ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జూలైలో స్వల్పంగా తగ్గాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశం ఈ కాలంలో రూ.24,914 కోట్ల (3,130 మిలియన్ డాలర్లు) విలువైన రత్నాలు, ఆభరణాలను ఎగుమతి చేసింది.
జీజేఈపీసీ నివేదిక ప్రకారం 2021 ఇదే నెల్లో ఈ విలువ రూ.25,158 కోట్లు (3,376 మిలియన్ డాలర్లు). ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో వీటి ఎగుమతుల పరిమాణం 11 శాతం పెరిగి 1,03,931 కోట్లకు (13,368 మిలియన్ డాలర్లు) చేరింది. కాగా ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ స్థూల ఎగుమతులు 8 శాతం పెరిగి రూ.15,388 కోట్లకు (1,933.32 మిలియన్ డాలర్లు) ఎగశాయి. ఇక ఏప్రిల్–జూలై మధ్య వెండి ఆభరణాల ఎగుమతుల విలువ తొలి అంచనాల ప్రకారం 30 శాతం పెరిగి రూ.8,232 కోట్లకు (1,058 మిలియన్ డాలర్లు) ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment