు ఎవరూ ఇంటికి రాలేదు. పరిచయస్తులు నలుగురూ నన్ను విడిచిపెట్టారు’’అని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘నా కొడుకును కలవడానికి నన్ను ఎవరూ తీసుకెళ్లలేదు. నా కోడలు, నా కూతుళ్లు ఇప్పుడు ఎవరూ రావడం లేదు. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో నాకు తెలియదు ’’అని ఆమె చెప్పింది. తనకు అన్నం వండిపెట్టడంతో సహా రాయ్ తనని చక్కగా చూసుకునేవాడంది. ‘‘నాకు చాలా అందమైన కొడుకు, అందమైన కుటుంబం ఉండేది. నా భర్త మరణంతో, ప్రతిదీ మారిపోయింది, నా అందమైన కుటుంబం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే’’ అంటూ ఆవేదనగా చెప్పింది.సంజయ్ రాయ్ కళాశాల గ్రాడ్యుయేట్ అని ఎన్సిసి కార్ప్‌లో కూడా భాగమని అతని తల్లి వెల్లడించింది. ‘‘సంజయ్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. అతని తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడు. బహుశా నేను ఇంకా కఠినంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు’’ అని తల్లి చెప్పింది.భార్య చనిపోవడంతోనే దారి తప్పాడు...సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అతని ‘దుష్ప్రవర్తన‘ కారణంగా అతని మునుపటి ముగ్గురు భార్యలు అతనిని విడిచిపెట్టారని వారు చెబుతున్న విషయాలని అతని తల్లి ఖండించింది. తన కొడుకు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. ‘‘సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి. వారిరువురూ సంతోషంగా ఉండేవారు. అకస్మాత్తుగా, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. దాంతో వారి ఆనందం తాత్కాలికంగా మారింది’’ అని ఆమె గుర్తుచేసుకుంది. ఇష్టమైన భార్య దూరం కావడంతో రాయ్ డిప్రెషన్లోకి వెళ్లాడని మద్యం తాగడం ప్రారంభించాడని అయితే ఆ అలవాటును తాను అంగీకరించలేదని ఆమె పేర్కొంది. ‘‘ఒకరోజు బాగా మందు తాగి వచ్చాడు.. బాధపడకు, మనం వేరొకరిని చూద్దాం’ అని తాను ఓదార్చానని... భార్య దూరమైతే విచారం కలగడం సహజం. కానీ మద్యం తాగవద్దని, టీ తాగమని చెప్పానని వివరించింది. అతను మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి మాట వినేవాడు, ’’అంటూ ఆమె గుర్తు చేసుకుంది.ఆ రాత్రి తిండి తినకుండా వెళ్లాడు...హాస్పిటల్లో రాయ్ కార్యకలాపాల గురించి తనకు తెలియదని అతను తన అనుమానాలను పెంచేలా అసాధారణంగా ఎప్పుడూ ప్రవర్తించింది లేదని ఆమె నొక్కి చెప్పింది. అతను ఎప్పుడూ అనుమానం వచ్చేలా ఏమీ చేయలేదు, కాబట్టి తాను అప్రమత్తంగా లేనని తెలిపింది. ‘ ఘటన జరిగిన రోజు రాత్రి అతను డిన్నర్ చేయలేదు, ’నేను ఆసుపత్రికి వెళ్తున్నాను’ అని మాత్రం నాకు చెప్పాడు,‘ అన్నదామె. తన కొడుకు ప్రమాదకరం కాదని చెప్పింది. ‘‘ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షించబడతాడు. లేక నా కొడుకే నేరం చేసి ఉంటే, దేవుడు అతన్ని శిక్షిస్తాడు’’ అంటూ స్పష్టం చేసింది. కొడుకుని కలిసే అవకాశం వస్తే.. ‘నేను అతనిని కలిస్తే ’బాబూ, ఎందుకు ఇలాంటి పని చేసావు?‘ అని అడుగుతానంటూ ఆమె చెప్పింది. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
రత్నాలు–ఆభరణాల వాణిజ్యంపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ వివాదం భారత్– ఇజ్రాయెల్ మధ్య రత్నాలు, ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు సోమవారం తెలిపారు. 2021–22లో భారత్ రెండు దేశాల మధ్య రత్నాలు, ఆభరణాల వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ విలువ 2.04 బిలియన్ డాలర్లుగా ఉంది. కట్, పాలి‹Ù్డ వజ్రాలు భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. తర్వాతి స్థానంలో ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల వాటా ఉంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా కఠిన (రఫ్) వజ్రాలను దిగుమతి చేసుకుంటోంది. 2022–23లో సరుకులు, సేవల రంగాలలో మొత్తం భారతదేశం–ఇజ్రాయెల్ వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23లో ఇజ్రాయెల్ నుండి భారత్‌కు జరిగిన ఒక్క సరుకు ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లు. వెరిసి ఇది 6.1 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో డీజిల్, కట్, పాలి‹Ù్డ వజ్రాలు ఉన్నాయి. దిగుమతుల్లో రఫ్ డైమండ్స్, కట్ అండ్ పాలి‹Ù్డ డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, టెలికం పరికరాలు, పొటాషియమ్ క్లోరైడ్, హెర్బిసైడ్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది. నిపుణులు ఏమన్నారంటే... ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులపై తాజా పరిణామాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్క డ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావచ్చు. రఫ్ వజ్రాలకు దేశంలో కొరత ఏర్పడే వీలుంది. – కొలిన్ షా, కామా జ్యువెలరీ ఎండీ ఇజ్రాయెల్‌లోని మూడు అతిపెద్ద నౌకాశ్రయాలు – హైఫా, అష్డోద్, ఈలత్లలో కార్యకలాపాలు అంతరాయం కలిగితే ఆ దేశంతో భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎగుమతులకు ప్రతికూల పరిణామం ఇది. – అజయ్ శ్రీవాస్తవ, జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు ఈ వివాదం స్వల్పకాలంలో భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. యుద్ధం తీవ్రతరం అయితే, ఆ ప్రాంతానికి ఎగుమతులు జరిపే ఎగుమతిదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. – శరద్ కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ -
ఛత్తీస్‌గఢ్‌లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తే.. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్ ఆదివాసీ సమాజ్ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. రాయ్‌పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. చదవండి: ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
చైనా దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం
ఒక దెబ్బకు రెండు పిట్టలు. డ్రాగన్ కంట్రీ దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం తీసుకుంది ఉత్తర అమెరికా దేశం కెనడా. ఈ మేరకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారీగా వెచ్చించ్చనున్నట్లు కెనడా ప్రకటించింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బాగా తగ్గించాలనే ఆలోచనలో కెనడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఈ ప్రభావంతో ఈ రీజియన్‌లో తమ బలాన్ని పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆదివారం ఉదయం కీలక ప్రకటన చేశారు. కెనడా తన పసిఫిక్ వాణిజ్య సంబంధాలను చైనాకు మించి విస్తరించడానికి చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంపై కెనడా కన్నేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా కెనడా తరపున 1.7 బిలియన్ డాలర్ల ఖర్చు చేయబోతున్నట్లు మెలానీ జోలీ ప్రకటించారు. ఆ డబ్బును ఇండో-ఫసిఫిక్ రీజియన్‌లో మరింత నౌకాదళ గస్తీ కోసం, మెరుగైన నిఘా కోసం, సైబర్ సెక్యూరిటీ చర్యలకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు.. తూర్పు-దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ప్రాంతీయ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. చైనా లక్ష్యంగా.. ఈ ప్రకటనకు ముందు ఆమె బ్లూమ్‌బర్గ్ న్యూస్‌తో గంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. యూరప్‌తో సుదీర్ఘకాలంగా తమ అనుబంధం కొనసాగుతోందని.. ఇక ఇప్పుడు ఫసిఫిక్‌పై దృష్టిసారించాల్సిన అవసరం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా తీరును ఖండిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగానే తమ చర్యలు ఉండబోతున్నాయంటూ ఇంటర్వ్యూలో దాదాపుగా మాట్లాడారామె. అంతకు ముందు శుక్రవారం ఆమె మాంట్రియల్లో మాట్లాడుతూ.. ‘‘ చైనా విషయానికి వస్తే.. యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము మా ఆటను కొనసాగిస్తాం’’ అంటూ ఆమె దూకుడు ప్రకటన చేశారు. ఇండోనేషియా బాలి జీ20 సదస్సు సందర్భంగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాళ్ల మధ్య జరిగిన భేటీ సారాంశం మీడియాకు లీక్ కావడంపై జిన్‌పింగ్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో తప్పేం ఉందంటూ స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు ట్రూడో. -
విజయపథం: ఆలోచనే ఆదాయం
చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘రమ్య రామచంద్రన్... యంగ్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘హుపల్’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య. యాక్టివ్ సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్టైమ్ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుంటూ ఉండేది. ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది. ‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్‌ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య. ‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్ మాటలు నిజం కదా. -
చిన్న హాబీయే, కానీ లక్షలు సంపాదించి పెడుతోంది
పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, ఆటలంటే చాలా ఇష్టపడే అమ్మాయి మాసూమ్ మీనావాలా మెహతా. అనుకోకుండా ఫ్యాషన్‌పై మక్కువ ఏర్పడడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతో కలసి పనిచేస్తూ ఫ్యాషన్ బ్లాగర్, ఎంట్రప్రెన్యూర్గానే గాక ఇండియన్ లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది. తన ఫ్యాషన్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో పదిలక్షలకు పైగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన మాసూమ్ మీనావాలా బాంబే స్కాటిష్ స్కూల్లో చదువుకుంది. స్కూల్లో ఆమెను అందరూ ‘టామ్‌బాయ్’ అని పిలిచేవారు. ఆటల్లో చురుకుగా ఉండే మాసూమ్ స్కూల్ పుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేది. ఇంటర్మీడియట్లో ఉండగా ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దీంతో తను రోజూ ఫ్యాషనబుల్‌గా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టుచేసేది, కానీ∙ఫ్యాషన్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బీకామ్ అయ్యాక, ఆర్ట్స్ కోర్సులో డిప్లామా చేసేందుకు చేరినప్పటికీ.. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో తరువాత బ్రాండ్ మార్కెటింగ్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆ తరువాత లండన్‌లోని ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫ్యాషన్ స్టైలింగ్‌లో డిప్లొమా చేసింది. ఈ సమయంలోనే ఫ్యాషన్ ప్రపంచం లో ఎదగాలని నిర్ణయించుకుంది. కోర్సు పూర్తయ్యాక ముంబై తిరిగి వచ్చి 2010లో ‘మిస్ స్టైల్ ఫియస్టా’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రారంభించి సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ఫ్యాషన్ ఇండియా లో దొరకడంలేదు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ను ఇక్కడ పరిచయం చేయాలనుకుని స్టైల్ ఫియస్టాలో ఎక్కువ గా అంతర్జాతీయంగా ట్రెండ్ అవుతోన్న ఫ్యాషన్‌ను పరిచయం చేసేది. దాంతో అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇష్టపడేవారంతా ఫియస్టాను ఫాలో అయ్యేవారు. ఫాలోవర్స్‌తోపాటు ఆమె ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకపక్క మిస్ స్టైల్ ఫియస్టా నడుపుతూనే మరోపక్క అంతర్జాతీయ ఫ్యాషన్, లగ్జరీ, బ్యూటీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లపై డిజిటల్ కంటెంట్‌ను రూపొందించేది. జిమ్మీచూ, యవెస్ సెయింట్ లారియెంట్, డియోర్, హక్కాసన్, గుస్సి, స్టెల్లా మెక్కార్ట్నీ, జో మలోని, ఈస్టీ లాడర్, రా ప్రెసరీ వంటి బ్రాండ్లతో కలసి పనిచేసేది. మాసూమ్ ఫ్యాషన్స్టైల్, పనితీరు నచ్చిన వోగ్, కాస్మోపాలిటన్, సీఎన్ఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అనేకసార్లు ఆమెను అభినందించాయి. సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎన్నో మ్యాగజీన్ల కవర్లపై మాసూమ్ ఫోటో రావడం విశేషం. మోస్ట్ స్టైలిష్ బ్లాగర్‌గా... ఇప్పటిదాకా డిజిటల్ ఎంట్రప్రెన్యూర్, కాస్మోపాలిటన్ ఈ–టెయిలర్ ఆఫ్ ద ఇయర్, హెచ్ఎస్బీసీ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, పల్లాడియం స్పాట్లైట్ ఎథినిక్ బ్లాగర్ ఆఫ్ ది ఇయర్, ఇండియాస్ బెస్ట్ లగ్జరీ ఫ్యాషన్ బ్లాగర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఫర్ సోషల్ సమోసా 30 అండ్ 30, ‘మోస్ట్ స్టైలిష్ బ్లాగర్’ వంటి అనేక అవార్డులను అందుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, అబు జైన్ అండ్ సందీప్ ఖోస్లా, సబ్యసాచి వంటి వారితో కలిసి పనిచేసింది. ‘‘చిన్న హాబీగా ప్రారంభించిన నా ఫ్యాషన్ చాలామంది ఫాలోవర్స్‌కు నచ్చడం... వాళ్లనుంచి పాజిటివ్ కామెంట్లు రావడంతో నన్ను ఎంతో ప్రోత్సహించినట్లు అయింది. ఒక ఆర్టిస్ట్ తన భావోద్వేగాలు, ఆలోచనలను పెయింటింగ్స్ రూపంలో ఎలా వ్యక్తం చేస్తారో.. నేను ఆ విధంగానే ఫ్యాషన్ గురించిన ఐడియాలు, అభిప్రాయాలు, డ్రెస్సింగ్ గురించి చెప్పేదాన్ని. దీంతో నా బ్లాగ్ ఫాలో అయ్యేవారికి మరింత నాణ్యతతో కూడిన కంటెంట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని మాసూమ్ చెప్పింది. -
Mamta Sharma Das: అమ్మానాన్న ఉన్నా అనాథనే అనుకునేది!
నెట్లో స్టార్ అవడానికి ఆడిషన్లు అక్కర్లేదు. ఏ ఇండస్ట్రీతోనూ కుటుంబ బంధాలు అవసరం లేదు. స్క్రీన్‌పై ఒకసారి కనిపిస్తే రెండోసారి చూడాలనిపించేలా వస్త్రధారణ, ‘హాయ్..’ అంటూ మొదలు పెట్టగానే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చక్కటి పలు వరసలాంటి మాట వరస ఉంటే చాలు అంటున్నారు మమత. అమ్మాయిలకైతే ఈ విద్య మరీ తేలికట! ట్రై చేయమని అంటున్నారు. తర్ఫీదు అవసరం లేదంటున్నారు. అదృష్టాన్ని నిర్మించుకోవడం అనే మాటను మీరు ఎప్పుడూ విని ఉండరు. అదృష్టం అంటే ‘కట్టుకోవడం’ కాదు. ‘కలిసిరావడం’. అయితే వైరుధ్యం చూడండి! మమతా శర్మ దాస్ కట్టుకున్న దుస్తులు ‘స్టెయిలిస్ట్’గా, పదిమందిని కలుపుకొని పోవడం ‘ఇన్ఫ్లుయెన్సర్’గా ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీనర్థం ఆమె తన అదృష్టాన్ని తనే నిర్మించుకున్నారని! అమ్మాయిలకు తను చెప్పే మాట కూడా ఇదే. ‘‘గర్ల్స్.. మంత్రముగ్ధుల్ని చేసే వస్త్రధారణ, మనసుకు హత్తుకునే మాట తీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మీ మాట విని మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మించిన ‘ఇన్ఫ్లుయెన్సర్’ ఎవరూ ఉండరు’’ అంటారు మమత. ∙∙ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇంకా.. నెట్‌లోని అనేక వేదికల మీద మనకు కబుర్లు చెప్పి, మనసు దోచే వాళ్లంతా ఇన్ఫ్లుయెన్సర్లే. అయితే అదేమీ నేర్చుకోవలసినంత పెద్ద ఆర్ట్ కాదని మమత అంటున్నారు. సహజంగానే ప్రతి అమ్మాయిలోనూ ఉండే కళేనట అది! మమత ఇన్ఫ్లుయెన్సర్, స్టెయిలిస్ట్, బ్రాండింగ్ కన్సల్టెంట్ కూడా! ఒక బ్రాండ్‌ను అమ్మిపెట్టడానికి కంపెనీలకు సలహా ఇవ్వడం ఇది. ‘వీవ లా వీదా’ అనే ఒక సొంత ఫ్యాషన్ సామ్రాజ్యానికి ఆమె మహరాణి కూడా. వీవ లా వీదా అంటే ‘జీవితం వర్థిల్లాలి’ అని. జీవితాన్ని ఏ కళతోనైనా వర్థిల్లేలా చేసుకోవచ్చు. అది మన వరకు. బయట కొన్ని వందల, వేల, లక్షల జీవితాలను వర్థిల్లేలా చేసే కళ మాత్రం ఇన్ఫ్లుయెన్సింగ్. మమతకు ఏడేళ్ల కూతురు ఉంది. రోజంతా ఇద్దరి మధ్య మాటలే మాటలు. ఆ కూతురు ఈ తల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందట! ‘‘దీన్ని బట్టి మీకేమి అర్థమౌతోంది? వయసు సంబంధం లేకుండా ఎవరైనా ఎవర్నైనా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యొచ్చు’’ అని నవ్వేస్తారు మమత. ఆమేమీ కెరియర్ని ప్లాన్ చేసుకుని ఈ దారిలోకి రాలేదు. కొంత జీవితాన్నైతే చూశారు. బహుశా ఆ చూడటం ఆమెను ఇటువైపు తిప్పిందేమో.. మనుషులతో ఏదైనా షేర్ చేసుకోవాలని, వాళ్లకు సంతోషం కలిగించాలని, వాళ్ల బాధను తొలగించాలనీ! ఎందుకు అలా అనిపించింది? ∙∙ మమత కోల్‌కతాలో పుట్టారు. కుటుంబ పరిస్థితులతో, సమాజంతో, చివరికి తనతో తను ఘర్షణ పడుతూ పెరిగారు. తల్లిదండ్రులది మతాంతర వివాహం. తల్లి, తండ్రి, తమ్ముడు, తను! తల్లీదండ్రి బాగానే ఉండేవారు. బయట ఎవరన్నా ఒక మాట అంటే అది వినొచ్చి ఒకరితో ఒకరు ఘర్షణ పడేవారు. ఆ ఘర్షణ మమతకు బాగుండేది కాదు. అమ్మానాన్న ఉన్న అనాథను అని చాలాసార్లు అనుకునేది. తమ్ముడికి, తనకు వయసులో పదేళ్ల వ్యత్యాసం. వాడు పసితనంలో ఉండగానే తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కటే చిన్న ఉద్యోగం చేస్తూ ఇద్దర్నీ పెంచింది. మాటలు వస్తున్నప్పుడు తమ్ముడు మొదట తనను ‘మా’ అని పిలిచాడట. తర్వాత ఆ పిలుపు అలాగే కొనసాగింది. బంధాలు వరసల్ని బట్టి కాకుండా దగ్గరితనాన్ని బట్టి ఏర్పడతాయి అంటారు మమత. ఇన్ఫ్లుయెన్సర్గా మనం ప్రపంచంతో ఆ దగ్గరతనాన్ని పెంచుకోవాలి అని చెబుతారు. 34 ఏళ్ల మమతకు చిన్న వయసులోనే ఇన్ఫ్లుయెన్సర్గా పెద్ద పేరు వచ్చింది. నెటిజెన్స్‌కి ఆమెపై గురి కుదరడం అందుకు కారణం. ఒక బ్రాండ్‌కి కన్సల్టెంట్‌గా ఉన్నప్పుడు సాధారణంగా కంపెనీ దృష్టినుంచే ఇన్ఫ్లుయెన్సర్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మమత తన ఫాలోవర్స్ వైపు నుంచి బ్రాండ్‌ని ఎనలైజ్ చేస్తారు. కస్టమర్ ఫ్రెండ్లీ. కంపెనీకి ఆమె కావాలి. ఆమెకు కస్టమర్లు కావాలి. ఆ కావాలి అనుకోవడమే మమతను స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ను చేసింది. ‘‘ఉల్లాసం, ఉత్సాహం, నేర్చుకోవాలన్న తపన, నేర్పాలన్న అభిలాష ఉంటే చాలు. మీరు నెట్ సెలబ్రిటీ అయిపోయినట్లే’’ అంటారు మమత. -
ప్రలోభపెట్టాలనుకున్నారు: జస్టిస్ ఇందిరా
న్యూఢిల్లీ: హోటల్ రాయల్ ప్లాజాకు సంబంధించిన కేసులో తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ చెప్పారు. ఆగస్టు 30న కోర్టులో ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రాతో కలిసి వాదనలు వింటున్న సందర్భంగా జస్టిస్ బెనర్జీ ఈ విషయం చెప్పారు. ఎవరో వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఇలాంటి ప్రయత్నాలను చాలా సీరియస్‌గా పరిగణిస్తామని ఆమె హెచ్చరించారు. 5న పూర్తిస్థాయి మహిళా బెంచ్ విచారణ.. సుప్రీంకోర్టు మరో అరుదైన ఘటనకు వేదిక కానుంది. అందరూ మహిళా జడ్జీలే ఉన్న బెంచ్ సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో కేసుల విచారణను చేపట్టనుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీల బెంచ్ బుధవారం కేసులను విచారించనుంది. ఇంతకుముందు జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌ల బెంచ్ 2013లో తొలిసారి సుప్రీంలో కేసులను విచారించిన పూర్తిస్థాయి మహిళా బెంచ్గా చరిత్ర సృష్టించింది. -
భారీగా దెబ్బతిన్న కొనుగోళ్ల సెంటిమెంట్..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న ఇండియాస్ బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ తొలిసారిగా భారీగా పడిపోయింది. గత ఏడాది జూలై నెలలో 0.43గా ఉన్న బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ ప్రతీ నెలా పెరుగుతూ నవంబర్ నాటికి 0.68 పాయింట్లుకు చేరుకోగా, నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ నాటికి ఈ ఇండెక్స్ 0.26 పాయింట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 3,000 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మూడు నెలలకు ఒకసారి ఈ ఇండెక్స్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ క్రమేపీ పెరుగుతూ వస్తోందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు ప్రకటన చేసిన తర్వాత ఈ సెంటిమెంట్ తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈవో ఎన్.చంద్రమౌళి పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిసారి జీతాలు అందుకున్న డిసెంబర్ నెలలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అన్నిటికంటే అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో కొనుగోళ్ల సెంటిమెంట్ దెబ్బతినగా అత్యల్పంగా హైదరాబాద్‌లో దెబ్బతింది. కానీ వీటికి భిన్నంగా అహ్మదాబాద్‌లో మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్ పెరగడం గమనార్హం. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో ఢిల్లీలో బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ 122 శాతం పడిపోయింది. ఆ తర్వాత కోల్‌కతా 90 శాతం, ముంబై 58 శాతం, పూణే 46 శాతం, చెన్నై 35 శాతం, బెంగళూరు 16 శాతం, హైదరాబాద్ 15 శాతం క్షీణించాయి. కానీ ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రం ఇండెక్స్ 17 శాతం పెరగడం విశేషం. -
ప్రభావితం చేసే ఆ 11 పుస్తకాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పైకొచ్చిన వారు, అంటే వాణిజ్యవేత్తలు, రాజకీయవేత్తలు, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు తీరిక వేళల్లో ఎలాంటి పుస్తకాలు చదువుతారు, 2016 సంవత్సరంలో వారు ఏయే పుస్తకాలు చదివారు? వాటిలో వారిని ప్రభావితం చేసిన పుస్తకాలేవి? చదవాల్సిందిగా పాఠకులకు వారు సిఫార్సు చేసే పుస్తకాలేవి? 62 మంది అలాంటి ప్రముఖులను సోషల్ మీడియా ఫేస్బుక్ ప్రశ్నించగా 236 పుస్తకాలను వారు సూచించారు. వాటిలో 11 పుస్తకాలను చాలా ఎక్కువ మంది సూచించారు. అవి.. 1. సెపియన్స్ (మానవులు):మానవుల పుట్టు పూర్వోత్తరాలు, మానవ జాతుల గురించి వివరించే ఈ పుస్తకాన్ని ఎక్కువ మంది చదివారు. చదవాల్సిందిగా సూచించారు. దీన్ని యువల్ నోవా హరారీ రాశారు. 2. ఆరిజనల్స్: ప్రపంచంలో మార్పులకు దోహదపడిన సంప్రదాయేతర సజనశీలురు గురించి ఈ నవల వివరిస్తుంది. దీన్ని న్యూయార్క్ టైమ్స్ రైటర్ ఆడమ్ గ్రాంట్ రచించారు. 3. టీమ్ ఆఫ్ టీమ్స్: ఈ సంక్లిష్ట ప్రపంచంలో ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయం సాధించవచ్చో వివరించే పుస్తకం. అటు ఆర్మీపరంగా, ఇటు వ్యాపారం పరంగా మంచి పుస్తకమని మన్ననలందుకున్న ఈ పుస్తకాన్ని జనరల్ స్టాన్లీ మ్యాక్క్రిస్టల్ రాశారు. 4. హిల్‌బిల్లీ ఎలిగి: అమెరికాలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున సమయంలో ఒహాయో రాష్ట్రంలో ఓ కుటుంబం జీవనం, వారి సంస్కతికి సంబంధించిన జ్ఞాపకాలను కళ్లకుకట్టే ఈ నవలను జేడీ వాన్స్ రచించారు. 5. ది ఇండస్ట్రీస్ ఆఫ్ ది ఫ్యూచర్: రానున్న పదేళ్లలో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వచ్చే వప్లవాత్మక మార్పుల వల్ల భవిష్యత్ పరిశ్రమలు ఎలా ఉండబోతున్నాయో అవిష్కరించే ఈ పుస్తకాన్ని అలెక్స్ క్రాస్ రాశారు. ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి చూడాల్సిన అవసరం లేదని చెప్పే థీమ్. 6. ఫ్రీకానామిక్స్: పదేళ్లక్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ పారిశ్రామికవేత్తలను, పలు రంగాలకు చెందిన ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధునిక ప్రపంచానికి కొత్త నిర్వచనం ఇచ్చే ఈ పుస్తకాన్ని స్టీఫెన్ డూబ్నర్, స్టీఫెన్ లెవిట్ రచించారు. 7. రైటింగ్ మై రాంగ్స్: ఓ హత్య కేసులో జైలుకెళ్లిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని నేరం కారణంగా అంచనా వేయలేమని, క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు రావాలని అభిలషించే ఈ పుస్తకాన్ని శాకా షెంగార్ రచించారు. 8. ది జీన్: జన్యువలపై ఆధారపడే మానవులు వాటిని జయించి ఎలా జీవించవచ్చో వివరించి శాస్త్రవిజ్ఞాన నవల. దీన్ని ‘క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ అవార్డు అందుకున్న సిద్ధార్థ ముఖర్జీ రచించారు. 9. ఎడ్యూరెన్స్: అట్లాంటిక్ సముద్రాన్ని పశ్చిమ తీరం నుంచి ఉత్తర తీరానికి షాకల్టన్ పడవలో సాగించే సాహస యాత్రకు సంబంధించిన కథ. ధైర్య సాహసాలకు, నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తిగా నిలిచే ఈ పుస్తకాన్ని ఆల్ఫ్రెడ్ లాన్సింగ్ రాశారు. 1954లో తొలి ముద్రణ వెలువడింది. 10: డెలివరింగ్ హ్యాపినెస్: వ్యాపారంలో ఎలా విజయాలు సాధించారో, ఆ తర్వాత జీవితాన్ని ఎలా అందంగా మలుచుకున్నారో, మన చుట్టూ ఉన్న అందాలను ఎలా ఆస్వాదించాలో రచయిత టోనీ సై ఈ పుస్తకంలో వివరిస్తారు. 11:కాన్సియస్ బిజినెస్: వ్యాపారంలో కూడా విలువలుతో విలువలను ఎలా సష్టించవచ్చో తెలిపే పుస్తకం. మానసిక చేతనే గొప్ప నాయకత్వాన్ని ఇస్తుందని చెబుతున్న ఈ పుస్తకాన్ని ఫ్రెడ్ కోఫ్మన్ రాశారు. ఈ ఫేస్బుక్ అభిప్రాయ సేకరణలో బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బిజినెస్‌కు సంబంధించిన పుస్తకాలనే కాకుండా టెన్నీస్, రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలను కూడా చదువుతారు. -
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ హల్చల్
-
’సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’