Gems and jewellery
-
వృద్ధిలో రత్నాలు–ఆభరణాల రంగం కీలకం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలో రత్నాలు, ఆభరణాల రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రత్నాలు, ఆభరణాల ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రత్నాలు– ఆభరణాల రంగం ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తుంది. ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది’’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి పేర్కొన్నారు. భారత్ ఆభరణాల తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లలో సమస్యలను ఎదుర్కొంటున్నారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తమ ఆభరణాల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా తయారీదారులు, వ్యాపారులు ప్రపంచ వజ్రాభరణాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించగలరన్న విశ్వాసాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. 15–22 తేదీల్లో షాపింగ్ ఫెస్టివల్ కాగా, ఆభరణాల తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఎగుమతిదారుల అత్యున్నత స్థాయి మండలి– జీజేసీ అక్టోబర్ 15 నుంచి 22వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. -
రత్నాలు–ఆభరణాల వాణిజ్యంపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ వివాదం భారత్– ఇజ్రాయెల్ మధ్య రత్నాలు, ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు సోమవారం తెలిపారు. 2021–22లో భారత్ రెండు దేశాల మధ్య రత్నాలు, ఆభరణాల వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ విలువ 2.04 బిలియన్ డాలర్లుగా ఉంది. కట్, పాలి‹Ù్డ వజ్రాలు భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. తర్వాతి స్థానంలో ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల వాటా ఉంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా కఠిన (రఫ్) వజ్రాలను దిగుమతి చేసుకుంటోంది. 2022–23లో సరుకులు, సేవల రంగాలలో మొత్తం భారతదేశం–ఇజ్రాయెల్ వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23లో ఇజ్రాయెల్ నుండి భారత్‌కు జరిగిన ఒక్క సరుకు ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లు. వెరిసి ఇది 6.1 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో డీజిల్, కట్, పాలి‹Ù్డ వజ్రాలు ఉన్నాయి. దిగుమతుల్లో రఫ్ డైమండ్స్, కట్ అండ్ పాలి‹Ù్డ డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, టెలికం పరికరాలు, పొటాషియమ్ క్లోరైడ్, హెర్బిసైడ్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది. నిపుణులు ఏమన్నారంటే... ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులపై తాజా పరిణామాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్క డ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావచ్చు. రఫ్ వజ్రాలకు దేశంలో కొరత ఏర్పడే వీలుంది. – కొలిన్ షా, కామా జ్యువెలరీ ఎండీ ఇజ్రాయెల్‌లోని మూడు అతిపెద్ద నౌకాశ్రయాలు – హైఫా, అష్డోద్, ఈలత్లలో కార్యకలాపాలు అంతరాయం కలిగితే ఆ దేశంతో భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎగుమతులకు ప్రతికూల పరిణామం ఇది. – అజయ్ శ్రీవాస్తవ, జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు ఈ వివాదం స్వల్పకాలంలో భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. యుద్ధం తీవ్రతరం అయితే, ఆ ప్రాంతానికి ఎగుమతులు జరిపే ఎగుమతిదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. – శరద్ కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ -
ఆర్థిక మందగమనం: జ్యుయల్లరీ ఎగుమతులు డౌన్
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జూలైలో స్వల్పంగా తగ్గాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశం ఈ కాలంలో రూ.24,914 కోట్ల (3,130 మిలియన్ డాలర్లు) విలువైన రత్నాలు, ఆభరణాలను ఎగుమతి చేసింది. జీజేఈపీసీ నివేదిక ప్రకారం 2021 ఇదే నెల్లో ఈ విలువ రూ.25,158 కోట్లు (3,376 మిలియన్ డాలర్లు). ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో వీటి ఎగుమతుల పరిమాణం 11 శాతం పెరిగి 1,03,931 కోట్లకు (13,368 మిలియన్ డాలర్లు) చేరింది. కాగా ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ స్థూల ఎగుమతులు 8 శాతం పెరిగి రూ.15,388 కోట్లకు (1,933.32 మిలియన్ డాలర్లు) ఎగశాయి. ఇక ఏప్రిల్–జూలై మధ్య వెండి ఆభరణాల ఎగుమతుల విలువ తొలి అంచనాల ప్రకారం 30 శాతం పెరిగి రూ.8,232 కోట్లకు (1,058 మిలియన్ డాలర్లు) ఎగసింది. -
3 నెలల్లో..రూ.77 వేల కోట్ల జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు!
న్యూఢిల్లీ: రత్నాభరణాల (జెమ్స్ అండ్ జ్యుయలరీ) ఎగుమతులు జూన్‌లో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 21.41 శాతం వృద్ధితో రూ.25,295 కోట్ల విలువ మేర ఎగుమతులు నమోదైనట్టు.. జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2021 జూన్ నెలలో ఎగుమతుల విలువ రూ.20,835 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) రత్నాభరణాల ఎగుమతులు 15 శాతం పెరిగి రూ.77,049 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన ఎగుమతులు రూ.67,231 కోట్లుగా ఉండడం గమనార్హం. యూఏఈతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (భారత్–యూఏఈ సీఈపీఏ) చేసుకున్న తర్వాత మధ్య ప్రాచ్యానికి ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కనిపించినట్టు జీజేఈపీసీ వివరించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు జూన్‌లో 8 శాతానికి పైగా పెరిగి రూ.15,737 కోట్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 35 శాతం వృద్ధితో రూ.5,641 కోట్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 35 శాతం పెరిగి రూ.6,258 కోట్లుగా ఉన్నాయి. యూఏఈతో ఒప్పందం ఫలితాలు ‘‘భారత్–యూఏఈ సీఈపీఏ మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే నెలలో ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ ఎగుమతులు యూఏఈకి 72 శాతం పెరిగి రూ.1,048 కోట్లుగా ఉన్నాయి. జూన్‌లోనూ 68 శాతం పెరిగి రూ.1,451 కోట్లుగా ఉన్నాయి’’ అని జీజేఈపీసీ వెల్లడించింది. మొత్తం మీద ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూఏఈ వరకే ఎగుమతులు 10 శాతం వృద్ధితో రూ.9,803 కోట్లుగా నమోదయ్యాయి. ‘‘యూఏఈతో సీఈపీఏ ఒప్పందం వల్ల ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ తక్షణమే లాభపడిన విభాగం. పరిమాణాత్మక మార్పును తీసుకొచ్చే విధానంతో మద్దతుగా నిలిచినందుకు వాణిజ్య శాఖకు ధన్యవాదాలు. ఈ ఒప్పందంలోని ప్రయోజనాలను భాగస్వాములు అందరూ వినియోగించుకుని లబ్ధి పొందాలి’’అని జీజేఈపీసీ చైర్మన్ కొలిన్ షా సూచించారు. -
కరోనా షాక్: తగ్గిన జువెల్లరీ ఎగుమతులు
సాక్షి,ముంబై: 2020-21లో జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్, ప్రయాణ ఆంక్షలే ఈ క్షీణతకు కారణమని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 2019–20లో ఈ పరిశ్రమ స్థూల ఎగుమతులు రూ.2,50,319.89 కోట్లుగా ఉన్నాయి. (మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!) జువెల్లరీ పరిశ్రమకు 2020-21అసాధారణ సంవత్సరమని..కొంతకాలంగా సాధారణ పరిస్థితులు నెలకోవటంతో రెండో అర్ధసంవత్సరంలో ఎగుమతుల్లో రికవరీ నమోదయిందని పేర్కొంది. తొలి మూడు త్రైమాసికాల్లో క్షీణత కనిపించగా.. నాల్గో త్రైమాసికంలో మాత్రం 12.73 శాతం వృద్ధి నమోదయిందని జీజేఈపీసీ చైర్మన్ కోలిన్ షా తెలిపారు. కట్ అండ్ పాలిష్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు గత ఆర్ధిక సంవత్సరంలో 8.87 శాతం తగ్గి రూ.1,32,015.25 కోట్ల నుంచి రూ.1,20,302.04 కోట్లకు చేరాయి. బంగారు ఆభరణాల ఎగుమతులు 57.89 శాతం క్షీణించి రూ.84,270.81 కోట్ల నుంచి రూ.35,483.17 కోట్లకు తగ్గాయి. వెండి ఆభరణాల ఎక్స్‌పోర్ట్స్ మాత్రం వృద్ధి చెందాయి. 43.55 శాతం పెరిగి రూ.11,955.75 కోట్ల నుంచి రూ.17,163.03 కోట్లకు వృద్ధి చెందాయి -
ఈ రత్నాలను మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు!
ప్రాచీన నాగరికతలలో రకరకాల రత్నాలు వినియోగంలో ఉండేవి. సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాయనే నమ్మకంతోనే ప్రాచీనులు రత్నాలను ధరించేవారు. దోషభరితమైన రత్నాలను ధరించినప్పుడే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు. దోషాలు లేకుండా ఎలాంటి రత్నమైనా ధరించదగ్గదేనని భావించేవారు. దోషాలతో నిమిత్తం లేకుండా ప్రాచీనులలో కొందరిని భయపెట్టిన రత్నం ఒకటి ఉండేది. అదే ‘ఓనిక్స్’. పురాతన సంస్కృత గ్రంథాలు దీనిని గోమేధకభేదంగా, శివధాతువుగా, పీతరత్నంగా పేర్కొన్నాయి. ‘ఓనిక్స్’ జాతికే చెందిన ‘హేసొనైట్ సార్డోనిక్స్’ను మన ప్రాచీనులు ‘గోమేధికం’గా నవరత్నాల జాబితాలో చేర్చారు. ‘ఓనిక్స్’ గోమేధికం కంటే కొంత భిన్నమైన రత్నం. అంతర్గతంగా సూక్ష్మస్ఫటికాలు కలిగిన క్వార్ట్, సిలికా, మోగనైట్ ఖనిజాలతో కూడిన ఖనిజ శిలల నుంచి ‘ఓనిక్స్’ రత్నాలు ఏర్పడతాయి. మోహ్స్ స్కేలుపై ‘ఓనిక్స్’ దారుఢ్యం 6.5–7.0 వరకు ఉంటుంది. ఇవి రకరకాల రంగుల్లో దొరుకుతాయి. అయితే, వీటిలో నలుపురంగులోనివి కొంత విరివిగా దొరుకుతాయి. ఓనిక్స్ రత్నాలను సానబెడితే చాలా నునుపుగా తయారవుతాయి. వీటిని కోణాలుగా తీర్చిదిద్ది సానబెట్టడం కొంత తక్కువే. ముడి ఖనిజం నుంచి కాస్త పెద్దసైజు రత్నాలుగా కూడా ఇవి దొరుకుతాయి. అందువల్ల శిల్పాలు చెక్కడానికి, వీటి ఉపరితలంపై చిత్రాలు చెక్కడానికి, తొలిచి పాత్రలు వంటి గృహోపకరణాలను తయారు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతల ప్రజలు వీటితో మలచిన శిల్పాలను, రకరకాల గృహోపకరణాలను తయారుచేసుకుని వినియోగించేవారు. ప్రాచీన చైనా ప్రజలు ‘ఓనిక్స్’ రత్నాలను దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. ముఖ్యంగా గాఢమైన నలుపు రంగులోని ఓనిక్స్ రత్నాలను ధరించడానికి వెనుకాడేవారు. విశేషమేమిటంటే, విదేశాలకు నౌకలలో వెళ్లే చైనా వర్తకులు మిగిలిన రత్నాలతో పాటు ఓనిక్స్ రత్నాలతోనూ వ్యాపారం చేసేవారు. మిగిలిన రత్నాలను తిరిగి వచ్చేటప్పుడు స్వదేశానికి తీసుకొచ్చేవారు గాని, ఓనిక్స్ రత్నాలను స్వదేశానికి రాక ముందే అయినకాడికి అమ్మేసేవారు. నలుపు రంగు ఓనిక్స్కు అరబిక్ భాషలో ‘ఎల్ జజా’ అనే పేరు ఉంది. అంటే, విషాదం అని అర్థం. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లో ప్రముఖుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు జెట్‌తో పాటు నలుపు రంగు ఓనిక్స్తో తయారైన ఆభరణాలను సంతాప సూచకంగా ధరించేవారు. ప్రేమ తాపాన్ని ఉపశమింపజేసేందుకు ప్రాచీన భారతీయులు ఓనిక్స్ రత్నాలను ధరించేవారని పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి గిరొలామో కార్దానో తన గ్రంథంలో రాశాడు. విపరీతమైన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచడానికి ఓనిక్స్ రత్నం బాగా పనిచేస్తుందని కొందరు ప్రాచీనులు నమ్మేవారు. అయితే, ఇది జీవనోత్సాహాన్ని కూడా తగ్గించి, దిగులు గుబులు పెంచుతుందని చాలామంది ఈ రత్నాన్ని ధరించడానికి భయపడేవారు. నల్లని ఓనిక్స్ రత్నాలకు ప్రేతాత్మలను ఆకర్షించే లక్షణం ఉందనే నమ్మకం కూడా అప్పట్లో బలంగా ఉండేది. ఓనిక్స్ రత్నాలకు సంబంధించి కొన్ని సానుకూల నమ్మకాలు కూడా ఉండేవి. ప్రాచీన రోమన్ సైనికులు ఓనిక్స్ రత్నాలపై యుద్ధాలకు అధిష్ఠాన దేవుడైన ‘మార్స్’ రూపాన్ని చెక్కించి, లాకెట్‌లా ధరించేవారు. దీనివల్ల యుద్ధంలో గెలుపు సాధించగలమని వారు నమ్మేవారు. నలుపురంగు ఓనిక్స్ రత్నాన్ని ధరించడం వల్ల మూర్ఛవ్యాధి తగ్గుతుందని పర్షియన్లు నమ్మేవారు. ప్రాచీనకాలం నుంచి వివిధ దేశాల్లో ఓనిక్స్ రత్నాలు వాడుకలో ఉన్నప్పటికీ, వీటి శిల్పాలు, గృహోపకరణాలతో పోల్చితే, ఆభరణాల్లో వీటి వినియోగం చాలా తక్కువగానే ఉండేది. నల్లని ఓనిక్స్ రత్నాలకు పూసల్లా రంధ్రాలు చేసి, వాటిని కూర్చిన దండలను ప్రాచీన, మధ్యయుగాల కాలంలో ఎక్కువగా మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు. ఆధునిక ఫ్యాషన్‌రంగంలో మార్పులు మొదలైన తర్వాతనే జనాలు ఓనిక్స్ రత్నాలను కాస్త ధైర్యంగా ఆభరణాల్లో ధరించడం మొదలైంది. చదవండి: పింక్‌బెల్ట్ మిషన్ ఏం చేస్తుందో తెలుసా? -
ఎగుమతులు పెరిగాయ్... దిగుమతులు తగ్గాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్ డాలర్లు. కాగా అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. ► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో నీరసం 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2019 జూన్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎగుమతులపై ప్రతికూల అవుట్‌లుక్‌ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్ ట్రేడ్ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ. అంతర్జాతీయ ప్రతికూలత ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్టీ తక్షణ రిఫండ్ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. – శరద్ కుమార్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రూపాయి క్షీణత ప్రభావమే.. జూన్ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ -
కళకళలాడుతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ షేర్లు
ముంబై: రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్ లో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ పలు కంపెనీల షేర్లు ధగధగ లాడుతున్నాయి. పండుగ ఉత్సాహంతో నెలకొన్న బైయింగ్ సపోర్ట్ తో దాదాపు అన్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ముఖ్యంగా గోల్డియం ఇంటర్నేషన్ లిమిటెడ్ 15శాతం, తారా జ్యుయలరీ 9శాతం, గీతాంజలి జెమ్స్ 11 శాతం, పీసీ జ్యుయలరీ 6 శాతం, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్ కో లిమిటెడ్ , రాజేష్ లిమిటెడ్ కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో స్పెక్యులేటర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టుల అంచనా. అటు బులియన్ మార్కెట్లో గత కొన్ని సెషన్లు గా నీరసంగా ఉన్న పసిడి ధరలు కూడా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉదయం నుంచీ జోరుమీదున్న పుత్తడి200 రూపాయల లాభంతో 29,780 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరలు Gold 193రూపాయలు ఎగిసి రూ. 29,850 వద్ద ఉంది. ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్లు స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.