న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ వివాదం భారత్– ఇజ్రాయెల్ మధ్య రత్నాలు, ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు సోమవారం తెలిపారు. 2021–22లో భారత్ రెండు దేశాల మధ్య రత్నాలు, ఆభరణాల వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ విలువ 2.04 బిలియన్ డాలర్లుగా ఉంది. కట్, పాలి‹Ù్డ వజ్రాలు భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి.
తర్వాతి స్థానంలో ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల వాటా ఉంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా కఠిన (రఫ్) వజ్రాలను దిగుమతి చేసుకుంటోంది. 2022–23లో సరుకులు, సేవల రంగాలలో మొత్తం భారతదేశం–ఇజ్రాయెల్ వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23లో ఇజ్రాయెల్ నుండి భారత్‌కు జరిగిన ఒక్క సరుకు ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లు.
వెరిసి ఇది 6.1 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో డీజిల్, కట్, పాలి‹Ù్డ వజ్రాలు ఉన్నాయి. దిగుమతుల్లో రఫ్ డైమండ్స్, కట్ అండ్ పాలి‹Ù్డ డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, టెలికం పరికరాలు, పొటాషియమ్ క్లోరైడ్, హెర్బిసైడ్‌లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది.
నిపుణులు ఏమన్నారంటే...
ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులపై తాజా పరిణామాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్క డ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావచ్చు. రఫ్ వజ్రాలకు దేశంలో కొరత ఏర్పడే వీలుంది.
– కొలిన్ షా, కామా జ్యువెలరీ ఎండీ
ఇజ్రాయెల్‌లోని మూడు అతిపెద్ద నౌకాశ్రయాలు – హైఫా, అష్డోద్, ఈలత్‌లలో కార్యకలాపాలు అంతరాయం కలిగితే ఆ దేశంతో భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎగుమతులకు ప్రతికూల పరిణామం ఇది.
– అజయ్ శ్రీవాస్తవ, జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు
ఈ వివాదం స్వల్పకాలంలో భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. యుద్ధం తీవ్రతరం అయితే, ఆ ప్రాంతానికి ఎగుమతులు జరిపే ఎగుమతిదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
– శరద్ కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment